సర్కారు వారి పాట తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో సందడి చేస్తోన్న నిధి…త్వరలోనే మహేశ్ బాబుతో ఆడిపాడనుందని సమాచారం.
నిజానికి ఈ సినిమాలో పూజాహెగ్దే పేరు వినిపించింది. ఎలాగూ డైరెక్టర్ త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్స్ ను రిపీట్ చేస్తుంటారు. త్రిష నుంచి మొదలెడితే ఇలియానా, సమంతా, పూజాహెగ్దే లాంటి వాళ్లు త్రివిక్రమ్ రెండేసి చిత్రాల్లో కనిపించిన వారే. అలాగే అరవింద సమేత, అల వైకుంఠపురంలో చిత్రాల తర్వాత మళ్లీ పూజాహెగ్దేనే రిపీట్ చేస్తారనే వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా మహేశ్ సినిమా కోసం నిధి పేరు తెరపైకొచ్చింది. మరి నిధి అగర్వాల్ సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుందా లేదంటా లీడ్ హీరోయిన్ గా హోరెత్తిస్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సూపర్‌ స్టార్‌ – మాటల మాంత్రికుడి కాంబినేషన్‌ మరోసార రిపీట్ కానుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నట్లు మహేశ్‌ బాబు ఇప్పటికే కొన్న సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ప్రజెంట్ మహేశ్‌ సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత దర్శక ధీర రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం బాబు.. రాజమౌళి కాంబో కంటే ముందు త్రివిక్రమ కలయికలో ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో త్రివిక్రమ్ ఈ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యారట. దీంతో సూపర స్టార్ అభిమానులు ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను సోషల్‌ మీడియా వేదికగా ట్రెండ్‌ క్రియేట్ చేస్తున్నారు.

2021 నవంబర్‌ లేదంటే డిసెంబర్‌ నెలలోనే ఈ కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభిస్తారట. మహర్షిలో మహేశ్ సరసన నటించిన బుట్టబోమ్మ పూజాహెగ్దే మరోసారి మహేశ్ తో జతకట్టబోతుంది. జీఎమ్‌ బెంటస్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ కలిసి నిర్మించబోతున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించనున్నాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్‌ శ్రీనివాస్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో సినిమా రానున్నట్టు ఈమధ్య వరుస కథనాలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు న్యూస్ హైప్ అవగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ న్యూస్ నిజం కాదంటూ ట్వీట్‌ చేసాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ‌‘ఎన్టీఆర్‌30’ ప్రాజెక్ట్ కు కాస్త విరామం ఇచ్చి ముందు మహేశ్‌ బాబు ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ సినిమాని తెరపైకి తీసుకొస్తారని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ కి పోటీగా మహేశ్ బరిలోకి దిగుతున్నాడన్న వార్త ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఒకటే వేషం ఈ ఇద్దరు వేస్తే ఎలా ఉంటుంది? కథ ఒకటే…రెబల్ స్టార్, సూపర్ స్టార్ లను వేరు వేరు వర్షన్స్ లో చూస్తే ఎలా ఉంటుంది?

రామాయణం…ఎన్ని సినిమాల్లో రాముని గాధను చూసినా బోర్ కొట్టని సబ్జెక్ట్. ఈ కథాంశాన్ని ఆధారంగా చేసుకునే ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 3డీ టెక్నాలజీతో పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నాడు. సగానికి పైగా ఆదిపురుష్ షూటింగ్ ను గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేయనున్నారు. కృతీ సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ కి పోటీగా మహేశ్ బాబు..దీపికా పదుకునే, హృతిక్ రోషన్ లతో కలిసి రంగంలోకి దిగనున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఆదిపురుష్ సినిమాకు పోటీ అన్నట్టు సూపర్ స్టార్ తో రామాయణం సినిమాని త్రీడీ ఫార్మెట్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది కూడా 300కోట్ల భారీ బడ్జెట్ తో. ప్రముఖ నిర్మాత మధు మంతెన చాలాకాలం నుంచే రామాయణాన్ని రూపొందించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రభాస్ నే హీరోగా అనుకున్నా…ఆయన ఆదిపురుష్ కి కమిట్ అవడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా మహేశ్ బాబుని…రామునిగా చూపించేందుకు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్, నిర్మాత మధుల మధ్య చర్చలు నడుస్తున్నాయి.

మహేశ్ బాబును రాముడిగా నటింపజేసేందుకు ట్రై చేస్తోన్న ఆ ప్రాజెక్ట్ లోనే… రావణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ని.. దీపికా పదుకొనేని సీత పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్ర నిర్మాతలుగా గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణం’ మూవీని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో డిలే అయిన ఈ ప్రాజెక్ట్… రీసెంట్ గా మహేశ్ బాబు, దీపికా పదుకోన్, హృతిక్ రోషన్ పేర్లతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది.

లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది ట్రిపుల్ ఆర్ . యాక్షన్ షూట్ తోపాటు ప్యాచప్స్ కంప్లీట్ చేస్తున్న RRR సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కంటిన్యూ అవుతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ సెట్స్ లో జరుగుతోంది. విజయ దేవరకొండ సైతం ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేలా లేడు. లైగర్ షూటింగ్ ఇంకా ముంబైలోనే చేస్తున్నారు పూరీ జగన్నాథ్.

చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చిన చిరంజీవి ఆచార్య టీమ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. ఏప్రిల్ 2 నుంచి ఆచార్య సినిమా కోకాపెట్ లో మళ్లీ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బెల్గాం ఆశ్రమంలో జరుగుతుంటే, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటిస్తోన్న సినిమా గోవాలో జరుగుతుంది. ఇక రామానాయుడు స్టూడియోలో శరవేగంగా దృశ్యం -2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు వెంకటేశ్.

మహేశ్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ గోవాలో జరుగుతుండగా… ఇటలీలో ఖిలాడీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రవితేజ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో పుష్ప సీన్స్ ను టోలీచౌకిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో కొనసాగుతుంది. సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లోనే జరుగుతుంది.

సినిమాలతోనే కాదు స్టేటస్ విషయంలోనూ పోటీపడుతున్నారు మన తెలుగు హీరోలు. మొన్నీమధ్యే లంబోర్గిని కార్ ను ఎన్టీఆర్ ఇటలీని నుంచి తెప్పించుకుంటే…దానికి మించి అన్నట్టు ప్రభాస్ మరో డూపర్ కార్ ను గ్యారేజ్ లోకి దించేసారు. రెమ్యూనిరేషన్ తోనే కాదు…కొత్త కార్ లో చక్కర్లు కొడుతూ ప్యాన్ ఇండియా స్టార్ స్టేటస్ చాటుతున్నాడు ప్రభాస్.

ప్రభాస్…ఇప్పుడు ఫస్ట్ టైమ్ 100 కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటోన్న స్టార్ మాత్రమే కాదు…అందరికంటే ముందు లంబోర్ఘిని అల్ట్రా రిచ్ కార్ ను సొంతం చేసుకున్న హీరో కూడా. నాలుగు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓవైపు ముంబైలో దాదాపు 50 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకుంటూనే…మరోవైపు తన గ్యారేజ్ లోకి లంబోర్ఘిని అవెన్‌టోడోర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ను తెచ్చేసారు. ఈ కార్ ఖరీదు అక్షరాల 6కోట్ల రూపాయలు.

ప్రభాస్ కి కాస్ట్ లీ కార్లపై ఉన్న ఇంట్రెస్ట్ గురించి తెలిసిందే. ఈ హీరో హోమ్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన జాగ్వార్ ఎక్స్ జె ఆర్, రోల్స్ రాయస్ ఫాంటమ్ కార్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ తలదన్నే లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్ స్టర్.. అదికూడా స్టైలిష్ లుక్ లో కనిపించే అరాన్సియో అట్లాస్ షేడెడ్ వెర్షన్ ని సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఈ కార్ కొన్న రెండో వ్యక్తి ప్రభాస్ కావడం విశేషం. తన తండ్రి సూర్యనారాయణరాజు జయంతి సందర్భంగా ప్రభాస్‌ ఈ కార్ ను కొన్నట్టు తెలుస్తోంది.

ఈమధ్యే ఎన్టీఆర్ లంబోర్గిని ఉరుస్ కార్ ను బుక్ చేసుకున్నారు. 5కోట్ల రూపాయల విలువ చేసే ఆ కార్ ను మించిన కాస్ట్ లీ కార్ ఇప్పుడు ప్రభాస్ సొంతమైంది. 3కోట్లు విలువ చేసే రోల్స్ రాయల్ ఫాంటమ్ కార్ ని చిరూ వాడుతుంటే…మూడున్నర కోట్లు వెచ్చించి రేంజ్ రోవర్ తీసుకున్నారు రామ్ చరణ్. రెండున్నర కోట్ల రేంజ్ రోవర్ కార్లో మహేశ్ దూసుకుపోతుంటే…అంతే విలువ చేసే బెంజ్ G63 కార్ అఖిల్ సొంతం. ఇక 2కోట్లకు మించిన మోస్ట్ స్టైలిష్ కార్స్ జాగ్వార్, రేంజ్ రోవర్ ఓనర్…అల్లు అర్జున్. ఇలా కార్స్ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు.

మరో సాంగ్ సెన్సేషన్ కోసం రంగంలోకి దిగుతోంది ‘లవ్ స్టోరి’ మూవీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ”లవ్ స్టోరి” నుంచి విడుదలైన ప్రతి పాట హిట్ మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. ఇక సారంగదరియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలే సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. కాగా ఈ మూవీలోని మరో లవ్ సాంగ్ రిలీజ్ కి రెడీఅవుతోంది. ‘ఏవో ఏవో కలలే’ అంటూ వర్షం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటను గురువారం మార్నింగ్ 10 గంటల 08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట పోస్టర్ చూస్తుంటే ..పాట మంచి డాన్స్ ఐటమ్ అని తెలుస్తోంది. అందులో వాన పాట కావడంతో సాయి పల్లవితో పాటే చైతూ స్టెప్పులు ఇరగదీసి ఉంటారని చెప్తున్నారు. చూద్దాం లవ్ స్టోరిలోని ఈ కొత్త సాంగ్ ఏమాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో…

ప్రెజెంట్ ట్రెండ్ మారింది. స్టార్‌ హీరో అంటే సొంత కారవాన్‌ ఉండాల్సిందే. అదీ సూపర్ మల్టీ స్పెషాలిటీ కారవాన్ అయిఉండాలి. ఇప్పటికే టాలీవుడ్‌ పరిశ్రమలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అందరికంటే అల్ట్రా మోడ్రన్ లగ్జరీ వానిటీ వ్యాన్‌ సొంతం చేసుకున్నారు. కాగా తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ కారవాన్‌ను దక్కించుకున్నట్టు వార్తొలొచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు బాగా వైరలయ్యాయి. ఈ వ్యాన్‌ను ప్రిన్స్ దగ్గరుండి మరీ డిజైన్ చేయించుకున్నారట. హాల్, బెడ్రూమ్, బాత్‌రూమ్‌, కిచెన్‌, టీవీతో సహా సకల సౌకర్యాలతో వావ్ అనిపించేలా ఉంది. దీనికోసం మహేశ్‌ బాబు ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇప్పుడు తాను నటిస్తోన్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్‌ సెట్స్ లో దీన్ని పార్క్‌ చేసేందుకు ఓ షెడ్డును కూడా ఏర్పాటుచేసారు.
అయితే బాలీవుడ్‌ స్టార్ షారుఖ్‌ ఖాన్‌…సేమ్ టు సేమ్ ఇలాంటి కారవాన్‌ కోసమే ఆరున్నర కోట్లు ఖర్చు చేసారు. అయితే దాన్న తలదన్నేలా డిజైన్ చేయించుకున్న మహేశ్‌…దీని కోసం రెండు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చుపెట్టారు. లేట్‌గా తీసుకున్నా లేటెస్ట్ లుక్ తో అద్దరిపోతున్న మహేశ్‌ కారవాన్‌ పిక్స్ గురించే ప్రజెంట్ సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

వాళ్లు, వీళ్లు కాదు…ఏకంగా మహేశ్ బాబుతోనే జాన్వీకపూర్ ఎంట్రీ ఉండబోతుందనే ప్రచారం జోరందుకుంది. నిజానికి మహేశ్ ఫాదర్ సూపర్‌ స్టార్‌ కృష్ణ, గ్లామర్ క్వీన్ గా సినీరంగాన్ని ఏలిన శ్రీదేవి కాంబోలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి మనకి తెలిసిందే. అప్పట్లో వీరి జంటకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్టీఆర్ సినిమా అనీ, రామ్ చరణ్ సినిమా అనీ అనుకుంటే కృష్ణ వారబ్బాయి సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తొలిసారి టాలీవుడ్ సినిమా కోసం వర్క్ చేయబోతుందని టాక్. ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. అంతేకాదు ఓ న్యూ టాలెంట్ ని ఈ ప్రాజెక్ట్ తో డైరెక్టర్ గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. చిత్రీకరణను కూడా ఎక్కువగా సాగదీయకుండా రెండు నెలల్లోనే పూర్తి చేస్తారని చెప్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే!

ప్రస్తుతం ‘గీతా గోవిందం’ ఫేం పరశురామ్‌ డైరెక్షన్లో మహేశ్ చేస్తున్న ‘సర్కారు వారి పాట‘ పూర్తవగానే మహేశ్‌ జాన్వీతో సినిమా పట్టాలెక్కింటనున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాతే దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

మహేశ్ బాబు, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ సెట్టయింది. కానీ సినిమా కోసం కాదు…ఓ పాపులర్ బ్రాండ్ యాడ్ ఫిల్మ్ కోసం వీరిద్దరూ కలిసి వర్క్ చేయనున్నారు. అవును నిన్నటివరకు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో మహేశ్ బాబు ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నది ఓ ప్రముఖ బ్రాండ్ యాడ్ కోసమని తాజాగా సీక్రెట్ రివీలైంది.

ఎప్పటినుంచో ఆ బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్న మహేశ్ బాబు…కావాలనే డైరెక్టర్ గా సందీప్ రెడ్డిని రికమెండ్ చేసారట. మహేశ్ కోరికను సందీప్ కూడా కాదనకుండా ఎస్ చెప్పాడని తెలుస్తోంది. వెంటనే ఆ బ్రాండ్ ఇద్దరినీ కలిపి మాట్లాడుకోవడం కూడా జరిగినట్టు చెబుతున్నారు. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ యాడ్ ఫిల్మ్ లో మహేశ్ బాబుని…అది కూడా సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యాడ్ లో సూపర్ స్టార్ ని చూడొచ్చని సంబరపడుతున్నారు ఫ్యాన్స్.

మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా వకీల్ సాబ్ చిత్రం నుంచి ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. సీరియ‌స్ లుక్‌లో ప‌వన్ కనిపిస్తుడగా… వెనుక నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నిల్చుని ఉన్నారు.


మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విరాట ప‌ర్వం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేక‌ర్స్. సాయిపల్లవితో పాటూ ఈ ప్రాజెక్ట్ లో మిగిలిన లేడీ లీడ్స్ ను రానా తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేసారు.


అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ మూవీ నుంచి మహిళలను పరిచయం చేస్తూ ఓ ఫోటోను రిలీజ్ చేసారు. స్ట్రాంగ్ ఉమెన్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షాలంటూ కామెంట్ చేసారు.

ఉమెన్స్ డే సందర్భంగా పలువురు సెలెబ్రిటీస్ విషెస్ షేర్ చేసారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న త‌ల్లి, స‌తీమ‌ణి, కూతురు ఫొటోను షేర్ చేస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. తన తల్లి కాళ్లు నొక్కుతున్న ఫోటోను నాగశౌర్య పంచుకోగా… అమ్మతో సరదాగా ఉన్న పిక్ ను ధరమ్ తేజ్, తన జీవితంలో ఉన్న సూపర్ ఉమెన్స్ అంటూ సామ్ ఒక ఫోటోను పోస్ట్ చేసారు.