కొరియన్ మూవీ లక్ కీ ను రీమేక్ చేస్తున్నట్టుగా అధికార ప్రకటన చేసింది సురేష్ ప్రొడక్షన్స్. కీ ఆఫ్ లైఫ్ అనే జపనీస్ సినిమాకిది రీమేక్. హీరో సెంట్రిక్ గా సాగే ఈ కామెడీ థ్రిల్లర్ లో తెలుగు హీరోని, అగ్ర దర్శకుడిని కూడా ఫైనల్ చేసారు. అయితే వాళ్లిద్దరూ ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే రానా హీరోగా నందిని రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మిస్ గ్రానీని ఓ బేబీగా మార్చి సూపర్ హిట్ అందుకున్నారు నందినీరెడ్డి. ఇదే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ బేబీని నిర్మించింది. సమంతా ఓ రేంజ్ గుర్తింపును సంపాదించింది. ఇప్పుడిలానే హీరో బేస్డ్ మూవీ లక్ కీ ని నందినీరెడ్డి తెరకెక్కిస్తే బాగుంటుందని భావించారట సురేష్ బాబు. అందుకే ఆమెనే సంప్రదిచ్చినట్టు తెలుస్తోంది.

ఇక అన్నిరకాల ఎమోషన్స్ పలికించే ఛాన్స్ ఉంటుంది ఈ సినిమాలో హీరో పాత్రకి. రానాకి అయితే నటుడిగా మరో మెట్టు ఎక్కేందుకు తోడ్పడుతుందని అనుకుంటున్నారట. అందుకే రానాను హీరో పాత్ర కోసం ఫిక్స్ చేసినట్టు టాక్. ప్రస్తుతం లక్ కీకి సంబంధించి స్క్పిప్ట్ వర్క్ జరుగుతుంది. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు సురేష్ బాబు. దీన్నో పాన్ ఇండియన్ మూవీగా మలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.