యంగ్ స్టార్ కార్తికేయ హీరోగా..లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా… కౌశిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా చావుకబురు చల్లగా. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 9న జరగబోతోంది. ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
ఇక తాజాగా అనసూయ వేదాంతం చెపుతూ స్టెప్పులేసిన ఈ మూవీలోని పైన పటారం పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.

ఆ సంగతలా ఉంటే బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప మూవీ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. ఆగస్టు 13వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి అప్ డేట్స్ కోసం ప్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే వచ్చేనెల బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని టెన్ కాశీలో పుష్ప షూటింగ జరుగుతోంది.

సరికొత్త కథాంశంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటిస్తోన్న “చావు క‌బురు చ‌ల్ల‌గా ” మూవీ నుంచి తొలి పాట మై నేమ్ ఈజ్ రాజు విడుద‌లైంది. మెగా నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రుస విజయాలతో దూసుకుపోతున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా డెబ్యూ డైరెక్టర్ కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఆల్రెడీ విడుదలైన మూవీ టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ గెటప్ ఫ‌స్ట్ లుక్, ఇంట్రోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌ర్వాత వరుసపెట్టి విడుదలచేస్తున్న హీరో క్యారెక్ట‌రైజేషన్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ తో పాటూ మూవీ టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి అనూహ్య స్పందన లభించింది

మార్చి 19న భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ కంపోజ్ చేసిన మై నేమ్ రాజు అంటూ హీరో కార్తికేయ బస్తీ బాలరాజుగా సందడి చేస్తున్న ఇంట్రో సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. ఈ పాటని సింగర్ రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యాన్ని సమకూర్చారు. ఇప్పటికే సినిమాకు వస్తోన్న ట్రెమండస్ రెస్పాన్స్ బట్టి ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా ప్రేక్షకులని అలరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.

మార్చి 19న భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ కంపోజ్ చేసిన మై నేమ్ రాజు అంటూ హీరో కార్తికేయ బస్తీ బాలరాజుగా సందడి చేస్తున్న ఇంట్రో సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. ఈ పాటని సింగర్ రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యాన్ని సమకూర్చారు. ఇప్పటికే సినిమాకు వస్తోన్న ట్రెమండస్ రెస్పాన్స్ బట్టి ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా ప్రేక్షకులని అలరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.

‘రాజావారు రాణివారు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై ప్రేక్షకులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలను ఆకట్టుకున్న యువకుడు కిరణ్‌ అబ్బవరం. పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేసిన చిత్రమది. కథానాయకుడిగా రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ పాటలతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడు నటిస్తున్న మూడో చిత్రం ‘సెబాస్టియన్‌ పి.సి. 524’. కొత్త తరహా కథలతో రూపొందుతోన్న వినూత్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు విజయాలు కట్టబెడుతున్నారు. ఆ కోవలోకి చెందిన చిత్రమిది. ఈ సినిమా గ్లింప్స్‌ను రీసెంట్ గా ప్రముఖ కథానాయిక లావణ్యా త్రిపాఠి విడుదల చేశారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సెబాస్టియన్‌ పి.సి. 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోద్‌, రాజు నిర్మిస్తున్నారు. నైట్‌ బ్లైండ్‌నెస్‌ అంటే రేచీకటి నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. క్రిస్మస్‌ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా కథానాయిక లావణ్యా త్రిపాఠి ఈ సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు. గేటు దగ్గర్నుంచి వెళుతూ చర్చిని, తర్వాత జీసస్‌ను చూపించి, ఆ తర్వాత హీరో కిరణ్‌ అబ్బవరాన్ని చూపించడం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లింప్స్‌లో ‘ఓ తల్లికి న్యాయం జరగడం కోసం మరో తల్లి చేసిన ప్రామిస్‌’, ‘నిజం ఎప్పటికీ దాగదు’ వంటి కోట్స్‌ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి.

జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ఆయన సంగీతం అందిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. సినిమా కథతో పాటు కొత్తగా ఏదైనా చేయాలని యూనిట్ సభ్యుల తాపత్రయం ఆయనకు నచ్చడంతో ఈ సినిమా అంగీకరించారు. ‘సెబాస్టియన్‌ పి.సి. 524’లో కిరణ్‌ అబ్బవరం రెండు లుక్స్‌లో కనిపించనున్నారని గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది. మొదట గడ్డంతో కనిపించిన అతను, ఆ తర్వాత పోలీస్‌ డ్రస్‌లో క్లీన్‌ షేవ్‌తో కనిపించారు. సినిమాలో క్రిస్మస్‌ రోజున జన్మించిన క్రిస్టియన్‌ యువకుడు సెబాస్టియన్‌గా కిరణ్‌ అబ్బవరం కనిపించనున్నారు. అందుకని, గ్లింప్స్‌ చివర ‘హ్యాపీ బర్త్‌డే సెబా’ అని పేర్కొన్నారు. కిరణ్ అబ్బవరం సరసన నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.