వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాగశౌర్య క్రేజీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు లైన్లో పెడుతున్నాడు. లేడీ డైరెక్టర్ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను సినిమా చేస్తూనే అనీష్ కృష్ణ డైరెక్షన్లో మరో సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటూ కొత్త దర్శకుడు కె.పి.రాజేంద్ర కాంబినేషన్లో ‘పోలీసువారి హెచ్చరిక’ను తీసుకొస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై మహేష్‌ ఎస్‌.కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులోనే నాగశౌర్యకి జంటగా దివ్యాంశ కౌశిక్‌ సెలెక్టయింది. ‘మజిలీ’ మూవీలో నాగచైతన్య ప్రేయసిగా కనిపించిన కథానాయికే దివ్యాంశ. కాగా నాగశౌర్యకిది 23వ సినిమా. ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్ వచ్చే నెల నుంచే షూటింగ్ షురూ చేస్తుందని సమాచారం.