హ‌ హ‌ హాసిని… అంటూ టాలీవుడ్ ప్రేక్ష‌కులను ఫిదా చేసిన హీరోయిన్ జెనీలియా. బొమ్మరిల్లు చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ స్మైలింగ్ క్వీన్ తర్వాత దాదాపు తెలుగు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో మెరిసింది. కెరీర్ మంచి స్థాయిలో ఉండగానే బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు బైబై చెప్పేసి ఇద్దరు పిల్లలకు తల్లైన జెనీలియా… సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. భర్త కం హీరో రితేష్‌తో ఫన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తూ యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్ జంటగా పేరుతెచ్చుకుంది రితేష్, జెనీలియా జంట.
రీసెంట్ గా టాలీవుడ్‌ రీ ఎంట్రీకి రెడీఅయిందట జెనీలియా. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిద్దరు జంటగా నటించిన రెడీ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రామ్ తో జెనీలియా దంపతులకు మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది. రామ్ ముంబై వెళ్లినా…జెనీలియా జంట హైదరాబాద్ వచ్చినా తప్పక కలుసుకుంటారు. సో ఇన్నాళ్లకు మళ్లీ రామ్ సినిమాతో జెనీలియా కనిపించబోతుందనే వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేపుతుంది.