పిచ్చి కాదు తమది ప్రేమంటుంది పూజా హెగ్దే. ఈ లవ్ స్టోరీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని ఆమె మాటలవర్షం కురిపిస్తుంది. డార్లింగ్ ప్రభాస్ జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. జూలై 30వ తేదీన విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌ను మూవీయ యూనిట్ రిలీజ్ చేసింది. ‘రాధేశ్యామ్‌’ తో పాటూ వెంకీ ‘నారప్ప’తో, రవితేజ ‘ఖిలాడీ’తో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ‘అన్నం’: పరబ్రహ్మ స్వరూపం అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. టక్ జగదీష్, మోసగాళ్లు, ఇదే మా కథ, గ్యాంగ్ స్టర్ గంగరాజు వంటి సినిమాల నుంచి కూడా మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్స్ వచ్చేసాయి.

కరోనాతో ఢీలాపడ్డ సినీపరిశ్రమ ప్రస్తుతం తెగ సందడి చేస్తోంది. గతేడాది వాయిదాపడ్డ సినిమాలతో పాటూ ఈ ఏడాది రీలీజ్ కి రెడీ అవుతోన్న సినిమాలు కలుపుకొని టాలీవుడ్ జోరు చూపిస్తోంది. వరుసపెట్టి విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సంవత్సరం బడా హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒకే నెలలో నువ్వా నేనా అనుకునేలా పోటీపడుతున్నారు టాలీవుడ్ హీరోలు.
ఏప్రిల్ నెల గురించి తెలిసిందే ఏప్రిల్ 16న నాగచైతన్య, నానిల మధ్య క్లాష్ ఏర్పడుతోంది. ఒక నెల మాత్రమే కాదు ఒకే రోజు వీళ్లిద్దరి లవ్ స్టోరీ, టక్ జగదీష్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక మే నెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఒక్క నెలలో చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ సినిమాలు వరుసబెట్టి రిలీజ్ కాబోతున్నాయి. మే 13న చిరూ ‘ఆచార్య’, మే 14న వెంకీ ‘నారప్ప’ వస్తుండగా మే 28న ‘బాలయ్య, బోయపాటి’ కాంబో మూవీతో పాటూ రవితేజ ‘ఖిలాడి’ కూడా బరిలోకి దిగుతోంది. ఆలా బడా హీరోలు ఒకే టైంలో రంగంలో దిగుతున్న ఘట్టం కేవలం 90ల్లో కనిపించేది. మళ్లీ ఇనాళ్లకి ఈ ఫీట్ రిపీట్ కానుంది.
చిరూ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ రిలీజ్ టైంలోనూ గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంతో పోటీకొచ్చారు బాలకృష్ణ. కాకపోతే ఈసారి వీళ్లిద్దరి చిత్రాలకు రెండు వారాల తేడా వచ్చి ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ నిచ్చింది. కాకపోతే ఆచార్య వచ్చిన ఒక్కరోజు తేడాతోనే నారప్ప విడుదలవుతోంది. అలానే రవితేజ ఖిలాడీ, బాలకృష్ణ సినిమా ఒకేరోజు ఢీకొట్టబోతున్నాయి. దీంతో కలెక్షన్లు తేడా కొట్టే అవకాశమూ లేకపోలేదు. అందుకే ఏప్రిల్ లో నాగచైతన్యను ముందుంచి నాని, చిరూతో పోటీకి వెంకీ, బాలయ్యతో ఎదురులేకుండా రవితేజ తగ్గొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. మరి నిజంగానే తగ్గుతారా…లేదూ సై అంటే సై అంటారా….అలా అనుకుంటే సినీపోరులో గెలుపెవరిది అన్నది ఆసక్తిగా మారింది.

విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న నారప్ప ఓ కొలిక్కి వచ్చేసింది. మే 14న రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది. అటు వరుణ్ తేజ్ తో కలిసి యమాజోరుగా ఎఫ్ 3ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3…ఆగస్టు 27న ప్రేక్షకులకు నవ్వులవిందును అందించేందుకు కర్చీప్ వేసింది. మరి నెక్ట్స్…వెంకీ గుర్రపు స్వారీ చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకటేశ్ నటిస్తారని తెలుస్తోంది. గుర్రపు పందాల నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్ట్ లో వెంకటేశ్ హార్స్ రైడర్ గా కనిపిస్తారట. ఇప్పటికే తరుణ్ భాస్కర్..హీరో వెంకటేశ్ కి కథ చెప్పేయడం…నచ్చడం…ప్రొడ్యూసర్ గా సురేశ్ బాబు ముందుకు రావడం అన్నీ జరిగిపోయాయని అంటున్నారు. జూన్ లేదంటే జూలై నుంచి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ గుర్రపుస్వారీ చేస్తారని సమాచారం. మరి చాలాసార్లు ఇలా వార్తల్లో నిలిచి మాయమయిన ఈ న్యూస్…ఈసారైన నిజమవుతుందా…చూడాలి.

విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న నారప్ప చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకురానుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ…త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంటుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. హీరో ధనుష్ నటించిన తమిళ్ బ్లాక్ బస్టర్ అసురన్ సినిమాకిది రీమేక్. అయితే మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తున్నారట. చిత్రీకరణ విషయంలో రాజీపడకుండా గతంలో బాగా రాలేదనుకున్న సన్నివేశాలను మరలా రీషూట్ కూడా చేసారట.

ఇద్దరు పిల్లల తండ్రిగా వెంకీ నటిస్తోన్న ఈ సినిమాలో లేడీ లీడ్ గా ప్రియమణి నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, కార్తీక్ రత్నం..ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. కలైపులి ఎస్.థానుతో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.