యంగ్ హీరో నాగశౌర్య , డెబ్యూ డైరెక్టర్ సంతోష్‌ జాగర్లపూడి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. నాగశౌర్య జోడీగా కేతిక శ‌ర్మ న‌టిస్తోన్న ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబుతో పాటూ సచిన్ ఖేడేకర్ కనిపించనున్నారు. నాగ‌శౌర్య 20వ ప్రాజెక్ట్ గా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో… స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నింటినీ జోడించి ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నారు. ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని ఎయిట్‌ప్యాక్ లుక్‌తో ఈ సినిమాలో స‌ర్పైజ్ చేయనున్నాడు నాగ‌శౌర్య‌. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్ కి, నాగ‌శౌర్య పుట్టినరోజు సంద‌ర్భంగా రిలీజైన టీజ‌ర్‌కి సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాదాపు 80శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ… ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. కీరవాణి కుమారుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై నారాయణ దాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాగశౌర్య క్రేజీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు లైన్లో పెడుతున్నాడు. లేడీ డైరెక్టర్ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను సినిమా చేస్తూనే అనీష్ కృష్ణ డైరెక్షన్లో మరో సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటూ కొత్త దర్శకుడు కె.పి.రాజేంద్ర కాంబినేషన్లో ‘పోలీసువారి హెచ్చరిక’ను తీసుకొస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై మహేష్‌ ఎస్‌.కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులోనే నాగశౌర్యకి జంటగా దివ్యాంశ కౌశిక్‌ సెలెక్టయింది. ‘మజిలీ’ మూవీలో నాగచైతన్య ప్రేయసిగా కనిపించిన కథానాయికే దివ్యాంశ. కాగా నాగశౌర్యకిది 23వ సినిమా. ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్ వచ్చే నెల నుంచే షూటింగ్ షురూ చేస్తుందని సమాచారం.

మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా వకీల్ సాబ్ చిత్రం నుంచి ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. సీరియ‌స్ లుక్‌లో ప‌వన్ కనిపిస్తుడగా… వెనుక నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నిల్చుని ఉన్నారు.


మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విరాట ప‌ర్వం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేక‌ర్స్. సాయిపల్లవితో పాటూ ఈ ప్రాజెక్ట్ లో మిగిలిన లేడీ లీడ్స్ ను రానా తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేసారు.


అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ మూవీ నుంచి మహిళలను పరిచయం చేస్తూ ఓ ఫోటోను రిలీజ్ చేసారు. స్ట్రాంగ్ ఉమెన్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షాలంటూ కామెంట్ చేసారు.

ఉమెన్స్ డే సందర్భంగా పలువురు సెలెబ్రిటీస్ విషెస్ షేర్ చేసారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న త‌ల్లి, స‌తీమ‌ణి, కూతురు ఫొటోను షేర్ చేస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. తన తల్లి కాళ్లు నొక్కుతున్న ఫోటోను నాగశౌర్య పంచుకోగా… అమ్మతో సరదాగా ఉన్న పిక్ ను ధరమ్ తేజ్, తన జీవితంలో ఉన్న సూపర్ ఉమెన్స్ అంటూ సామ్ ఒక ఫోటోను పోస్ట్ చేసారు.


ఎప్పుడో ప్రారంభించాల్సిన సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. కింగ్ కి తోడు అటు గ్లామరస్ గా నటించేందుకు రమ్యకృష్ణ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే హీరో నాగార్జున, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ రెడీగానే ఉన్నా…ముఖ్యపాత్రలో నటించాల్సిన నాగచైతన్య కాల్షీట్స్ ఖాళీ లేవట. దీంతో నాగశౌర్య లేదంటే రామ్ లతో ఆ ప్లేస్ రీప్లేస్ చేసి షూటింగ్ త్వరలోనే షురూ చేస్తారట మేకర్స్.

నాగశౌర్య, బాలకృష్ణ కాంబోలో మూవీ వస్తుందన్నారు కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ తో పాటూ రామ్ నటిస్తారనే వార్త జోరందుకుంది. ఇదిలాఉంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు నాగార్జున సినిమాలో కనిపిస్తారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి బంగార్రాజులో నాగశౌర్య, రామ్ లలో ఎవరైనా కనిపిస్తారా అన్నది తెలియాలంటే ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే ఈ మూవీ ముహూర్తం తేదీ వరకు వేచిచూడాల్సిందే.

ఈరోజు యంగ్ డైనమిక్ నాగశౌర్య పుట్టినరోజు. వారం ముందు నుంచే కొత్త సినిమా అప్ డేట్స్ తో రచ్చ చేస్తున్నారు ఈ బర్త్ డే బాయ్. తాజాగా వరుస టీజర్స్ తో కుమ్మేస్తున్నారు. మొదట ఎనర్జిటిక్ వరుడిగా ‘వరుడు కావలెను’ టీజర్ తో ఆకట్టుకున్నారు. డెబ్యూ లేడీ డెరైక్టర్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ వంటి వారు ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు.
‘లక్ష్య’ సినిమాలో సరికొత్తగా కనిపిస్తున్నారు నౌగశౌర్య. బాడీ మేకోవర్ తో విలువిద్యను ప్రదర్శిస్తున్నారు. జగపతిబాబు వాయిస్ ఓవర్ తో రిలీజైన ఈ మూవీ టీజర్…సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. కేతికశర్మ హీరోయిన్ కాగా…ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
‘ఫలనా అబ్బాయి…ఫలనా అమ్మాయి’ అంటూ శౌర్య మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రంగంలోకి దిగారు. షూటింగ్ లోకేషన్ విజువల్స్ తో చిన్న టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారీ చిత్రాన్ని. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ప్రాజెక్ట్ ఇది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
ఇవే కాదు ‘పోలీసు వారి హెచ్చరిక’తో పాటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు నాగశౌర్య. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నారు బర్త్ డే బాయ్. 2021లో మొదలుపెడితే 2022 వరకు నావే రిలీజ్ లు అనేలా ఊపుమీదున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్ డే నాగశౌర్య.

బర్త్ డే వీక్ అంటూ రోజుకో అప్డేట్ ఇస్తున్నారు నాగ‌శౌర్య‌. రీసెంట్ గా పోలీసు వారి హెచ్చ‌రిక అంటూ హల్చల్ చేస్తున్నారు. కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది పోలీసు వారి హెచ్చ‌రిక‌. శిఖ‌ర కోనేరు ప్రొడక్షన్స్ లో మ‌హేష్ ఎస్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జ‌న‌వ‌రి 22న నాగ‌శౌర్య జన్మదినం సంద‌ర్భంగా విషెస్ తెలియజేస్తూ జ‌న‌వ‌రి 21 సాయంత్రం 5గంటల 15 నిమిషాల‌కు పోలీసు వారి హెచ్చ‌రిక‌ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసారు. చిత్ర యూనిట్‌. ఈ మూవీలో న‌టించే హీరోయిన్ తో పాటూ మిగిలిన యాక్టర్స్, టెక్నికల్ డిపార్ట్మెంట్ వివ‌రాలు తెలియాల్సివుంది. మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.