పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ సినిమాపై కదలిక కనిపిస్తోంది. మైత్రీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంచారీ టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టే అని తెలుస్తోంది. ఈ టైటిల్ పై పవన్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. తండ్రీకొడుకులుగా పవన్ కల్యాణ్ తో ద్విపాత్రాభినయం చేయించేందుకు సిద్ధమయ్యాడట హరీష్ శంకర్. ఫుల్ టు బిందాస్ మాస్ ఎంటర్ టైనర్ గా ప్లాన్ చేసిన ఈ సినిమాను కూడా పవన్ త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.