నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హాట్ కాంబో బీబీ3పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై వర్కింగ్‌ టైటిల్‌ ‘బీబీ3’ పేరుతో రూపొందుతున్న ఈ మూవీ పేరును ఉగాది రోజున అనౌన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో పూర్ణ కీలకపాత్రలో కనిపించనుంది. కన్నింగ్ డాక్టర్ దా పూర్ణ డిఫరెంట్ రోల్ చేస్తుందని సమాచారం. కాగా శ్రీకాంత్ మరో కీలకపాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని పేర్లు తెరపైకొచ్చాయి. గాడ్ ఫాదర్, మోనార్క్, టార్చ్ బేరర్ వంటి టైటిల్స్ వినిపించాయి. మరి వీటిలోనే ఒకదానిని ఫైనల్ చేస్తారా? లేదంటే సర్ప్రైజ్ గా మరో టైటిల్ ను రంగంలోకి దింపుతారా ? అనే సంగతి ఉగాదినాడే తెలిసే అవకాశం ఉంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని మే 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.

వర్కింగ్ టైటిల్ బీబీ3తో శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు… నంద‌మూరి బాల‌కృష్ణ-బోయ‌పాటి శ్రీను. వీరిద్దరి కాంబినేష‌న్ మూవీకి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ కాంబో మూవీకి మోనార్క్ అనే పేరును దాదాపు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక ఇప్ప‌టికే రిలీజైన ఈ ప్రాజెక్ట్ ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లకు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. మే 28న రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు మేకర్స్. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం టైటిల్ ఏంటో మాకు చెప్పాలని బాగా డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో…ఇదిలా జరుగుతుండగానే, బోయపాటి శ్రీను మోనార్క్ అనే టైటిల్‌ను ఆల్రెడీ రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు వార్తలొస్తున్నాయి.

అయితే మోనార్క్ అని బోయపాటి అనుకుంటున్నప్పటికీ బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిఉంది. ఎన్ని ప‌వ‌ర్ఫుల్ పేర్లు తెర‌పైకొచ్చినా..మోనార్క్ అనేది మాత్రం బాల‌య్య బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ అని మూవీ యూనిట్ అనుకుంటోందట. ప్ర‌స్తుతానికైతే డైరెక్టర్ బోయ‌పాటి ముందున్న‌ ఒకే ఒక్క ఆప్షన్ కూడా ఇదేనని చెప్పుకుంటున్నారు. మ‌రి మోనార్క్ గానే బాలకృష్ణను చూపిస్తారా….సరికొత్త టైటిల్ ను తెరపైకి తీసుకొస్తారా…ముందు ముందు తెలుస్తుంది.

మే 28న విడుదల తేదీని ప్రకటించి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు బోయపాటి – బాలయ్య. ఈ సినిమాలో రెండు పాత్రల్లో బాలకృష్ణ కనిపిస్తారనే ప్రచారం జరిగింది. అందులో ఒకటి కాశీలో నివసించే అఘోరా పాత్ర అన్నది బాగా వినిపించింది. అయితే ఈ కాంబో సినిమాలో ఆ అఘోర పాత్రను తీసేస్తున్నారని టాక్. బాలకృష్ణను కాసేపు అఘోరాగా చూపిద్దామనుకున్న బోయపాటి ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. మరి అఘోర పాత్రను ఇంకోలా డిజైన్ చేసారా…మొత్తానికే తొలగించారా అన్నది తెలియాల్సిఉంది. కాగా ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

BB3 సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తారనే వార్త బలంగా వినిపిస్తోంది. క్రాక్ హిట్ తో మంచి జోష్ మీదున్న గోపీచంద్ మలినేని…ఈమధ్యే బాలయ్యను కలిసి కథ వినిపించారట. కేవలం బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని రాసిన ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో నటసింహం సైతం వెంటనే అంగీకరించందని టాక్. ఇక ఈ సినిమాను నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్ త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనుందట.

2020 కరోనా కాలం తర్వాత 2021 సంక్రాంతికి బోణీకొట్టిన క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని. క్రాక్ స‌క్సెస్‌తో ఫుల్ హుషారుమీదున్న ఈ డైరెక్టర్ రీసెంట్ గా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను కలిసి ఓ మాస్ ఎంట‌ర్ టైన్మెంట్ స్టోరీ వినిపించారట…సింగిల్ సిట్టింగ్ లో బాలయ్య ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మ్యాటర్ కి సంబంధించి…తాజాగా ఓ అప్‌డేట్ వ‌చ్చింది.
వరుస సినిమాలతో బిజీగా మారిన ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుందట. అంతేకాదు బోయపాటి సినిమా పూర్తవగానే బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి వర్కౌట్ చేస్తారట. ఇక ఈ సంవత్సరం మే నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుందట. మైత్రీ మూవీ మేక‌ర్స్ సైతం త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.
క్రాక్ మూవీ బాక్సాపీస్ హిట్ కావడంతో కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ నుంచి సైతం గోపీచంద్ మలినేని చెంతకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. అయితే ఈ డైరెక్టర్ మాత్రం బాలయ్యబాబుతో మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరిచూద్దాం బాలకృష్ణతో మరో క్రాకింగ్ హిట్ కొడతారేమో గోపీచంద్ మలినేని.

ఎప్పుడెప్పుడా అన్న సమయం రానేవస్తోంది. గత కొన్నేళ్లుగా నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా ఈ ప్రశ్న ఎదురైనప్పుడల్లా సరైన సమాధానం చెప్పలేదు. ఉంటుంది అన్నారు కానీ ఎప్పుడన్న విషయంపై ఎప్పడూ క్లారిటీ ఇవ్వలేదు. ఇక బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న ఆయన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ సంబంధించిన అప్డేట్ ఉంటుందని తెలుస్తోంది.
దేనికైనా ముహుర్తాన్ని బాగా చూసుకునే బాలయ్య…నందమూరి వారసుడి అరంగేట్రానికి కూడా గట్టి టైంనే ఫిక్స్ చేసారని అంటున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూజీ జగన్నాథ్ మోక్షజ్ఞ బాధ్యతలను కూడా తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం చేస్తున్న లైగర్ అయిన వెంటనే…ఈ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టనున్నారట పూరీ. పాన్ ఇండియన్ మూవీగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. సో..నందమూరి వారసుడి ఎంట్రీనే ఓ పాన్ ఇండియన్ చిత్రం కావడం విశేషం.