తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే తన సంగీతంపై వచ్చే ట్రోలింగ్ గురించి ఏమనుకుంటున్నారని ఓ అభిమాని ప్రశ్నించగా…ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకొని తన సమయాన్ని వృథా చేసుకోనన్నారు తమన్. అసలు ట్రోల్స్ క్రియేట్ చేయడం కోసం వారే తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. పెద్దగా ట్రోలింగ్ పై స్పందించకుండా నో కామెంట్ అన్నట్టు తప్పించుకున్నారు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట ఓ రేంజ్ లో ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు. ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించి సూపర్ అప్డేట్ ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు కొసమెరుపుగా పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.