డర్టీ హరి…నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 విడుదల చేశారు. ఆన్ లైన్ వేదికగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించిన కారణంగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. 

రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారట. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాన్స్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని… థియేటర్ లో ఈ సినిమాను ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని డర్టీ హరి నిరూపించిందని ఎంఎస్ రాజు తెలిపారు.

ఈ సినిమాకి డర్టీ హరి అని ఎందుకు పెట్టారు
హరి అనే క్యారెక్టర్ చుట్టూ కథ అల్లము ఆ హరి అనే పాత్రని బట్టే స్టోరీ మొత్తం రన్ అవుతుంది డర్టీ హరి ఇలాంటి క్యారెక్టర్ మన చుట్టూనే చాలా మంది ఉంటారు
అంటే మన జీవితానికి ఇది చాలు అని ఎవరు అనుకోరు మనం ఉన్నత స్థాయి కన్నా పై స్థాయికి ఎదగాలని అందరూ కోరుకుంటారు ఏదో చేయాలని తపనతో బతుకుతూ ఉంటారు అలాగే ఈ ప్రపంచాన్ని తన ఆధీనంలో తన జేబులో వేసుకోవాలని ఆలోచన ఉన్నా ఇలాంటి ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ వల్ల జరిగిన కాన్ఫ్లిక్ట్ అండ్ క్యారెక్టర్ చివరికి ఏమైంది అన్నదే ఈ సినిమా కథాంశం కనుక ఈ హరి అనే క్యారెక్టర్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి డర్టీ హరి అని పేరు పెట్టాం

ఈ సినిమా హీరోని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు
ఈ సినిమాకి చాలా మందిని అనుకున్న కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ చూసి టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి కాల్ చేసి తను ఎవరనేది తెలుసుకున్న తను ఇప్పుడు మూవీస్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాడని చెప్పారు తను నేను రాసుకున్న పాత్రకి న్యాయం చేయగలడు అనిపించింది అందుకే కే తనని తీసుకున్నా

టెన్ ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు
కొన్ని మన చేతుల్లో ఉండవు జస్ట్ గ్యాప్ వచ్చింది అంతే నేను పుట్టినప్పటి నుంచి ఫైటర్నే హిట్స్ ఫ్లాప్స్ తో నాకు సంబంధం లేదు నేను ఇప్పుడు పోరాడుతూనే ఉంటా నేను అనుకున్నది సాధించేవరకు

ఎమ్మెస్ రాజు గారి ఇ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి
లార్డ్ డౌన్లోడ్ చాలా స్క్రిప్ట్ విన్నాను అలాగే చాలా స్క్రిప్టులు రాశాను మూడు నుంచి నాలుగు వరకు స్క్రిప్ట్ లను ఫైనల్ చేశాను బట్ నెక్స్ట్ ఫిలిం నేనే డైరెక్ట్ చేస్తాను ఇంకొక సిక్స్ టు సెవెన్ డేస్ లో ఫైనల్ చేస్తాను

డర్టీ హరికి సీక్వల్ ఉంటుందా
ఉండొచ్చు కానీ సేమ్ బ్యాక్గ్రౌండ్ వాడను కొత్త బ్యాక్ డ్రాప్ తో ఉండొచ్చు

ఎమ్మెస్ రాజు గారు ఎటువంటి కథలు ఎంచుకుంటారు
ఒక కథ ఇలాగే ఉండాలి అని నేనేం అనుకోను బట్ కథలో ఎక్కువ న్యూడ్స్ ఉండాలి కథ అక్కడక్కడే తిరగకుండా వెళ్లాలి సీటెట్ లో కూర్చోబెట్టడానికి ఆ కథ లో కంటెంట్ వెతుకుతాను

డర్టీ హరి లో ఎందుకు అందరిని కొత్త వాళ్ళనే తీసుకున్నారు
నేను పెద్ద సినిమాలు అంటే వర్షం ఒక్కడు లాంటి సినిమాలు చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా చిన్న హీరోలు ఆ కథలు తర్వాత వాళ్ళ పెద్ద స్టార్ట్ అయ్యారు సో నేనెప్పుడూ కొత్త వాళ్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కథకి తగ్గ పాత్రలు ఎంచుకుంటాను స్టార్ హీరోల ఇమేజ్ ని నా క్యారెక్టర్ లపై రుద్దను

ఎమ్మెస్ రాజు ఫేవరెట్ హీరో ఎవరు
నేను పనిచేసిన వాళ్ళల్లో నేను ఎవరికి ఇష్టమో వాళ్ళు అంటే నాకు ఇష్టం