క్రాక్ ఇచ్చిన ఊపుతో మంచి జోష్ మీదున్నారు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం రమేశ్ వర్మ డైరెక్షన్లో ఖిలాడి చిత్రం చేస్తున్న ఆయన..తన నెక్ట్స్ సినిమాకి కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 13న రవితేజ, త్రినథ రావు నక్కిన సినిమా ప్రారంభం కానుందని సమాచారం. రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం మే రెండో వారంలో ప్రారంభిస్తారట. కాగా సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఇప్పుడు నటిస్తోన్న ఖిలాడిలోనూ రెండు పాత్రల్లో కనిపించనున్నారు రవితేజ.

ఇదిలాఉంటే త్రినథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని టాక్. జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా, పెళ్లిసందడి2 ఫేం శ్రీలీలతో పాటూ లవ్లీసింగ్ సైతం మాస్ రాజా సరసన ఎంపికైంది. ముగ్గురు భామలతో రవితేజ పండించే కామెడీ, రొమాన్స్ ఓ లెవల్లో ఉంటుందని చెప్తున్నారు మూవీ మేకర్స్.