ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ షూటింగ్ మొదలెట్టాడు హీరో సుధీర్‌ బాబు. ఆ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ కృతి శెట్టి. అవును సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తోన్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ గురువారం షురూ అయినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు సుధీర్‌. ‘మరోసారి డైరెక్టర్ మోహన్‌ కృష్ణ గారితో కలిసి పని చేస్తుండటం చాలా హ్యాపీగా ఉంది’ అని తెలియజేసారు‌. ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత సుధీర్‌ బాబు- మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కు వివేక్‌ సాగర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇదిలాఉంటే ఆల్రెడీ ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే క్రేజీ మూవీలో నటిస్తున్నాడు సుధీర్‌. దీనికి డైరెక్టర్ కరుణ కుమార్‌. కృతిశెట్టి విషయానికొస్తే.. నాని, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో పాటూ హీరో రామ్‌- డైరెక్టర్ లింగుస్వామి కలయికలో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తోంది.