జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి తమ్ముడు హీరోగా అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైంది. తన పేరు నార్నె నితిన్ చంద్ర. ఈ ఏప్రిల్ 18న నార్నె నితిన్ హీరోగా నటించబోతున్న సినిమా అధికారికంగా ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నటనలో ట్రైనింగ్ తీసుకుని..అన్నివిధాలా పక్కాగా రెడీ అయ్యాడని సమాచారం. ఎక్కడా తగ్గేది లేదన్నట్టు డ్యాన్స్, ఫైట్స్…ఇలా ప్రతి దాంట్లోనూ అనుభవం తెచ్చుకున్నట్టు చెప్తున్నారు. నిజానికి డైరక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్ చంద్ర టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడనే వార్త హల్చల్ చేసింది. ‘చిత్రం’ సీక్వెల్ ‘చిత్రం 1.1’ రానా తమ్ముడు అభితో పాటూ నితిన్ కూడా ఎంట్రీ ఇస్తాడనుకున్నారు. కానీ మరో క్రేజీ చిత్రంతో ఎన్టీఆర్ బామ్మరిది ఎంట్రీ అదిరిపోనుందనే టాక్ వినిపిస్తోంది.