సారంగధరియా సాంగ్ రికార్డ్ మీద రికార్డ్స్ కొట్టేస్తుంది. ఏ ముహూర్తాన సమంతా చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ అయిందో కానీ ఇప్పట్లో ట్రెండ్ ఆగేలా లేదు. అచ్చ తెలంగాణ పదాలకి చేసిన మ్యూజిక్ మ్యాజిక్ కి తోడూ సాయి పల్లవి డాన్స్ ఫిదా చేస్తే… వివాదాల వల్ల పబ్లిసిటీ ఇంకా పెరగడంతో.. సాంగ్ ఊపందుకుంది. ఇప్పటికే 9కోట్లకు పైగా వ్యూస్ తో పాటు 10 లక్షల లైకులు అతితక్కువ టైమ్ లో సాధించిన మొదటి తెలుగుపాటగా రికార్డ్ సాధించింది.

ఇప్పుడు రొడ్డకొట్టుడు సినిమాలని జనం నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. కొత్త పాయింట్, ఆకట్టుకునే కథనం ఉంటే తప్ప అంగీకరించట్లేదు. అయితే ప్రేక్షకులను అలరించడానికి ఏవో ట్విస్ట్ పాయింట్లను అటాచ్ చేస్తున్నారు దర్శకులు. కొత్త కొత్త పాయింట్లను తెరమీదికి తీసుకొస్తున్నారు. కొన్నింటికి ఆడియెన్స్ ఎస్ చెప్తుంటే…మరికొన్నింటికి నో అనేస్తున్నారు. ఇప్పుడలాగే ‘లవ్ స్టోరి’తో మన ముందుకు వస్తున్నారట శేఖర్ కమ్ముల.
తాజాగా బెంజ్ కార్ గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఓ డిఫరెంట్ పాయింట్ ను ‘ఉప్పెన’లో చూపించాడు. అయితే సినిమా రిలీజ్ కు ముందే ఈ ‘కటింగ్’ సీన్ గురించి జనాల్లో చర్చ మొదలైంది. హింట్ ఇచ్చి ప్రేక్షకులను ముందే ప్రిపేర్చేసారు. చివరికి జనాలు అంగీకరించారు కూడా.
రీసెంట్ గా రిలీజైన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో సైతం ఓ డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేసాడు డైరెక్టర్. భర్త చనిపోయిన స్త్రీ వెంటపడటం నుంచి తల్లికొడుకులు కలిసి మందు తాగడం వరకు..అంతేకాదు హీరో తల్లికి వేరే వ్యక్తితో సంబంధం వంటి ఆడ్ ముచ్చట్లను తెరకెక్కించాడు. కానీ ప్రేక్షకులు ఆదరించలేకపోతున్నారు.

మరోవైపు త్వరలోనే రిలీజ్ కాబోతున్న నాగ చైతన్య-సాయిపల్లవి కాంబో మూవీ ‘లవ్ స్టోరీ’లో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేసారట శేఖర్ కమ్ముల. చాలాకాలంగా జనాల్లో నలుగుతున్న ఓ ఆడ్ పాయింట్ ని లవ్ స్టోరికి అటాచ్ చేసారట. మరి దీనిని ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

మరో సాంగ్ సెన్సేషన్ కోసం రంగంలోకి దిగుతోంది ‘లవ్ స్టోరి’ మూవీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ”లవ్ స్టోరి” నుంచి విడుదలైన ప్రతి పాట హిట్ మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. ఇక సారంగదరియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలే సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. కాగా ఈ మూవీలోని మరో లవ్ సాంగ్ రిలీజ్ కి రెడీఅవుతోంది. ‘ఏవో ఏవో కలలే’ అంటూ వర్షం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటను గురువారం మార్నింగ్ 10 గంటల 08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట పోస్టర్ చూస్తుంటే ..పాట మంచి డాన్స్ ఐటమ్ అని తెలుస్తోంది. అందులో వాన పాట కావడంతో సాయి పల్లవితో పాటే చైతూ స్టెప్పులు ఇరగదీసి ఉంటారని చెప్తున్నారు. చూద్దాం లవ్ స్టోరిలోని ఈ కొత్త సాంగ్ ఏమాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో…

అదే రిలీజ్ తేదీని పోటీపడి మరి ప్రకటించింది లవ్ స్టోరి టీం. ఆల్రెడీ ఆ డేట్ ను ఎప్పుడో లాక్ చేసిన నాని టక్ జగదీష్ కి సవాల్ విసురుతూ ఎన్నో ఆలోచనల నడుమ ఏప్రిల్ 16నే వచ్చేందుకు సిద్ధమైంది లవ్ స్టోరి. అయితే విడుదల తేదీని రెండు సినిమాలు లాక్ చేస్తే… అది చివరికి రెవెన్యూ షేరింగ్కి దారి తీస్తుంది. అందుకే ఈమధ్య ఎవ్వరూ ఇలాంటి సాహసాన్ని చేయట్లేదు. బరిలో NNNఎవరూ లేకుండా జాగ్రత్తపడుతున్నారు. ఒకేరోజు రెండు సినిమాలు రిలీజైతే ఓపెనింగ్స్ లో షేరింగ్ ఉంటుందికానీ లాంగ్ రన్ లో మాత్రం టాక్ ను బట్టి ఎవరి షేర్ వారికే దక్కుతుంది. అలా కాదు పోటీ లేకుండా ఒక్క సినిమానే రంగంలోకి దిగితే స్పీడ్ రికవరీ పాజిబుల్ అవుతుంది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వర్కవుట్ అవుతుంది. ఇన్నాళ్లు ఈ ప్లాన్ నే వర్కవుట్ చేస్తున్నారు నిర్మాతలు. కానీ దీన్ని బ్రేక్ చేస్తూ రెండు పెద్ద సినిమాలు ఏప్రిల్ 16న నువ్వా నేనా అనుకుంటున్నాయిప్పుడు.
ఎందుకిలా జరిగింది? నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ల డేట్ ఫిక్స్ చేసుకోగా.. సడెన్ సర్ప్రైజ్ చేస్తూ చై లవ్ స్టోరికి అదే రిలీజ్ డేట్ ను ఖరారు చేయడం చర్చకు దారితీసింది. మజిలీ తర్వాత నాగచైతన్య, ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల కలిసి చేస్తున్న లవ్ స్టోరీని నానీపైనే పోటీగా ఎందుకు దించుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇలా వేడెక్కించడం వెనుక ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ కూడా అయిన టాలీవుడ్ అగ్ర నిర్మాత ఉన్నారన్న చర్చ నడుస్తోంది. అయితే నాని.. నాగచైతన్య ఈ ఇద్దరు హీరోలతోనూ ఆ నిర్మాతకు మంచి సంబధాలే ఉన్నాయి కానీ… తాను డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలకే ప్రాధన్యత కావాలనుకోవడం వల్ల ఈ సీన్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ క్లాష్ ని పరిష్కారించాలంటే హీరోలే బరిలోకి దిగాలి. నాని డిస్సప్పాయింట్ అయినా వెనక్కి తగ్గుతాడని అనుకుంటున్నారు. అంటే టక్ జగదీష్ వాయిదాపడే అవకాశం ఉంది. కానీ బామ్మర్థి, బామ్మర్థే…వ్యాపారం వ్యాపారమే అనుకుంటే ఎవరు లాభపడుతారో, ఎవరు నష్టపోతారో…ఇద్దరికీ సేమ్ రిజల్ట్ దక్కుతుందా…ముందు ముందు తెలుస్తుంది.NN

వేసవిలో విడుదలకు సిద్ధమైంది లవ్ స్టోరి. నాగచైతన్య, సాయిపల్లవి జోడిగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్‌స్టోరీ’ మూవీ ‘ఏప్రిల్‌ 16’న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పి, అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై పి.రామ్మోహన్‌ రావు, నారాయణ్‌దాస్‌ కె నారంగ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన మూవీ ఫస్ట్‌లుక్‌ తో పాటూ ‘ఏయ్‌ పిల్లా..’ పాటకు విపరీతమైన క్రేజ్ దక్కింది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటకు మంచి మార్కులే పడ్డాయి. టీజర్ లోని వీళ్లిద్దరి ఇంట్రడక్షన్ కి యూత్ బాగానే కనెక్టయింది. ప్రేమ, భావోద్వేగాలు, బంధాలు, గోల్…ఇలాంటి అంశాలతో కట్టిపడేసే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతోనూ ఆకట్టుకుంటారని అంటున్నారు. ఈశ్వరీ రావు, రాజీవ్‌ కనకాల, దేవయాని వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్‌ సి హెచ్‌ సంగీతం అందిస్తున్నారు.


కమ్ముల స్కూల్ నుంచి రాబోతున్న ‘లవ్ స్టోరీ’ యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తోంది. కేవలంలో తెలుగులో రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ఒక్క రోజులో 6మిలియన్ వ్యూస్ వైపు దూసుకెళ్తుంది. సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల నాడి పట్టుకోవడం శేఖర్ కమ్ములకి ప్రేమతో పెట్టిన విద్య. ఇప్పుడలాగే సాయిపల్లవి, నాగచైతన్యలతో మ్యాజిక్ క్రియేట్ చేసారు. రేవంత్, మౌనికలుగా వీళ్లిద్దరినీ అద్భుతంగా మలిచారు. ‘జీరోకెల్లి వచ్చిన సార్…చాన కష్టపడతా’ అనే డైలాగ్ తో చై పరిచయం కాగా, ‘జాబ్ గ్యారంటీగా వస్తుందనుకున్నానే’ అంటూ సాయిపల్లవి ఎంటరైంది.
టీజర్ చూస్తుంటే మధ్యతరగతి కష్టాలు, ప్రేమలను తెరపై ఆవిష్కరించబోతున్నంటు తెలుస్తోంది. రేవంత్ , మౌనిక స్నేహం, ప్రేమ ప్రయాణం, కష్టసుఖాలు, గోల్ రీచ్ కావడం కోసం చేసే కృషి ఇలా ఆద్యంతం లవ్ స్టోరీని అందంగా మలిచినట్టు అర్థమవుతుంది. హీరోహీరోయిన్లు ఊరు నుంచి పారిపోవడం, ‘ఏందిరా నన్ను వదిలేస్తావా’ అనే సన్నివేషాలతో ఉద్వేగానికీ గురిచేసారు. చూద్దాం..మరి త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోబోతున్న ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో…

అపురూప ప్రేమ కథలకి…సున్నితమైన భావోద్వేగాలను జోడించి తనదైన శైలిలో తెరకెక్కించే డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన నుంచి రాబోతున్న మరో మంచి సినిమా ”లవ్ స్టోరి”. ఈ బ్యూటిఫుల్ ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.‘‘ఫిదా’’ తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమాకావడం. నాగ చైతన్యకి తోడు సాయి పల్లవి వంటి స్టార్ కాస్టింగ్ ఉండటం ఈ ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెంచేసింది. రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీ రావు… ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది..
షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇక ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టీజర్ అప్ డేట్ రానే వచ్చింది. జనవరి 10న ఉదయం 10:08 గం.లకు ‘‘లవ్ స్టోరీ’’ టీజర్ను విడుదల చేయనున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది మూవీ టీమ్. ఇందులో
నాగచైతన్య చెవిలో సాయి పల్లవి ఏదో చెబుతోంది. చూడ ముచ్చటగా ఉన్న ఈ పోస్టర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.