టీమిండియా క్రికెట్ మాజీ ప్లేయర్‌ హర్భజన్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘ఫ్రెండ్‌ షిప్’. యాక్షన్ కింగ్ అర్జున్ మరో ప్రధానపాత్ర చేస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇక తాజాగా హర్భజన్ తన సినిమా టీజర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. హిందీతో పాటూ తెలుగు, తమిళ్ బాషల్లోని ఈ టీజర్‌ యూట్యూబ్‌ లింక్‌లను ఫ్యాన్స్ కు షేర్‌ చేస్తూ.. ‘నా సినిమా ‘ఫ్రెండ్‌షిప్‌’ టీజరొచ్చేసింది. లింక్స్‌ పెడుతున్నాను. చూసేయండి గాయ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు భజ్జీ. దీనికి సురేష్‌ రైనాతో పాటూ మరికొంతమంది ప్లేయర్స్, ఫ్యాన్స్ స్పందిస్తూ భజ్జీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలోని సాంగ్, ఫస్ట్ లుక్ లకు రెస్పాన్స్ లభించినట్టే ఈ టీజర్ సైతం అద్దరగొడుతూ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తో బిజీబిజీగా ఉన్న హర్భజన్‌ సింగ్ త్వరలోనే ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నాడు. టీజర్ చూస్తుంటే బాగానే నటించినట్టు కనిపిస్తోంది. అర్జున్ విలన్ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు భజ్జీ బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ‘ముజ్సే షాదీ కరోగీ’, ‘సెకండ్‌ హ్యాండ్‌ హస్బెండ్‌’ వంటి చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు. జాన్‌ పాల్‌రాజ్‌ ఇంకా శ్యామ్‌ సూర్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. నిజానికి 2019లో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇక తాజాగా శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకొనే పనిలో ఉంది. సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది.