ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు ముహూర్తం కుదిరింది. మోహన్ రాజా డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇందులో ఒకప్పటి హీరోయిన్ సుహాసినితో పాటూ రీసెంట్ యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలను పోషిస్తున్నారని సమాచారం.

లూసిఫర్ రీమేక్ కి సంబంధించిన పూజా కార్యక్రమం గతంలోనే జరిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి…ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట మోహన్ రాజా. చిరంజీవి సూపర్ హిట్ మూవీ హిట్లర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మోహన్…ఇప్పుడు డైరెక్ట్ గా చిరూని డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో…సరికొత్తగా తెరకెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారట. తుది దశకు చేరుకున్న ఆచార్య అయిపోగానే…లూసిఫర్ రీమేక్ సెట్లో అడుగుపెడతారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సినిమా చేయబోతున్నారనే వార్త జోరందుకుంది. గతంలో ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజా, ది జెంటిల్ మెన్ వంటి హిందీ చిత్రాలు చేసిన అనుభవం చిరూకుంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ బి అమితాబ్ కోసం చిరంజీవి సినిమా చేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ అడిగిన వెంటనే సైరా లో పాత్ర చేసిన అమితాబ్…ఇప్పుడు చిరంజీవిని రిస్వెస్ట్ చేసారని…చిరూ కూడా వెంటనే అంగీకరించారని తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్నది ఫుల్ లెంత్ పాత్రా…గెస్ట్ క్యారెక్టరా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మే 13న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతుంది. అయితే ఇందులో హీరోయిన్ రెజీనా చిరూ సరసన స్టెప్పులేసినట్టు టాక్. చిరూ, చరణ్ లపై కొరటాల శివ చిత్రీకరించిన ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే దీనిపై అధికార సమాచారం రావాల్సిఉంది.

మంచు విష్ణు, కాజల్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం… మోసగాళ్లు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం మూవీ యూనిట్ కి తన శుభాకాంక్షాలని తెలియజేసారు. ఈ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేయడం విశేషం. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఐటి స్కాం ను బేస్ చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. నవదీప్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి మరో ముఖ్య పాత్రల్లో నటించిన మోసగాళ్లు ట్రైలర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది. దక్షిణాది భాషలన్నింటితో పాటూ హిందీలో కూడా అతిత్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Telugu Filmnagar

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న లూసిఫర్ రీమేక్ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ లో నయన్ ఉంటారని ఓసారి, ఉండరని ఓసారి చెబుతున్నారు. అంతేకాదు కొందరు మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తారంటే కాదు చెల్లెలి పాత్రను చేస్తారని మరికొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

చిరూ లూసిఫర్ రీమేక్ లో ఆయన చెల్లెలుగా నటించేందుకు నయన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. చిరంజీవికి ధీటుగా చాలా పవర్ఫుల్ పాత్ర కాబట్టే నయన్ అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. నయన్ రిజెక్ట్ చేసారనే వార్తల్లో నిజం లేదని…ఆమె ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే ఇప్పుడు ఆమెకు జోడిగా కనిపించే ఓ హీరో కోసం సెర్చ్ చేస్తున్నారట మేకర్స్. అందరూ సెట్ అయిపోతే నటీనటులతో కూడిన పూర్తి సమాచారాన్ని అధికారిక ప్రకటనగా విడుదల చేస్తారట. కాగా వచ్చే మార్చి నుంచే లూసీఫర్ రీమేక్ సెట్స్ పైకెళ్లనుంది.

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంప‌తుల‌ 42వ వివాహ వార్షికోత్సవం నేడు. 1980, ఫిబ్రవరి 20వ తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. చిరంజీవి సుప్రీం హీరోగా ఎదుగుతున్న దశలో అల్లూవారి అమ్మాయి..అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి సంచలనం సృష్టించారు చిరంజీవి. ఓ మెగా సామ్రాజ్యాన్నే నెలకొల్పారు.

చిరంజీవి, సురేఖల 42వ పెళ్లిరోజు సంద‌ర్బంగా పలువురు ప్ర‌ముఖులు, బంధువులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. ఇక తల్లిదండ్రులను ఉద్ధేశిస్తూ రామ్ చ‌ర‌ణ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. మీరే నా బలం అంటూ సోషల్ మీడియా వేదికగా త‌ల్లిదండ్రుల ఫొటోని షేర్ చేసి సంతోషపడ్డారు.

ఈమధ్యే గోదావరిఖని కోల్ మైన్స్ లో షూటింగ్ జరుపుకున్నాపు ప్రభాస్ – ప్రశాంత్ నీల్. ఆ మధ్య విజయ్ దేవరకొండ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కోసం సింగరేణి ఉద్యోగిగా కనిపించాడు. కాగా తాజాగా మెగాస్టార్‌ చిరూ నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్‌ మార్చి 7 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా ఇల్లందులోని జేకే మైన్స్ లో జరుగబోతుంది. ఇక్కడి బొగ్గు గనుల్లోని ఓపెన్‌కాస్ట్‌, అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. చిరంజీవి, రాంచరణ్‌ కాంబినేషన్ సన్నివేశాలను సైతం ఇక్కడే చిత్రీకరించనున్నారు. ఇందుకోసం అవసరమైన పర్మిషన్స్ కోసం డైరెక్టర్ కొరటాల శివ… రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను సంప్రదించారు. ఇందుకు ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారు.

చిత్రీకరణ కోసం సింగరేణి అనుమతితో పాటూ మెగాస్టార్ చిరంజీవికి తన గృహంలో ఆతిథ్యం సైతం ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. టూరిజం పరంగా ఖమ్మం జిల్లా బాగా అభివృద్ధి చెందిందని, వివిధ సినిమాల షూటింగ్స్ కోసం ఇక్కడ ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయని కొరటాల శివ తెలియజేసారు. ఇక ఇప్పటికే పూజాహెగ్దే ఇందులో గిరిజన యువతిగా రామ్ చరణ్ సరసన నటించేందుకు అంగీకరించింది. సింగరేణి గనుల్లో చిరూ, చరణ్ షూటింగ్ పార్ట్ అయ్యాక…చరణ్ – పూజాహెగ్దే పార్ట్ ను షూట్ చేయనున్నారు కొరటాల శివ.

నిన్న సాయంత్రం రిలీజైన ఆచార్య టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ కొనసాగిస్తోంది. ఇప్పటికీ నంబర్ 1 ట్రెండింగ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతానికైతే 7మిలియన్ ప్లస్ వ్యూస్ తో మెగా స్టామినా చాటుతున్న ఆచార్య టీజర్…గంటగంటకి ఆశ్చర్యపోయేలా వ్యూస్ ని మార్చుకుంటుంది.

మే 13న సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల ఉత్సాహానికి అదుపు లేకుండా పోయింది. టీజర్ ఇచ్చిన హెవీ బూస్టప్ తో ఆచార్య… హాళ్లకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటోంది ఆచార్య. రామ్ చరణ్, చిరంజీవి, పూజా హెగ్డే కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించాలి. వీటితో పాటు మరికొన్ని ప్యాచప్ సీన్స్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తారు కొరటాల శివ. ఇలా అన్ని పనులను హై స్పీడ్ లో చేసుకుంటూ మే 13న రిలీజ్ కి రెడీ అవుతుంది చిరూ ఆచార్య.

మెగాస్టార్ ఆచార్యగా వచ్చేసారు. “ఇతరుల కోసం వచ్చేవారు దైవంతో సమానం” అంటూ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఆచార్యను ప్రెజెంట్ చేసారు. తాజాగా రిలీజైన టీజర్ తో కుమ్మేస్తున్నారు చిరంజీవి. “పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా….అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో…”అన్న డైలాగ్ తో అద్దగరొట్టారు చిరూ. జనవరి 29న ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటాయని డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించినట్టు…నిజంగానే ధర్మస్థలి తలుపులు తెరుచుకొని ఠీవీగా బయటికొచ్చారు ఆచార్యగా చిరంజీవి. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన టెంపుల్ సెట్ లో జరుగుతోంది. సిద్ధగా నటిస్తోన్న రామ్ చరణ్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ.
త్వరలోనే చరణ్ జోడీగా పూజాహెగ్దే కూడా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ సీన్స్ అయ్యాక…చిరూ, చరణ్…చిరూ, చరణ్, పూజాహెగ్దే ఇలాంటి కాంబినేషన్స్ తో మరకొన్ని సీన్స్ ను ప్లాన్ చేసారు కొరటాల శివ. సోనూ సూద్ ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థతో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆచార్యను నిర్మిస్తున్నారు.

Source: konidela production

మెగాస్టార్ ఆచార్యకు సంబంధించి క్రేజీ అప్డేట్ రిలీజ్ చేసారు. మూవీ టీజర్ రిలీజ్ డేట్ ని మెక్షన్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసారు. దానికన్నా ముందు నిన్న చిరూ అడిగిన టీజర్ ఎప్పుడూ అన్న ప్రశ్నకు…’డియర్ చిరూ సర్, ధర్మస్థలి తలుపులు జనవరి 29 సాయంత్రం 4 గంటల 5నిమిషాలకు తెరుచుకుంటాయి’ అంటూ కొరటాల శివ బదులిచ్చారు. ఆ తర్వాత ఈ న్యూస్ కి సంబంధించి వీడియోను రిలీజ్ చేసారు. సో జనవరి 29 సాయంత్రం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచారయ టీజర్ వచ్చేస్తుందన్నమాట.
కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక చెర్రీకి జోడిగా పూజా హెగ్దే దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని తెలుస్తోంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా…కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ లు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆచార్య నుంచి రిలీజైన చిరూ ఫస్ట్ లుక్, టెంపుల్ సెట్ వీడియో, రామ్ చరణ్ బ్యాక్ లుక్ జనాల్ని బాగా ఆకర్షించాయి. మరి 29న రానున్న టీజర్ ఎంతలా అలరిస్తుందో చూడాలి.