కెరీర్ పరంగా దూకుడు పెంచింది తాప్సీ పన్ను. అద్దిరిపోయే క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటూ…తన నటనతో శభాష్ అనిపించుకుంటోంది. ఇప్పుడా లైన్ లోనే ‘శభాష్‌ మిథు’ సినిమాను ప్రారంభించింది. ఇందులో తాప్సీ క్రికెటర్‌గా నటిస్తోంది. ఇండియన్ వుమెన్ క్రికెట్‌ సారథి మిథాలీ రాజ్‌ బయోగ్రఫీతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. డైరెక్టర్ రాహుల్‌ ధోలాఖియా రూపొందిస్తుండగా వయాకామ్‌ 18 ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తోంది.

ఆల్రెడీ అఫీషియల్ గా మొదలైన ఈ మూవీ.. రీసెంట్ గా రెగ్యులర్‌ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. దీనిపై తాప్సీ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ‘లెట్స్‌ గో డే – 1’ అంటూ క్రికెట్‌ నేర్చుకుంటోన్న ఓ పిక్ ని షేర్‌ చేసింది. ఈ సినిమా కోసం తాప్సీ కొన్ని నెలలుగా క్రికెట్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. నూషిన్‌ అల్‌ ఖాదీర్‌ అనే కోచ్ సహకారంతో క్రికెట్ పై పట్టు సాధిస్తోంది. ప్రస్తుతం తాప్సీ లీడ్ రోల్ చేసిన ‘రష్మీ రాకెట్‌’, ‘లూప్‌ లపేటా’ సినిమాలు రిలీజ్ కి రెడీ అవగా…శభాష్ మిథు వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్ కి రానుంది.