కరోనా మరోసారి బుసలు కొడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెంట్ లాక్ డౌన్ వంటివి అమలవుతున్నాయి. కేసులు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో జనాలను కంట్రోల్ చేసే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్లీ షాక్ తగిలింది. పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలంటే మళ్లీ భయం మొదలైంది. దీంతో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించిన మేకర్స్ పునరాలోచనలో పడుతున్నారు.

ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ వాయిదాపడింది. కరోనా తీవ్రత తగ్గాక ఎప్పుడు థియేటర్స్ కి వచ్చేది చెప్తామన్నారు నిర్మాతలు. వకీల్ సాబ్ దూసుకుపోతున్నా…రేపు ఎలా ఉంటుందో అన్న భయం దర్శకనిర్మాతలపై పడింది. అందుకే టక్ జగదీష్, విరాటపర్వం, ఆచార్య వంటి సినిమాల రిలీజ్ డేట్స్ కూడా మారే ఛాన్స్ ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సైతం ఆగస్టులో రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో హడావుడీగా పనిచేయడం కంటే డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ డేట్ పెట్టుకుంటే నెమ్మదిగా పనిచేస్తూ…ప్రమోషన్స్ కూడా హెవీగా చేసుకునే వీలుంటుందని భావిస్తున్నారట సుకుమార్. అందుకే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పుష్పరాజ్ టీజర్ లో రిలీజ్ డేట్ చూపించలేదు.

పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాధేశ్యామ్, కేజీఎఫ్ 2, మేజర్ వంటి సినిమాలు పునరాలోచనలో ఉన్నాయి. ఎందుకంటే అక్షయ్ కుమార్ సూర్యవంశీ, సల్మాన్ ఖాన్ రాధే వంటి సినిమాలకే తిప్పలు తప్పట్లేదు. పైగా ఓవర్సీస్ బిజినెస్ కూడా ఆశాజనకంగా లేదు. మాస్టర్, జాతిరత్నాలు మాత్రమే ఓవర్సీస్ లో బిజినెస్ చేసాయి. ఉప్పెన యూఎస్ఏలో పర్వాలేదనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న రోజే సినిమాను తీసుకురావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు దర్శకనిర్మాతలు.

మొత్తం 66 సినిమాల రిలీజ్ లతో 2021 ఫస్ట్ క్వార్టర్ ముగిసింది. ఇప్పుడు ఫోకస్ సమ్మర్ సీజన్ పై పడింది. ఓ వైపు కోవిడ్ 19 సెకండ్ వేవ్ సింప్టమ్స్ కనిపిస్తున్నా…ప్రేక్షకులనే నమ్ముకుని థియేటర్లకొచ్చేస్తున్నాయి భారీ సినిమాలు. 270కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చింది టాలీవుడ్.

ఏప్రిల్ నెల…టాలీవుడ్ కి కీలకంగా మారనుంది. ఈ నెలలో రిలీజయ్యే సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్. కోవిడ్ మళ్లీ తిరగబెట్టినా 270కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి తగ్గేదేలేదంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్ రిలీజ్ కి రెడీఅయింది. గోకుల్ చాట్ లుంబినీ పార్క్ పేలుళ్ల నేపథ్యం… ఎన్.ఐ.ఏ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ కథాంశంతో రూపొందింది ఈ యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. వైల్డ్ డాగ్ 30కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తే…ఏప్రిల్ 2నే వస్తోన్న కార్తీ సుల్తాన్ 10కోట్ల బిజినెస్ చేసింది

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండటంతో భారీగానే అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 150కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ తో వస్తోన్న వకీల్ సాబ్ లాభాల బాట పట్టాలంటే..బంపర్ హిట్ కొట్టాల్సిందే. లైన్ లో వేరే మూవీ రిలీజ్ కూడా లేకపోవడంతో వకీల్ గట్టిగానే వాదిస్తాడనే ధీమా మీదున్నారు నిర్మాత దిల్ రాజు.

Pawan Kalyan Craze in theater VakeelSaab Grand Release

వకీల్ సాబ్ తర్వాత ఏప్రిల్ 16న శేఖర్ కమ్ముల లవ్ స్టోరి రిలీజవుతుంది. తెలంగాణ నేపథ్యంలో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటించారు. సారంగదరియా పాటతో ఒక్కసారిగా లవ్ స్టోరీపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబో కావడంతో యూత్ హిట్ ఇస్తారని నమ్ముతున్నారు మేకర్స్. లవ్ స్టోరీ ఇప్పటికే 35కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

Naga chaitanya latest movie updates,sai pallavi latest movie updates,Love story movie updates,ahachitram

నాని.. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ సినిమా టక్ జగదీష్ తో ఏప్రిల్ 23న రాబోతున్నాడు. నిన్నుకోరి తర్వాత నేచురల్ స్టార్ పెర్ఫామెన్స్ .. శివ నిర్వాణ టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ కానున్నాయని అంచనా. ఇక అదేరోజు హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా కంగనా నటించిన తలైవి రిలీజ్ కానుంది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్, మరెన్నో సర్ప్రైజెస్ తో తలైవి ముస్తాబైంది. టక్ జగదీష్ 35కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాధిస్తే…తలైవి 5కోట్ల రూపాయల బిజినెస్ చేయగలిగింది.

ఏప్రిల్ 30న రానా నటించిన విరాట పర్వం రిలీజ్ కానుంది. రానా, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా ఇది. అయితే 20కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన విరాటపర్వం వాయిదా పడే అవకాశం ఉందని టాక్. విరాట పర్వం స్థానంలో వెంకీ నారప్ప వచ్చే అవకాశం ఉంది. ఇలా ఏప్రిల్ లో రొటీన్ కి భిన్నంగా కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో ఏది హిట్ గా నిలుస్తుందో చూడాలి.

స్టార్స్ చకచకా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. 2021 ఎంట్రీ ఇవ్వగానే క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ యమా స్పీడ్ గా ప్రకటించారు. ఇప్పుడంతే వేగంగా ఆ ప్రాజెక్ట్ లని విడుదలకి రెడీ చేస్తున్నారు. డేట్ దగ్గరపడుతుండటంతో పెట్టాబేడా సర్దేసినట్టు దూసుకుపోతున్న ఆ బిగ్ సినిమాస్ సంగతేంటి?

వకీల్ సాబ్ జోష్ పెంచాడు. రిలీజ్ డేట్ ఏప్రిల్ 9 దగ్గరపడటంతో డబ్బింగ్ కార్యక్రమాలను ముగించారు పవన్ కల్యాణ్. ఐదే ఐదు రోజుల్లో ఫటాఫట్ డబ్బింగ్ పూర్తిచేసిన పవర్ స్టార్…ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు. మార్చి 29న జరగబోతున్న వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకను భారీగానే ప్లాన్ చేసారని సమాచారం. రిలీజ్ కి ఎక్కువ టైమ్ లేకపోవడంతో జనాల్లోకి వకీల్ సాబ్ ను తీసుకెళ్లేందుకు అన్నివిధాలా కసరత్తులు షురూ చేసారు మేకర్స్.

ఏప్రిల్ 2న రాబోతున్న వైల్డ్ డాగ్ కోసం నాగార్జున బరిలోకి దిగారు. వరుస ఇంటర్వ్యూలు, స్పెషల్ ప్రోమో కట్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో ఉంది వైల్డ్ డాగ్ టీమ్. అదేరోజున వస్తోన్న సీటీమార్ టీమ్ సైతం ఉత్సాహంగా ప్రమోషన్స్ చేస్తోంది. పెప్సీ ఆంటీ అంటూ అప్సర రాణి ఇంట్రడ్యూసయిన వెంటనే తెలంగాణ భాషలో డబ్బింగ్ చెప్పి వైరలయింది తమన్నా.

సారంగ దరియా పెంచిన జోష్ తో ఏప్రిల్ 16న థియేటర్స్ కి వచ్చేందుకు చకచకా రెడీఅవుతుంది లవ్ స్టోరీ. నాని టక్ జగదీష్ రిలీజ్ కి నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. రాజమండ్రిలో ప్రారంభించిన టక్ జగదీష్ ‘పరిచయ వేడుక’ లాగానే రాయలసీమ – తెలంగాణ ప్రాంతాల్లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆడియన్స్ హాట్ కేక్ లా వెయిట్ చేస్తున్న కేజీఎఫ్ 2… జూలై 16న రిలీజ్ కానుంది. దీంతో హీరో యశ్ డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు. రికార్డింగ్ థియేటర్లో రాఖీబాయ్ డైలాగుల డైనమైట్స్ పేల్చేస్తున్నారని టాక్. కన్నడతోపాటు హిందీ డబ్బింగ్ కూడా చెప్తున్నారు యశ్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.

ఇప్పుడు రొడ్డకొట్టుడు సినిమాలని జనం నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. కొత్త పాయింట్, ఆకట్టుకునే కథనం ఉంటే తప్ప అంగీకరించట్లేదు. అయితే ప్రేక్షకులను అలరించడానికి ఏవో ట్విస్ట్ పాయింట్లను అటాచ్ చేస్తున్నారు దర్శకులు. కొత్త కొత్త పాయింట్లను తెరమీదికి తీసుకొస్తున్నారు. కొన్నింటికి ఆడియెన్స్ ఎస్ చెప్తుంటే…మరికొన్నింటికి నో అనేస్తున్నారు. ఇప్పుడలాగే ‘లవ్ స్టోరి’తో మన ముందుకు వస్తున్నారట శేఖర్ కమ్ముల.
తాజాగా బెంజ్ కార్ గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఓ డిఫరెంట్ పాయింట్ ను ‘ఉప్పెన’లో చూపించాడు. అయితే సినిమా రిలీజ్ కు ముందే ఈ ‘కటింగ్’ సీన్ గురించి జనాల్లో చర్చ మొదలైంది. హింట్ ఇచ్చి ప్రేక్షకులను ముందే ప్రిపేర్చేసారు. చివరికి జనాలు అంగీకరించారు కూడా.
రీసెంట్ గా రిలీజైన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో సైతం ఓ డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేసాడు డైరెక్టర్. భర్త చనిపోయిన స్త్రీ వెంటపడటం నుంచి తల్లికొడుకులు కలిసి మందు తాగడం వరకు..అంతేకాదు హీరో తల్లికి వేరే వ్యక్తితో సంబంధం వంటి ఆడ్ ముచ్చట్లను తెరకెక్కించాడు. కానీ ప్రేక్షకులు ఆదరించలేకపోతున్నారు.

మరోవైపు త్వరలోనే రిలీజ్ కాబోతున్న నాగ చైతన్య-సాయిపల్లవి కాంబో మూవీ ‘లవ్ స్టోరీ’లో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేసారట శేఖర్ కమ్ముల. చాలాకాలంగా జనాల్లో నలుగుతున్న ఓ ఆడ్ పాయింట్ ని లవ్ స్టోరికి అటాచ్ చేసారట. మరి దీనిని ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

మరో సాంగ్ సెన్సేషన్ కోసం రంగంలోకి దిగుతోంది ‘లవ్ స్టోరి’ మూవీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ”లవ్ స్టోరి” నుంచి విడుదలైన ప్రతి పాట హిట్ మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. ఇక సారంగదరియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలే సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. కాగా ఈ మూవీలోని మరో లవ్ సాంగ్ రిలీజ్ కి రెడీఅవుతోంది. ‘ఏవో ఏవో కలలే’ అంటూ వర్షం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటను గురువారం మార్నింగ్ 10 గంటల 08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట పోస్టర్ చూస్తుంటే ..పాట మంచి డాన్స్ ఐటమ్ అని తెలుస్తోంది. అందులో వాన పాట కావడంతో సాయి పల్లవితో పాటే చైతూ స్టెప్పులు ఇరగదీసి ఉంటారని చెప్తున్నారు. చూద్దాం లవ్ స్టోరిలోని ఈ కొత్త సాంగ్ ఏమాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో…

యూట్యూబ్ లో రచ్చచేస్తోంది సాయి పల్లవి సారంగదరియా. రెండు వారాల కిందట రిలీజైన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ క్రాస్‌ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నిన్నమొన్నటి వరకూ ఈ పాట మీద రేగిన కాంట్రవర్సీ కూడా దీనికి కొంత హెల్ప్ చేసింది. అది సద్దుమణిగినా సాయి పల్లవీ ఎక్స్ ప్రెషన్స్, డాన్స్ ..మంగ్లీ గానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అందుకే సారంగ దరియా యూట్యూబ్ ట్రెండింగ్ గా సంచలనం సృష్టిస్తోంది.

బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్ చేస్తోన్న ‘లాల్‌ సింగ్ చద్దా’ సినిమాలో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య నెలరోజుల పాటు డేట్స్‌ కేటాయించాడు. నిజానికి ఈ రోల్ మొదట విజయ్ సేతుపతిని వరించింది. ఎస్ చెప్పిన సేతుపతి లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో నాగ చైతన్య ఛాన్స్ అందుకున్నాడు. అమీర్ తో చేస్తున్న లాలా సింగ్ చద్దానే చైతూకి ఫస్ట్ బాలీవుడ్ మూవీ. మొత్తానికి ఇలా ఎంట్రీ గట్టిగానే ఉండేట్టు చూసుకున్నాడు నాగచైతన్య.

వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాగశౌర్య క్రేజీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు లైన్లో పెడుతున్నాడు. లేడీ డైరెక్టర్ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను సినిమా చేస్తూనే అనీష్ కృష్ణ డైరెక్షన్లో మరో సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటూ కొత్త దర్శకుడు కె.పి.రాజేంద్ర కాంబినేషన్లో ‘పోలీసువారి హెచ్చరిక’ను తీసుకొస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై మహేష్‌ ఎస్‌.కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులోనే నాగశౌర్యకి జంటగా దివ్యాంశ కౌశిక్‌ సెలెక్టయింది. ‘మజిలీ’ మూవీలో నాగచైతన్య ప్రేయసిగా కనిపించిన కథానాయికే దివ్యాంశ. కాగా నాగశౌర్యకిది 23వ సినిమా. ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్ వచ్చే నెల నుంచే షూటింగ్ షురూ చేస్తుందని సమాచారం.

సైలెంట్‌గా వ‌చ్చి వయొలెంట్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు ఉప్పెనతో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్ద‌రు కొత్త నటులతో, విజయ్ సేతుపతి వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడాయన నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేస్తార‌నే దానిపై ప్రతిఒక్కరిలో క్యూరియాసిటి పెరిగింది.
అయితే కమిట్మెంట్ ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే రెండు సినిమాలు చేయనున్నాడు బుచ్చిబాబు. రెండో సినిమా అక్కినేని నాగ చైత‌న్యతో చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిన్నటివరకు అఖిల్ కోసం నాగార్జున రాయభారం నడిపారని అనుకున్నారు. కానీ బుచ్చిబాబు చైతూతో కమిటైనట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగార్జునతో పాటూ చైతన్యకూ స్టోరీ వినిపించ‌డం… ఓకే చెప్పడం కూడా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ ఏడాదిలోనే ఈ మూవీ ప్రారంభంకానుంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ మూవీ చేస్తోన్న చైతూ…నెక్ట్స్ బుచ్చిబాబుతోనే పట్టాలెక్కుతాడేమో చూడాలి.

రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేసి తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు నాగచైతన్య. లవ్ స్టోరీతో ఏప్రిల్ 16న లవర్ బాయ్ గా కనిపించేందుకు సిద్ధమైన చై…ఆ తర్వాతి ప్రాజెక్ట్ లో పోలీసాఫీసర్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అది కూడా పెళ్లిచూపులు డైరెక్టర్ కాంబినేషన్ లో. అవును తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగచైతన్య పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడని టాక్.

అయితే చైతన్య మామ వెంకటేశ్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. నారప్ప, ఎఫ్ 3 తర్వాత వెంకీ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ సినిమా కన్ఫర్మయినట్టు వార్తలొచ్చాయి. అయితే తాజాగా వెంకీతో కాదు నాగచైతన్యతో ఈ క్రేజీ డైరెక్టర్ మూవీ పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఓ షార్ట్ స్టోరీ ఓటీటీ వేదికగా పిట్టకథలుగా రిలీజ్ కానుంది. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా నటుడిగానూ అలరిస్తున్నారు. మరి తరుణ్ భాస్కర్ చైతో ఓకే అంటాడా…వెంకీమామతో కనక్ట్ అవుతాడా చూడాలి.