పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపుతెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంటూనే…తెలుగులో వరుస సినిమాలకు పచ్చ జెండా ఊపేస్తుంది రష్మికా మందన. ఓవైపు ప్రిస్టీజియస్ ‘పుష్ప’ చేస్తూనే..సిద్ధార్ధ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ బ్యూటీ ఫస్ట్ బీటౌన్ ప్రాజెక్ట్ శుక్రవారమే మొదలైంది. బైక్ పై సిద్ధార్ధ్ మల్హోత్రాతో రష్మిక చేస్తున్న రచ్చ సోషల్ మీడియాలో వైరలయింది. అమితాబ్ కూతురిగా నటించాల్సిన సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది.
తెలుగులో చూసుకుంటే… శర్వానంద్ జోడిగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగచైతన్య సరసన రెండు సినిమాలు చేసేందుకు ఒప్పుకునేలా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చై చేస్తున్న ‘థాంక్యూ’ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ కు చోటుంది. అవికా గోర్ ఇప్పటికే ఓ నాయికగా ఎంపిక కాగా, రష్మికను లీడ్ రోల్ కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం. అలాగై చై హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులోనూ రష్మికనే హీరోయిన్ గా ఫైనల్ చేసారని తెలుస్తోంది.