మంచు విష్ణు, కాజల్ అన్నాచెల్లెళ్లుగా నటించిన సినిమా ‘మోసగాళ్లు’. ఓ భారీ ఐటీ స్కామ్ కథాంశంతో జెఫ్రీ గీ చిన్‌ ఈ మూవీని డైరెక్ట్ చేసారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో మోసగాళ్లని రిలీజ్ చేయనున్నారు. నవదీప్, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర, రుహీసింగ్‌ వంటివారు ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు.

మంచువిష్ణు, కాజల్ దొంగలుగా నటించిన ఈ ప్రాజెక్ట్ లో ఐటీ కుంభకోణ నిందితులను పట్టుకునే పవర్‌ఫుల్ ఆఫీసర్ ఏసీపీ కుమార్ పాత్రలో సునీల్ శెట్టి నటించారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ బ్యానర్లపై హీరో మంచు విష్ణు స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆమధ్య ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ కాగా ప్రేక్షకులని బాగానే ఆక‌ట్టుకుంది. ఇక సంక్రాంతి ప్రత్యేకంగా మోసగాళ్లు మూవీ నుండి సరికొత్త పోస్ట‌ర్ షేర్ చేసారు. మోసగాడంటూ ఓ క్లాస్ లుక్ లో దర్శనమిచ్చారు మంచు విష్ణు ఇందులో.