తన 37వ బర్త్‌ డేను జరుపుకుంటున్నారు శర్వానంద్‌. అయితే ఈ హీరోకి ఊహించని సర్‌ప్రైజ్‌ ఎదురయ్యింది. తన బెస్ట్‌ ఫ్రెండ్‌.. రామ్‌ చరణ్‌ అర్థరాత్రి బర్త్‌ డే పార్టీ ఏర్పాటు చేసి శర్వానంద్‌ చేత కేక్‌ కట్‌ చేయించారు. ఈ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు శర్వా.


మరోవైపు శర్వానంద్‌ బర్త్‌ డే సందర్భంగా మహా సముద్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ రిలీజయింది. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో శర్వానంద్‌ తో పాటూ సిద్ధార్ద్ కూడా నటిస్తున్నాడు. ఇక కిశోర్‌ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన శ్రీకారం ట్రైలర్‌ రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న థియేటర్స్ కి రానున్న ఈ మూవీ ట్రైలర్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలాఉంటే కిషోర్ తిరుమల, శర్వానంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ పోస్టర్ విడుదలైంది. రష్మికా మంథన్నా ఇందులో లేడీ లీడ్ గా నటిస్తోంది. ఇలా వరుసగా శర్వా కొత్త సినిమాల అప్ డేట్స్ తో పుట్టినరోజును మరింత ఎగ్జైటింగ్ గా మారుస్తున్నారు మూవ మేకర్స్.

ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది మహాసముద్రం టీమ్. శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దీనికి దర్శకుడు. డిఫరెంట్ జానర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో…అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్.

తెలుగులో సిద్దార్థ్ కి ఈ చిత్రంతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇక వరుస కమిట్మెంట్స్ తో తీరిక లేకుండా దూసుకుపోతున్న శర్వానంద్ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్స్ అదితి, అనూ సైతం మంచి హోప్స్ పెట్టుకున్నారు దీనిపై. ఆర్ ఎక్స్ 100కి మించిన సూపర్ హిట్ ను టాలీవుడ్ కివ్వాలనే ఉద్దేశ్యంతో ఓ లెవెల్లో తీసుకున్నాడట అజయ్ భూపతి. మరి చూద్దాం ఆగస్టు 19న రాబోతున్న మహాసముద్రం ఏ మేరకు ఉప్పొంగుతుందో…..