మొత్తం 66 సినిమాల రిలీజ్ లతో 2021 ఫస్ట్ క్వార్టర్ ముగిసింది. ఇప్పుడు ఫోకస్ సమ్మర్ సీజన్ పై పడింది. ఓ వైపు కోవిడ్ 19 సెకండ్ వేవ్ సింప్టమ్స్ కనిపిస్తున్నా…ప్రేక్షకులనే నమ్ముకుని థియేటర్లకొచ్చేస్తున్నాయి భారీ సినిమాలు. 270కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చింది టాలీవుడ్.

ఏప్రిల్ నెల…టాలీవుడ్ కి కీలకంగా మారనుంది. ఈ నెలలో రిలీజయ్యే సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్. కోవిడ్ మళ్లీ తిరగబెట్టినా 270కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి తగ్గేదేలేదంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్ రిలీజ్ కి రెడీఅయింది. గోకుల్ చాట్ లుంబినీ పార్క్ పేలుళ్ల నేపథ్యం… ఎన్.ఐ.ఏ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ కథాంశంతో రూపొందింది ఈ యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. వైల్డ్ డాగ్ 30కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తే…ఏప్రిల్ 2నే వస్తోన్న కార్తీ సుల్తాన్ 10కోట్ల బిజినెస్ చేసింది

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండటంతో భారీగానే అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 150కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ తో వస్తోన్న వకీల్ సాబ్ లాభాల బాట పట్టాలంటే..బంపర్ హిట్ కొట్టాల్సిందే. లైన్ లో వేరే మూవీ రిలీజ్ కూడా లేకపోవడంతో వకీల్ గట్టిగానే వాదిస్తాడనే ధీమా మీదున్నారు నిర్మాత దిల్ రాజు.

Pawan Kalyan Craze in theater VakeelSaab Grand Release

వకీల్ సాబ్ తర్వాత ఏప్రిల్ 16న శేఖర్ కమ్ముల లవ్ స్టోరి రిలీజవుతుంది. తెలంగాణ నేపథ్యంలో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటించారు. సారంగదరియా పాటతో ఒక్కసారిగా లవ్ స్టోరీపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబో కావడంతో యూత్ హిట్ ఇస్తారని నమ్ముతున్నారు మేకర్స్. లవ్ స్టోరీ ఇప్పటికే 35కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

Naga chaitanya latest movie updates,sai pallavi latest movie updates,Love story movie updates,ahachitram

నాని.. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ సినిమా టక్ జగదీష్ తో ఏప్రిల్ 23న రాబోతున్నాడు. నిన్నుకోరి తర్వాత నేచురల్ స్టార్ పెర్ఫామెన్స్ .. శివ నిర్వాణ టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ కానున్నాయని అంచనా. ఇక అదేరోజు హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా కంగనా నటించిన తలైవి రిలీజ్ కానుంది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్, మరెన్నో సర్ప్రైజెస్ తో తలైవి ముస్తాబైంది. టక్ జగదీష్ 35కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాధిస్తే…తలైవి 5కోట్ల రూపాయల బిజినెస్ చేయగలిగింది.

ఏప్రిల్ 30న రానా నటించిన విరాట పర్వం రిలీజ్ కానుంది. రానా, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా ఇది. అయితే 20కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన విరాటపర్వం వాయిదా పడే అవకాశం ఉందని టాక్. విరాట పర్వం స్థానంలో వెంకీ నారప్ప వచ్చే అవకాశం ఉంది. ఇలా ఏప్రిల్ లో రొటీన్ కి భిన్నంగా కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో ఏది హిట్ గా నిలుస్తుందో చూడాలి.

వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్ పేరుతో నాగార్జున సెలెబ్రిటీలకు సవాల్ విసురుతున్నారు. ఏప్రిల్ 2 వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు నాగ్. అందులో భాగంగానే పుష్ అప్ ఛాలెంజ్ ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన హీరోయిన్ రష్మికా కొన్ని సెకన్ల పాటూ పుష్ అప్ పొజిషన్ లో ఉండి..ఆ వీడియోను పోస్ట్ చేసింది. రష్మిక వీడియోని చూసిన నాగ్.. పుష్‌అప్‌ పొజిషన్‌లో దాదాపు 50సెకన్ల పాటూ ఉన్నారు. దాన్ని బీట్‌ చేయాలంటూ రష్మికకు మరో హార్డ్ ఛాలెంజ్‌ విసిరారు. ‘యూ నీడ్‌ టు బీట్‌ దిస్‌ డియర్’ అంటూ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ని ట్యాగ్‌ చేసారు నాగార్జున.

స్టార్స్ చకచకా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. 2021 ఎంట్రీ ఇవ్వగానే క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ యమా స్పీడ్ గా ప్రకటించారు. ఇప్పుడంతే వేగంగా ఆ ప్రాజెక్ట్ లని విడుదలకి రెడీ చేస్తున్నారు. డేట్ దగ్గరపడుతుండటంతో పెట్టాబేడా సర్దేసినట్టు దూసుకుపోతున్న ఆ బిగ్ సినిమాస్ సంగతేంటి?

వకీల్ సాబ్ జోష్ పెంచాడు. రిలీజ్ డేట్ ఏప్రిల్ 9 దగ్గరపడటంతో డబ్బింగ్ కార్యక్రమాలను ముగించారు పవన్ కల్యాణ్. ఐదే ఐదు రోజుల్లో ఫటాఫట్ డబ్బింగ్ పూర్తిచేసిన పవర్ స్టార్…ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు. మార్చి 29న జరగబోతున్న వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకను భారీగానే ప్లాన్ చేసారని సమాచారం. రిలీజ్ కి ఎక్కువ టైమ్ లేకపోవడంతో జనాల్లోకి వకీల్ సాబ్ ను తీసుకెళ్లేందుకు అన్నివిధాలా కసరత్తులు షురూ చేసారు మేకర్స్.

ఏప్రిల్ 2న రాబోతున్న వైల్డ్ డాగ్ కోసం నాగార్జున బరిలోకి దిగారు. వరుస ఇంటర్వ్యూలు, స్పెషల్ ప్రోమో కట్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో ఉంది వైల్డ్ డాగ్ టీమ్. అదేరోజున వస్తోన్న సీటీమార్ టీమ్ సైతం ఉత్సాహంగా ప్రమోషన్స్ చేస్తోంది. పెప్సీ ఆంటీ అంటూ అప్సర రాణి ఇంట్రడ్యూసయిన వెంటనే తెలంగాణ భాషలో డబ్బింగ్ చెప్పి వైరలయింది తమన్నా.

సారంగ దరియా పెంచిన జోష్ తో ఏప్రిల్ 16న థియేటర్స్ కి వచ్చేందుకు చకచకా రెడీఅవుతుంది లవ్ స్టోరీ. నాని టక్ జగదీష్ రిలీజ్ కి నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. రాజమండ్రిలో ప్రారంభించిన టక్ జగదీష్ ‘పరిచయ వేడుక’ లాగానే రాయలసీమ – తెలంగాణ ప్రాంతాల్లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆడియన్స్ హాట్ కేక్ లా వెయిట్ చేస్తున్న కేజీఎఫ్ 2… జూలై 16న రిలీజ్ కానుంది. దీంతో హీరో యశ్ డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు. రికార్డింగ్ థియేటర్లో రాఖీబాయ్ డైలాగుల డైనమైట్స్ పేల్చేస్తున్నారని టాక్. కన్నడతోపాటు హిందీ డబ్బింగ్ కూడా చెప్తున్నారు యశ్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు అక్కినేని నాగార్జున. నిన్న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆయన..టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారిని నేను కోరుతున్నానని…మీరు ఇప్పుడే కరోనా వ్యాక్సిన్ కొరకు నమోదు చేసుకొమ్మని…కరోనా వ్యాక్సిన్ నీ తీసుకోండి అంటూ……ట్విట్టర్ లో ట్వీట్ చేసారు నాగార్జున అక్కినేని…

నాగార్జునతో కలిసి నటించబోతుంది గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ తెలియజేసింది. ఈ మధ్యే పట్టాలెక్కిన నాగ్, ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో ఆమె హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇటు చిరుతో ఆచార్య కంప్లీట్ చేసిందో లేదో….మరో సీనియర్ హీరో నాగార్జునతో చేసే ఛాన్స్ దక్కించుకుంది కాజల్. చూస్తుంటే పెద్ద హీరోలకు కాజల్ మంచి అవకాశంగా మారింది. ఇక ఆమె మంచు విష్ణు అక్కగా నటించి మోసం చేసిన మోసగాళ్లు రిలీజ్ కి రెడీ అయింది. అటు తమిళంలో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా వుంది. ఇలా గౌతమ్ కిచ్లూని పెళ్ళాడాక కూడా కాజల్ సినిమాలతో దూసుకుపోతుంది…

హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకున్న సీక్వెల్స్ జోరు ఇప్పుడు టాలీవుడ్ లోనూ కనిపిస్తోంది. బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాల పార్ట్ 2 తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బడా హీరోల నుంచి యంగ్ స్టర్స్ వరకు… ప్రెజంట్ స్వీక్వెల్ జపం చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ.

కొన్ని కథలు ఎప్పటికీ వావ్ అనిపిస్తాయి. ఇంకా ఉంటే బావుండు అనిపించేలా మెస్మెరైజ్ చేస్తాయి. అలాంటి కథలకు బాక్సాఫీస్‌విజయం దక్కితే ? కాంబినేషన్‌రిపీటవుతే బాగుండు అని ప్రేక్షకులు ఫీలవుతే? వీటికి తోడూ ఆ కథను కొనసాగించే స్కోప్‌ఉంటే…ఇంకేముంది సీక్వెల్ని మొదలెట్టే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడలాగే టాలీవుడ్లో పార్ట్ 2 జోరు ఊపందుకుంది.

మలయాళీ రీమేక్ గా వచ్చి తెలుగులోనూ కాసులవర్షం కురిపించింది..దృశ్యం. వెంకటేశ్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ సీక్వెల్ ఈ మార్చి నుంచే షురూకానుంది. రీసెంట్ గా ఓటీటీ వేదికగా దృశ్యం సీక్వెల్ మలయాళంలో రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. సో వెంకీ సైతం దృశ్యం పార్ట్ 1 తర్వాత ఏం జరిగిందో చూపించేందుకు రెడీఅయ్యారు. అంతేకాదు వరుణ్ తేజతో కలిసి ఎఫ్ 2 సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. ఎఫ్ 2కి మించిన కామెడీతో, కథతో ఎఫ్ 3ని సిద్ధం చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంటే ఈ ఏడాది రెండు సీక్వెల్స్ తో థియేటర్స్ కి రానున్నారు వెంకటేశ్.

బంగార్రాజు ఈజ్‌బ్యాక్‌ అంటున్నారు నాగార్జున. 2016లో సొగ్గాడే చిన్ని నాయనా అంటూ హిట్ కొట్టిన నాగ్…ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్ రూపొందించే పనిలోఉన్నారు. బంగార్రాజు చుట్టూ అల్లుకున్న కథతో ఈ స్క్రిప్ట్ ను రెడీచేసాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. మార్చి నుంచి ఈ మూవీ సెట్స్‌ పైకెళ్లనుందని సమాచారం. అటు డబుల్ డోస్ ఇచ్చేందుకు ప్లాన్ చేసారు మంచు విష్ణు, శ్రీను వైట్ల. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌ ‘ఢీ 2 : డబుల్‌డోస్‌’ టైటిల్‌తో ఈ సీక్వెల్‌తెరకెక్కనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.

‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ తేజ..ఇప్పుడా మూవీకి సీక్వెల్ గా చిత్రం1.1ను ప్రకటించారు. మొదటి భాగంతో ఉదయ్‌కిరణ్, రీమా సేన్‌వంటి యాక్టర్స్ ను పరిచయం చేసిన తేజ… ఈ సీక్వెల్ కోసం సుమారు 45 మంది కొత్తవాళ్లను తీసుకోనున్నారు. ఇక రామ్, పూరి జగన్నాథ్‌కాంబో మూవీ ‘ఇస్మార్ట్‌శంకర్‌’ చిత్రీకరణలో ఉండగానే సీక్వెల్‌ఉంటుందని అనౌన్స్ చేసారు పూరీ. ఈ సీక్వెల్‌కి ‘డబుల్‌ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌కూడా రిజిస్టర్‌చేసారు. ఇవే కాదు అడవి శేష్ గూఢచారి రిటర్న్స్‌, నిఖిల్ కార్తీకేయ -2, విశ్వక్ సేన్ హిట్ -ది సెకండ్ కేస్, డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ అ!, జాంబీ రెడ్డి సినిమాలు కూడా సీక్వెల్స్ కథలతో సిద్ధంగా ఉన్నాయి.

సినిమాలకు పెద్ద సీజన్ సంక్రాంతికి సినిమాల్ని లాక్ చేసుకుంటున్నారు స్టార్లు . నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ డేట్స్ ఇప్పుడే బుక్ చేసుకుంటున్నారు. వచ్చే సంక్రాంతి టాలీవుడ్ హిస్టరీలోనే ఎప్పుడూ రానంతమంది స్టార్ హీరోలతో ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా పండక్కి వస్తున్నా అంటూ అనౌన్స్ చేశారు . 2018 లో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత బాగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సమ్మర్ లో వకీల్ సాబ్ రిలీజ్ చేస్తున్నారు. కానీ 200కోట్ల రూపాయలతో క్రిష్ తో చేస్తున్న భారీ సినిమాని మాత్రం సంక్రాంతికే సిద్దం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

2022 సంక్రాంతి పోటీకి ఫస్ట్ ఖర్చీఫ్ వేసుకున్న హీరో బన్నీ. కొరటాల శివ డైరెక్షన్లో బన్నీ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ని ఎర్లీ జనవరిలోనే రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే క్లారిటీ ఇచ్చింది టీమ్. అసలే లాస్ట్ ఇయర్ 2020 సంక్రాంతికి అన్ని సినిమాల్నీ వాషవుట్ చేసి అలవైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ కొట్టారు బన్నీ.

బన్నీతో పాటు పోటీ పడడానికి మరో సారి రెడీ అయ్యారు సూపర్ స్టార్ . మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాని కూడా సంక్రాంతి బరిలోనే దింపుతున్నట్టు అనౌన్స్ చేశారు మహేష్ బాబు అండ్ కో . పోయిన సంవత్సరం సరిలేరునీకెవ్వరు సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టారు మహేష్ బాబు.

నిన్న మొన్నటి వరకూ కామ్ గా ఉన్న అక్కినేని హీరో నాగార్జున కూడా నా నెక్ట్స్ మూవీ సంక్రాంతికే అన్నారు. కళ్యాణ్ కృష్ణ- నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కబోతున్న బంగార్రాజు సినిమాని జూన్ జులై కి స్టార్ట్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేసి పండగబరిలోకే దింపుతున్నారు. బంగార్రాజు సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా రాబోతోంది.
ఎంత మంది హీరోలు పోటీపడుతున్నా ..పండగ హీరో నేనే అంటున్నారు బాలయ్య. ఈ నటసింహానికి సంక్రాంతి సక్సెస్ హిస్టరీ బాగానే ఉంది. అందుకే ఎంతమందొచ్చినా, ఎన్ని సినిమాలతో వచ్చినా .. సంక్రాంతి సినిమా నాదే అంటున్నారు. మలినేని గోపీచంద్ -బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాని ఎట్టి పరిస్తితుల్లో సంక్రాంతికే ఎయిమ్ చేస్తున్నారు.

అసలే ఇన్ని తెలుగు సినిమాలతో పండగ ప్యాక్ అయిపోయి ఉంటే .. ఇవి సరిపోనట్టు ..తమిళ్ మూవీ పొన్నియున్ సెల్వన్ కూడా పొంగల్ కి మేం కూడా రెడీ అంటోంది. మణిరత్నం డైరెక్షన్ లో ఐశ్వర్యారాయ్, నయనతార, విక్రమ్ , కార్తి, త్రిష.. ఇలా భారీ స్టార్ కాస్ట్ తో హెవీ గా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీని కూడా త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు టీమ్. ఈ స్టార్ హీరోల టాప్ మూవీస్ తో సంక్రాంతి సందడి పీక్స్ కి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్ .

సీనియర్ హీరోల్లో కాస్త స్లో అయ్యారనుకున్న నాగార్జున బరిలోకి దిగుతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించిన నాగ్…త్వరలోనే సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్ బంగార్రాజుగా నటించబోతున్నారు. ఇక తాజాగా ఆయన నటించిన వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ప్రకటించారు. నాగార్జున లీడ్ రోల్ చేసిన వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. నిజానికి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు నిర్మాతలు. దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసి థియేటర్ బాట పట్టారు. అహిషార్ సోలమన్ డైరెక్షన్లో అలీరేజా, సయామీఖేర్, దియామీర్జా వంటివారు నటించిన ఈ సినిమా చివరికి ఏప్రిల్ 2న థియేటర్స్ కే రాబోతుందన్నమాట.

అబ్బే నాగార్జున గారికి ఏమైందండీ నిన్నే పెళ్ళాడతా లాంటి బ్లాక్బస్టర్ లు సాధించాక ఈ భక్తి చిత్రాలు అవసరమా…
ఇదేమైనా ఎన్టీఆర్ కాలమా…
కొడుక్కి నాన్న భక్త తుకారాం ఏమైనా గుర్తుకు వచ్చిందేమో 😀…
ఇంత అందగాడైన నాగార్జునతో కమర్షియల్ ఫిలిం చేయకుండా రాఘవేంద్ర రావు గారు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నట్టు…… పెళ్లి సందడి తో వచ్చిన పేరుని రిస్క్ లో పెడుతున్నట్టు ఉన్నారు… దొరసాని రాజుగారుకి ఎంత వెంకన్న మీద భక్తి ఉంటే మాత్రం ఇలాంటి సాహసానికి పూనుకుంటారు

అన్నమయ్య సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఇండస్ట్రీలో ఇలాంటి కామెంట్స్ చాలానే వినిపించాయి…. అందులో నిజం లేకపోలేదు

ప్రేమ దేశం లాంటి ట్రెండ్ లవ్ స్టోరీస్ ఒకవైపు ప్రేమాలయం లాంటి కుటుంబ కథా చిత్రాలు ఒకవైపు ఉదృతంగా సాగుతున్న టైం లో ఇలాంటి ప్రయత్నం అంటే ఎవరికైనా సవాలక్ష అనుమానాలు వస్తాయి దీనికి కూడా అదే జరిగింది పైగా అన్నమయ్య రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు ఇందులో ఆయనకు మీసాల పెడుతున్నారు జనం ఒప్పుకుంటారా అప్పటిదాకా ఇలాంటి వేషభాషలకు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కేరాఫ్ అడ్రస్గా నిలిచారు బ్లాక్ అండ్ వైట్ జమానా ముగిశాక నాగేశ్వరరావు గారు సైతం ఒకటి రెండు తప్ప ఇలాంటి భక్తిరస చిత్రాలు చేయడం మానేశారు అలాంటి సమయంలో అన్నమయ్య అనే మహా యజ్ఞానికి పూనుకున్నారు దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు.
రచయిత జై కె భారవి ఎన్నో ఏళ్ళు తపస్సు లాగా స్వీకరించి తాళ్ళపాక అన్నమయ్య గురించి సేకరించిన గాధలు పుస్తకాలు వివరాలు తదితరాలు ఎన్నింటి ను ఆధారంగా చేసుకుని ఈ స్క్రిప్ట్ను రాసుకున్నారు తొలుత కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ అంత సేపు తల ఊపిన కొందరు నిర్మాతలు తీరా హీరో బడ్జెట్ లాంటి లెక్కల దగ్గరికి వచ్చేసరికి భయపడి వెనకడుగు వేశారు…

News18 Telugu - నాగార్జున అక్కినేని కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌‌లో వచ్చిన  సినిమాలు ఇవే.. | Tollywood hero Nagarjuna Akkineni director k raghavendra  rao super hit combination in telugu film ...


నాగార్జున కథ విన్నారు అప్పటికే ప్రయోగ అర్జునుడిగా పేరున్న ఆయనకు అన్నమయ్య బ్రహ్మాండంగా నచ్చేసింది ఎటొచ్చి రాఘవేంద్ర రావు గారు మాత్రమే కొంచెం టెన్షన్ గా ఉన్నారు గొప్ప పేరు తీసుకొస్తుంది కానీ అంత డబ్బు తీసుకువస్తుందా అన్న భయం …. దానికి నాగార్జున అభయమిచ్చారు ఇది డబ్బులు కూడా తీసుకొస్తుంది మీరు నమ్మండి అన్నారు ఏం భయం లేకుండా ముందుకు వెళ్దాం అని ప్రోత్సహించారు… నాన్న ఏఎన్నార్ తో కూడా చర్చించి ఆయన సానుకూలంగా స్పందించక నిర్ణయం తీసుకున్నారు గ్లామర్ హీరోయిన్ గా అంత ఎత్తుకు ఎదిగిన రమ్యకృష్ణని పెద్దగా స్టార్డం లేని కస్తూరిని నాగార్జున సరసన తీసుకున్నారు తన ఆస్థాన విద్వాంసులు ఎం ఎం కీరవాణి మీద తప్ప రాఘవేంద్ర రావు గారికి ఇంకా ఎవరి మీద నమ్మకం లేదు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు కొన్ని వందల కీర్తనలలో ఏది తీసుకోవాలో తెలియని సందిగ్ధం. జనంలో అప్పటికే బాగా నాటుకుపోయిన అన్నమాచార్య కీర్తనలునే ట్యూన్ల గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కీలకమైన శాలువా నరసింహారావు పాత్రకు మోహన్ బాబు సరే అన్నారు. కాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అందరు సీనియర్లనే తీసుకున్నారు. చిన్న పెద్ద అన్ని కీర్తనలు పాటలు కలిసి 20 ట్రాక్ అయ్యాయి ఏది తీసేయ్ కూడదని ముందే అనుకున్నారు ఆడియో హక్కులు కొన్నా టి సిరీస్ కంపెనీ క్యాసెట్లను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు .
షూటింగ్ మొదలైంది నాగార్జున ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని కమర్షియల్ సన్నివేశాలను జోడించక తప్పలేదు అందులో భాగంగానే ఇద్దరు మరదళ్లతో డ్యూయెట్ పాట ఫస్టాఫ్లో పెట్టేశారు… మోహన్ బాబు అభిమానుల కోసం జోడిగా నటించిన రోజాతో ఒక యుగళగీతం రెండో సగంలో పెట్టుకుంటారు నిర్విరామంగా షూటింగ్ సాగిపోయింది…. అలా అని కామెంట్లు ఆగిపోలేదు కమర్షియల్ సినిమాకు స
సెట్ చేసుకున్నట్టు ఏంటి ఇ కాంబినేషన్ అన్న వాళ్లు లేకపోలేదు..
వర్కింగ్ స్టిల్స్ నాగార్జున గెటప్ మీద చాలా విమర్శలు వచ్చాయి చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు గగ్గోలు పెట్టారు ఇవన్నీ పట్టించుకోకుండా సినిమా మీదే దృష్టిపెట్టారు యూనిట్ సభ్యులంతా..
నిర్మాత దొరస్వామిరాజు గారు లెక్కకు మించి ఖర్చు పెడుతున్నారు అయినా భయపడటం లేదు నమ్మిన వెంకన్న… నమ్మించిన రాఘవేంద్రరావు… మీద నమ్మకంతో ముందుకు పోతున్నారు
టి సిరీస్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి వెళ్ళింది….. బాగానే అమ్ముడుపోతున్నాయి

Source: Volga

కమర్షియల్ సినిమా కానందున బయ్యర్లు ఈ సినిమాని భారీ మొత్తంలో కొనుక్కోవడానికి సిద్ధపడలేదు…. నిర్మాత అతిగా ఆశపడే లేదు స్వతహాగా పెద్ద డిస్ట్రిబ్యూటర్ కావడంతో పంపిణీ నీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నమయ్య థియేటర్లలో విడుదలైంది
మొదటి రెండు రోజులు మిక్స్ డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సాధారణ ప్రేక్షకులు అన్నమయ్య సినిమా చూడడానికి రావడం మొదలు పెట్టారు చాలా కాలం తర్వాత సినిమా హాల్లో భక్తి పారవశ్యాన్ని అనుభవించడం చవిచూశారు

తెలుగువారికి అమిత ప్రీతిపాత్రుడైన వెంకటేశ్వర స్వామి మీద ఓ భక్తుడు చేసిన సంతకాన్ని చూసి తనివితీరా పునీతులయ్యారు ప్రేక్షకులు…..

థియేటర్ దగ్గరికి కుటుంబాలు తరలి వస్తున్నాయి టిక్కెట్ల కోసం బారులు తీరుతున్నారు జనాలు హౌస్ఫుల్ బోర్డ్ లకు నిరంతరం పని పడింది….

ఆడియో రేట్లు కోరుకున్న టి సిరీస్ కంపెనీ 10 లక్షల ఆడియో క్యాసెట్ లను అందింది ఆశ్చర్యపోయారు టి సిరీస్ అధినేతలు ఇళ్లల్లో గుళ్ళల్లో ఆఖరికి టీ కుట్లు లో కూడా ఇవే పాటలు…

నాగార్జునకి ఈ సినిమా ద్వారా ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డు తన నటనకి చిన్నదే అవుతుందన్న మాట అతిశయోక్తి కాదు

మాస్ మసాలా సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో అన్నమయ్య లాంటి చిత్రం 42 కేంద్రాల్లో వంద రోజులు రెండు సెంటర్లో సిల్వర్ జూబ్లీ ఆగడం చరిత్రను తిరగరాసింది….

సైలెంట్‌గా వ‌చ్చి వయొలెంట్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు ఉప్పెనతో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్ద‌రు కొత్త నటులతో, విజయ్ సేతుపతి వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడాయన నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేస్తార‌నే దానిపై ప్రతిఒక్కరిలో క్యూరియాసిటి పెరిగింది.
అయితే కమిట్మెంట్ ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే రెండు సినిమాలు చేయనున్నాడు బుచ్చిబాబు. రెండో సినిమా అక్కినేని నాగ చైత‌న్యతో చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిన్నటివరకు అఖిల్ కోసం నాగార్జున రాయభారం నడిపారని అనుకున్నారు. కానీ బుచ్చిబాబు చైతూతో కమిటైనట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగార్జునతో పాటూ చైతన్యకూ స్టోరీ వినిపించ‌డం… ఓకే చెప్పడం కూడా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ ఏడాదిలోనే ఈ మూవీ ప్రారంభంకానుంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ మూవీ చేస్తోన్న చైతూ…నెక్ట్స్ బుచ్చిబాబుతోనే పట్టాలెక్కుతాడేమో చూడాలి.