ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు ముహూర్తం కుదిరింది. మోహన్ రాజా డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇందులో ఒకప్పటి హీరోయిన్ సుహాసినితో పాటూ రీసెంట్ యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలను పోషిస్తున్నారని సమాచారం.

లూసిఫర్ రీమేక్ కి సంబంధించిన పూజా కార్యక్రమం గతంలోనే జరిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి…ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట మోహన్ రాజా. చిరంజీవి సూపర్ హిట్ మూవీ హిట్లర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మోహన్…ఇప్పుడు డైరెక్ట్ గా చిరూని డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో…సరికొత్తగా తెరకెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారట. తుది దశకు చేరుకున్న ఆచార్య అయిపోగానే…లూసిఫర్ రీమేక్ సెట్లో అడుగుపెడతారు చిరంజీవి.

‘ఆచార్య’ షూటింగ్‌ కోసం మారేడుమిల్లి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బన్నీ పుష్ప షూటింగ్ జరిగిన చోటే చిరూ ఆచార్యను సైతం చిత్రీకరించనున్నారు కొరటాల శివ. తాజాగా రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్ చేరుకున్న చిరంజీవికి ఘన స్వాగతం లభించింది. చిరు రాక గురించి ముందుగానే తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. భాజాభజంత్రీలు, పూలమాలలతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.

‘ఆచార్య’ సంగతలా ఉంటే…చిరూ నటించబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ లో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ చెల్లెలి పాత్ర కోసం అనూహ్యంగా త్రిష పేరు వినిపిస్తోంది. నయన్ చేస్తుందనుకున్న మెగాస్టార్ చెల్లెలి రోల్ లో త్రిష ఫిక్సయిందని టాక్. అదే నిజమైతే స్టాలిన్ రిలీజైన 15ఏళ్ల తర్వాత చిరూ, త్రిషాలను ఒకే సినిమాలో చూడొచ్చు. నిజానికి ఆచార్యలోనే త్రిషా హీరోయిన్ గా కనిపించాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ అని ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడిక చెల్లెలిగా నటించలేనని నయన్ చెప్పిన రోల్ కోసం త్రిషా డేట్స్ ఇచ్చేస్తుంది. చూద్దాం ముందు ముందు ఇంకేం జరుగబోతుందో…

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న లూసిఫర్ రీమేక్ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ లో నయన్ ఉంటారని ఓసారి, ఉండరని ఓసారి చెబుతున్నారు. అంతేకాదు కొందరు మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తారంటే కాదు చెల్లెలి పాత్రను చేస్తారని మరికొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

చిరూ లూసిఫర్ రీమేక్ లో ఆయన చెల్లెలుగా నటించేందుకు నయన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. చిరంజీవికి ధీటుగా చాలా పవర్ఫుల్ పాత్ర కాబట్టే నయన్ అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. నయన్ రిజెక్ట్ చేసారనే వార్తల్లో నిజం లేదని…ఆమె ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే ఇప్పుడు ఆమెకు జోడిగా కనిపించే ఓ హీరో కోసం సెర్చ్ చేస్తున్నారట మేకర్స్. అందరూ సెట్ అయిపోతే నటీనటులతో కూడిన పూర్తి సమాచారాన్ని అధికారిక ప్రకటనగా విడుదల చేస్తారట. కాగా వచ్చే మార్చి నుంచే లూసీఫర్ రీమేక్ సెట్స్ పైకెళ్లనుంది.

ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి…నెక్ట్స్ లూసిఫర్ రీమేక్ పనులను షురూ చేయనున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో నటించనున్నారు. అయితే ఈ రెండు కాకుండా డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. అయితే ఈ చిత్రంలో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి చిరూకి ధీటుగా విలన్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఉప్పెనలో విజయ్ నటనకు ముగ్ధుడైన చిరూ…అడిగిమరీ విజయ్ సేతుపతిని ప్రతినాయకుడిగా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.

చిరూ విలన్ సంగతలా అంటే ఎప్పటినుంచో సరైన ప్రతినాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు బోయపాటి – బాలకృష్ణ. అయితే వీరిద్దరి మూడో కాంబోమూవీలో విలన్ గా సునీల్ శెట్టి దాదాపు ఫిక్స్ అయనట్టేనని టాక్. త్వరలోనే ఆయన బాలయ్యతో పాటూ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. జగపతిబాబు, శ్రీకాంత్, అర్జున్…ఇలా చాలామందిని అనుకొని చివరికి సునీల్ శెట్టి దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అఘోరా వేషంలో షూటింగ్ చేస్తున్న బాలయ్యబాబు…త్వరలోనే సునీల్ శెట్టిని ఢీకొట్టే సీన్స్ లో నటించనున్నారు.

చిరూ లూసిఫర్ రీమేక్ ఆఫర్ ని రిజెక్ట్ చేసారట నయనతార. మొన్నటివరకు లూసిఫర్ రీమేక్ లో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటిస్తారనే వార్తలు చక్కర్లుకొట్టాయి. అయితే లూసిఫర్ ఒరిజనల్ మూవీలా కాకుండా ఇందులో చిరూ సరసన హీరోయిన్ ట్రాక్ యాడ్ చేసారట. ఆ హీరోయిన్ పాత్రలోనే నయన్ నటించాల్సిందిగా చిత్రయూనిట్ సంప్రదించారని టాక్. అయితే ఆ పాత్రకి ఇంప్రెస్ కాని నయనతార ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఇక ఇలా నయన్ నో చెప్పడంతో ఇప్పుడు చిరూ సరసన నటించే మరో తార కోసం సెర్చ్ చేస్తున్నారట డైరెక్టర్ మోహన్ రాజా.

సైరా నరసింహారెడ్డిలో చిరూ సరసన నటించిన నయనతార సంగతలా ఉంటే…అదే సినిమాలో ప్రత్యేకపాత్ర పోషించిన కిచ్చా సుదీప్ కథ వేరేలా ఉంది. ఆచార్య కోసం ఈగ విలన్ వస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ఆచార్య సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. చిన్న పాత్రైన చాలా ప్రాధాన్యత ఉండటంతో మేకర్స్ అడగ్గానే సుదీప్ ఓకే చెప్పారని టాక్. కన్నడ పరిశ్రమలో ఇటీవలే 25 వసంతాలు పూర్తిచేసుకున్న సుదీప్… ఇప్పుడిలా ఆచార్య కోసం అడగ్గానే కాదనకుండా ఓకే చెప్పారట.

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా ప్రారంభమైంది. మోహన్ రాజా డైరెక్షన్ లో లూసీఫర్ రీమేక్ అఫీషియల్ గా లాంచ్ అయింది. అయితే మన నేటివిటీకి తగ్గట్టు కథను పూర్తిగా మార్చి తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాని. సురేఖ కొణిదెల సమర్పిస్తుండగా… కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇంకా ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నాయి. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరి నయనతార, సత్యదేవ్ వంటి వారు ఉన్నారో లేదో తెలిసిపోతుంది.

ఈ మూవీ ఓపెనింగ్ బుధవారం ఫిలింనగర్ సూపర్ గుడ్ సంస్థ ఆఫీస్ లో పూజ కార్యక్రమంతో మొదలయింది. అల్లు అరవింద్, అశ్వినీదత్, డివివి దానయ్య, ఆర్ బి చౌదరి, నిరంజన్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నాగబాబు, డైరెక్టర్ కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమిని కిరణ్, బాబీ, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, గోపి ఆచంట, రామ్ ఆచంట, మిరియాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, యువి క్రియేషన్స్ విక్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెగాస్టార్ లూసీఫర్ రీమేక్ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. నయనతార చిరూ చెల్లెలిగా, సత్యదేవ్ మరో పాత్రలో కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే వీటి గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని తెలిసింది. స్వయంగా లూసీఫర్ రీమేక్ కు సంగీతం సమకూర్చబోయేది నేనే అని ప్రకటించాడు తమన్. ‘ప్రతి సంగీత దర్శకుడికి ఇది ఓ పెద్ద కల…ఇప్పుడు నా వంతు రానేవచ్చింది…మెగాస్టార్ పై నాకున్న అభిమానాన్ని నా మ్యూజిక్ తో తెలియజేస్తాను’ అని మురిసిపోయాడు తమన్.
అయితే ఈ మూవీకి సంబంధించి చాలామంది డైరెక్టర్ల పేర్లు తెరపైకొచ్చినా చివరికి… ఆ ఛాన్స్ ‘తనిఒరువన్‌’ మేకర్ మోహన్‌రాజాకు దక్కింది. మోహన్‌రాజా తీర్చిదిద్దిన రీమేక్‌ వెర్షన్‌ బాగా నచ్చడంతో.. వెంటనే చిరు డైరెక్టర్‌ను ప్రకటించారు. జనవరి చివరివారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకెళ్లనుందని.., ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిగ్ షెడ్యూల్ ప్లాన్‌ చేస్తున్నట్టు అధికారికంగా తెలియజేసారు. ఇక ఇప్పుడు తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ కూడా సిద్ధమయ్యాడు.