గతేడాది ఎంత మంచి వాడవురా అంటూ ప్రేక్షకుల్ని పలకరించారు కల్యాణ్ రామ్. అయితే ఆయన ఎంత మంచిగా పలకరించినా…ప్రేక్షకులు నిరాశనే మిగిల్చారు. అందుకే కసిగా మూడు పాత్రలతో ఒకే సినిమాలో నటవిశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. పటాస్ సూపర్ హిట్, 118 క్లాసీ హిట్ తర్వాత హిట్ అన్న మాట వినలేదు కల్యాణ్ రామ్. ఇప్పుడు ఖచ్చితంగా ఓ సక్సెస్ కావాలి. మరి కావాలంటే మంచి స్క్రిప్ట్ ఎంచుకోవాలి. అలా ఎన్నో కథల ఫిల్టరింగ్ తర్వాత రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్టర్ దగ్గర ఆగారట కల్యాణ్ రామ్.
రాజేంద్ర కథ చెప్పిన విధానం నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కళ్యాణ్. ఇక ఈ మూవీలోనే నందమూరి హీరో మూడు పాత్రలలో దర్శనమిస్తాడని ఇండస్రీ్ టాక్. ఇంతకుముందు కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసాడు… అయితే త్రిపాత్రాభినయం చేయడం ఇదే తొలిసారి.
కల్యాణ్ రామ్, రాజేంద్ర కలయికలో వస్తున్న ఈ మూవీని టాప్ ప్రొడక్షన్ హౌస్… మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు రెడీగా ఉందట. అలాగే ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నుచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం జూన్ వరకు పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారట. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట దర్శకనిర్మాతలు.
ఇది మాత్రమే కాదు..హీరో కళ్యాణ్ రామ్, దర్శకుడు వేణు మల్లిడికి కూడా మాటిచ్చారట. ఈ ప్రాజెక్ట్ కు తుగ్లక్ అనే టైటిల్ ఖరారు చేసారని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రావాలి. హీరోగా ఈ హీరో కథిలావుంటే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీగా తెరకెక్కబోతున్న ‘అయినను పోయిరావలె హస్తినకు’ సినిమా నిర్మాతగా కళ్యాణ్ రామ్ పనులు మొదలెట్టారు. ఇది మార్చ్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.