హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు ఐశ్వర్య రాయ్. ఒక్కరే కాదు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యలతో కలిసి వచ్చారు. రావడంతోనే రామోజీ ఫిల్మ్ సిటీని చేరుకున్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వం’ షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె ముంబై నుంచి వచ్చారు. 2019లోనే అంతా సెట్టయినా కరోనా కారణంగా పొన్నియన్ సెల్వం షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడిక జాగ్రత్తలతో షూటింగ్ ను మొదలెట్టడంతో ఈ మూవీలో నటించే యాక్టర్స్ ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మణిరత్నం ప్రస్తుతం పూర్తిగా రంగంలోకి దిగారు. ఓవైపు ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు సిట్టింగ్స్ లో కూర్చున్నాడు.
రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ను మలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు మణిరత్నం. ఐశ్వర్యతో పాటూ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిషా లీడ్ రోల్స్ చేస్తున్నారిందులో. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా మెరవనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మొదట ఐశ్వర్య రాయ్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో తీయబోతున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఐశ్వర్య ఈ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్రిషా గుర్రపు స్వారీ నేర్చుకునే పనిలో ఉంది. ఇలా ప్రస్తుతం ఎవరికి క్యారక్టర్ కి తగ్గట్టు కసరత్తులు చేస్తున్న పొన్నియన్ సెల్వం కాస్ట్ అంతా త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతుంది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Rebecca Memsaab (@voiceswriter)