‘దృశ్యం 2’ సినిమా చిత్రీకరణలో ఎంట్రీ ఇచ్చారు కథానాయకి మీనా. 2014లో రిలీజై సూపర్‌ హిట్‌ అయిన ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో ప్రధానపాత్రల్లో భార్యభర్తలుగా నటించిన వెంకటేష్, మీనాయే ఈ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు. సోమవారం నుంచి మీనా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే సినిమా కథాంశంతో సంబంధం లేకుండా ఓవర్ మేకప్ విషయంలో మలయాళీ దృశ్యంకి ఎదురైన అనుభవాలు…తెలుగు వర్షన్ కి ఎదురవకుండా మీనా జాగ్రత్తపడతారో..లేదో చూడాలి.

దృశ్యం – 2 సినిమాలో హీరోయిన్ పూర్ణ కూడా ఓ కీ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ముందుగా అనుకున్నట్టు సరితా, సాబు పాత్రల్లో సమంతా, రానా కాకుండా…రానా పోలీసాఫీసర్ రోల్ చేస్తుండగా…సరిత పాత్రను పూర్ణ చేయబోతున్నట్టు టాక్. సమంతా ఈ సినిమాలో కనిపించకపోవచ్చు. మలయాళ ఒరిజనల్ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన క్రియేటివ్ జీతూ జోసెఫ్‌ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా టాలీవుడ్ పరిశ్రమకి పరిచయం కాబోతున్నారు. వెంకీ నటిస్తోన్న ఎఫ్ 3 కంటే ముందే ఈ మూవీ జూలైలో రిలీజ్ కానుంది. అందుకే ఎక్కడా ఆగకుండా చకాచకా చేసేస్తున్నారు మేకర్స్.

వెంకటేష్‌, మీనా ప్రధానపాత్రల్లో 2014లో వచ్చిన మలయాళ రీమేక్‌ మూవీ ‘దృశ్యం’ మంచి సక్సెసైన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీ వేదికగా దృశ్యం – 2 సైతం రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంటుంది. కాగా స్టోరీ బాగా నచ్చడంతో పార్ట్ 2లో సైతం నటించేందుకు అంగీకరించారు వెంకటేశ్. ఇక ‘దృశ్యం-2’కి రంగం సిద్ధం చేశారు. తెలుగులో మొదటి భాగాన్ని లేడీ డైరెక్టర్ శ్రీప్రియ డైరెక్ట్ చేయగా…దృశ్యం – 2కి మాత్రం మలయాళీ ఒరిజనల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి తాజాగా పూజా కార్యక్రమాలని హైదరాబాద్‌ నగరంలో నిర్వహించారు. మార్చి 5వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే పార్ట్‌-3కి సైతం దర్శకుడు జీతూ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక తాజాగా ‘నారప్ప’ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంకీ ‘ఎఫ్‌3’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇంతలోనే దృశ్యం 2ను మొదలెట్టారు.

పెద్దన్నయ్య అంటే నందమూరి బాలకృష్ణ సినిమా కాదు. రజినీకాంత్ ‘అన్నాత్తే’. అన్నాత్తే అంటే తెలుగులో పెద్దన్నయ్య. అవును రజినీకాంత్ తిరిగి అన్నాత్తే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ తదితరులు నటిస్తున్నారు. గతేడాది డిసెంబరులో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ చిత్ర షూటింగ్‌ను లాక్ డౌన్ తర్వాత స్టార్ట్‌ చేశారు. కానీ మూవీ యూనిట్ లో కొందరు కరోనా బారిన పడటంతో చిత్రీకరణ నిలిచిపోయింది. అదే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కుదుటపడ్డాక చెన్నై చేరుకున్న రజినీకాంత్…మళ్లీ షూటింగ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారట. దీంతో అన్నాత్తేను రీస్టార్ట్ చేసేందుకు డైరెక్టర్ శివ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 15వ తేదీన షూటింగ్ ఆరంభించడానికి రెడీ చేస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే సూపర్ స్టార్ కూడా పాల్గొనబోతున్నారట. ఇప్పటికే సినిమా చిత్రీకరణకు బాగా ఆలస్యమైందని…నటీనటుల కాల్షీట్స్‌ సమస్య తలెత్తకుండా అన్నాత్తే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ నవంబరు 4న ‘అన్నాత్తే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.