ఎప్పటినుంచో చిరూ, చరణ్ లను ఒకే సినిమాలో చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాల్లో ఏదో కొద్ది సేపు మాత్రమే కలిసి కనిపించారు తండ్రీకొడుకులు. అయితే ప్యాన్స్ కలను నిజం చేస్తూ తండ్రి ఆచార్యగా కనిపిస్తోన్న సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్. అయితే అభిమానులు ఈ ఇద్దరినీ ఇంకా స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయకముందే మరో మెరుపులాంటి వార్త చక్కర్లుకొడుతుంది.

శంకర్ – చరణ్ – దిల్ రాజు కాంబినేషన్ సినిమా గురించి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్ లో చిరంజీవి కూడా భాగమవుతున్నారనే వార్త హైలైట్ గా మారింది. గతంలో శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరికను వ్యక్తం చేసారు చిరంజీవి. దానిని నిజం చేస్తూ కొడుకును డైరెక్ట్ చేస్తోన్న చిత్రంలో చిరూకి ఓ మెగా రోల్ ఆఫర్ చేసారట డైరెక్టర్ శంకర్. 100కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దిల్ రాజు కూడా సినిమా హైప్ పెచ్చేందుకు నిజంగానే చిరూని తీసుకొచ్చినా ఆశర్చపోనవసరం లేదంటున్నారు. మరి ఏదేమైనా అధికారిక ప్రకటన వస్తే ఇక ఫ్యాన్స్ ను ఆపడం ఎవరితరం కాదు.