యంగ్ హీరో నాగశౌర్య , డెబ్యూ డైరెక్టర్ సంతోష్‌ జాగర్లపూడి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. నాగశౌర్య జోడీగా కేతిక శ‌ర్మ న‌టిస్తోన్న ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబుతో పాటూ సచిన్ ఖేడేకర్ కనిపించనున్నారు. నాగ‌శౌర్య 20వ ప్రాజెక్ట్ గా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో… స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నింటినీ జోడించి ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నారు. ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని ఎయిట్‌ప్యాక్ లుక్‌తో ఈ సినిమాలో స‌ర్పైజ్ చేయనున్నాడు నాగ‌శౌర్య‌. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్ కి, నాగ‌శౌర్య పుట్టినరోజు సంద‌ర్భంగా రిలీజైన టీజ‌ర్‌కి సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాదాపు 80శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ… ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. కీరవాణి కుమారుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై నారాయణ దాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.