అప్పుడెప్పుడో చిరూ, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాలోలా కాదు కానీ… చిరంజీవి, మోహన్ బాబు సరదాగా నిజంగానే సిక్కిం ట్రిప్ వెళ్లారు. ఇద్దరు మేధావులు విహారయాత్రకు వెళ్తే ఎంత రచ్చే చేస్తారో…తనకు ఈర్ష్యగా ఉందంటూ ట్వీట్ చేసారు మంచు లక్ష్మీ. చిరంజీవి అంకుల్ నాన్నగారిని ఒప్పించి మరీ ఈ ట్రిప్ కి తీసుకెళ్లారని చెప్పడమే కాకుండా…త్వరలోనే మీ పిల్లలమైన మేమందరం కూడా మీతో పాటూ వచ్చే అవకాశం రావాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసారు మంచు లక్ష్మీ.

నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి….ఈ నలుగురు దర్శకులు కలిసి నాలుగు పిట్ట కథల్ని తెరకెక్కించారు. అదీ వెబ్ సిరీస్ కోసం. అవును ‘పిట్టకథలు’ పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం హిందీ సూపర్ హిట్ లస్ట్ స్టోరీస్ ను రీమేక్ చేసారు వీళ్లు. తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ హాట్ టాపిక గా మారింది.
తరుణ్ భాస్కర్ కథలో మంచు లక్ష్మి… నందినిరెడ్డి కథలో అమలాపాల్, జగపతిబాబు…నాగ్ అశ్విన్ కథలో శృతీహాసన్…సంకల్ప్ రెడ్డి కథలో సత్యదేవ్, ఈశారెబ్బా వంటివారు కీ రోల్స్ ప్లే చేసారు. టీజర్ చూస్తుంటేనే ఎంత బోల్డ్ గా ఈ సిరీస్ ఉండబోతుందో అర్ధమవుతుంది. ఒక్క మంచులక్ష్మి స్టోరీలో తప్ప మిగిలిన మూడింట్లో హాట్ సన్నివేషాలు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

Source: Netflix


నలుగురు మహిళలు, నాలుగు విభిన్న కథలు… వారి జీవితాల్లోని ప్రేమ, రకరకాల ఎమోషన్స్ వంటి వాటికి …ఈ నలుగురికి మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటన్నదే పిట్టకథల కథాంశం. ఈ మూవీ ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్ కానుంది. మరి డైరెక్ట్ తెలుగు సిరీస్ అంటూ హడావుడి చేస్తున్న నెట్ ఫ్లిక్స్ కి ఈ పిట్ట కథలు ఎంతలా హెల్ప్ అవుతాయో చూడాలి.