మెగాస్టార్ చిరంజీవి నిన్న ఫ్యామిలీతో కలిసి వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు. చిరంజీవి, సురేఖ జంటతో పాటు నాగబాబు ఫ్యామిలీ.. వరుణ్ తేజ్.. మెగాస్టార్ అమ్మగారు.. మెగా బంధువులు అంతా AMB మాల్ లో వకీల్ సాబ్ సినిమాని ఎంజాయ్ చేసారు.

మూడు ఏళ్లు అవుతున్నా పవర్ స్టార్ అదే ఉత్సాహంతో.. అదే వేడి..వాడితో వకీల్ సాబ్ లోనటించారు అని ప్రశంశించారు చిరంజీవి. ప్రకాశ్ రాజ్ తో కోర్డ్ సీన్ అద్భుతమని, హీరోయిన్లు ముగ్గురూ బాగా నటించారని వకీల్ సాబ్ కేసులనే కాదు..మనసులు కూడా గెలుచుకున్నారన్నారు చిరూ.

వకీల్ సాబ్ గురించి ట్వీట్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ ప్యాక్డ్ సూపర్ హిట్ అంటూ రామ్ చరణ్ ఆకాశానికి ఎత్తారు. మూవీ టీమ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను విష్ చేశారు చరణ్.

మరోవైపు పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ఓవర్ సిస్ లో ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిసింది. మొత్తం 226 లొకేషన్లలో రిలీజ్ చేయగా, ఒక్కరోజులోనే 296,885 డాలర్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ మూవీ ఓవర్ సీస్ హక్కులు సుమారు 5 కోట్లకు అమ్ముడు పోయాయి..