విఘ్నేష్ శివన్ తో ఓ వైపు ఎంగేజ్ మెంట్ వార్తలు వస్తుంటే…రజినీతో నయనతార ప్రేమంటని కంగారు పడకండి. అయితే నిజంగానే సూపర్ స్టార్ రజినీ, సౌత్ క్వీన్ నయన్ లవ్ సాంగ్ పాడుకుంటున్నారు. అదీ ‘అన్నాత్తే’ సినిమా కోసం. జె. శివ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్‌ అన్నాత్తే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ‘నయనతార’తో పాటూ లేడీ లీడ్స్ గా ‘కీర్తి సురేష్’, ‘మీనా’, ‘ఖుష్బూ’ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఆగిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. తాజాగా వేసిన ఓ భారీ సెట్‌లో రజనీ, నయనతారపై డ్యూయట్‌ సాంగ్ షూట్ చేస్తున్నారని టాక్. ఈ పాట అయినవెంటనే విలన్స్ తో రజినీకి ఓ యాక్షన్‌ సీక్వెన్స్ ప్లాన్ చేసారట. కాగా ‘అన్నాత్తే’ చిత్రం దీపావళి కానుకగా ఈ సంవత్సరం నవంబరు 4న రిలీజ్ కానుంది.

పెద్దన్నయ్య అంటే నందమూరి బాలకృష్ణ సినిమా కాదు. రజినీకాంత్ ‘అన్నాత్తే’. అన్నాత్తే అంటే తెలుగులో పెద్దన్నయ్య. అవును రజినీకాంత్ తిరిగి అన్నాత్తే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ తదితరులు నటిస్తున్నారు. గతేడాది డిసెంబరులో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ చిత్ర షూటింగ్‌ను లాక్ డౌన్ తర్వాత స్టార్ట్‌ చేశారు. కానీ మూవీ యూనిట్ లో కొందరు కరోనా బారిన పడటంతో చిత్రీకరణ నిలిచిపోయింది. అదే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కుదుటపడ్డాక చెన్నై చేరుకున్న రజినీకాంత్…మళ్లీ షూటింగ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారట. దీంతో అన్నాత్తేను రీస్టార్ట్ చేసేందుకు డైరెక్టర్ శివ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 15వ తేదీన షూటింగ్ ఆరంభించడానికి రెడీ చేస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే సూపర్ స్టార్ కూడా పాల్గొనబోతున్నారట. ఇప్పటికే సినిమా చిత్రీకరణకు బాగా ఆలస్యమైందని…నటీనటుల కాల్షీట్స్‌ సమస్య తలెత్తకుండా అన్నాత్తే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ నవంబరు 4న ‘అన్నాత్తే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న లూసిఫర్ రీమేక్ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ లో నయన్ ఉంటారని ఓసారి, ఉండరని ఓసారి చెబుతున్నారు. అంతేకాదు కొందరు మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తారంటే కాదు చెల్లెలి పాత్రను చేస్తారని మరికొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

చిరూ లూసిఫర్ రీమేక్ లో ఆయన చెల్లెలుగా నటించేందుకు నయన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. చిరంజీవికి ధీటుగా చాలా పవర్ఫుల్ పాత్ర కాబట్టే నయన్ అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. నయన్ రిజెక్ట్ చేసారనే వార్తల్లో నిజం లేదని…ఆమె ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే ఇప్పుడు ఆమెకు జోడిగా కనిపించే ఓ హీరో కోసం సెర్చ్ చేస్తున్నారట మేకర్స్. అందరూ సెట్ అయిపోతే నటీనటులతో కూడిన పూర్తి సమాచారాన్ని అధికారిక ప్రకటనగా విడుదల చేస్తారట. కాగా వచ్చే మార్చి నుంచే లూసీఫర్ రీమేక్ సెట్స్ పైకెళ్లనుంది.

ఆ ఇద్దరితో నటిస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉందంటున్నారు సమంతా అక్కినేని. వారేవరో కాదు నయనతార, విజయ్ సేతుపతి. అయితే సూపర్ డీలక్స్ సినిమాలో సామ్, విజయ్ సేతుపతి నటించినా వీళ్లిద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవు. దీంతో ఆ కల…కలలానే మిగిలింది. ఇప్పుడిక జాక్ పాట్ కొట్టినట్టు తన ఫేవరేట్స్ నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఒకే సినిమాలో నటిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సమంతా.

బిజీబిజీగా అయితే ఉన్నారు కానీ పెద్దగా సినిమాలు అంగీకరించట్లేరు సామ్. ధి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం నయన్ లవర్ విఘ్నేశ్ శివన్ సినిమాతో పాటూ గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న శాకుంతలం ప్రాజెక్ట్స్ లాక్ చేసారు సామ్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ్ మూవీలోనే పవర్ ఫుల్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతితో పాటూ నయనతారతో కలసి నటిస్తున్నారు సమంత. ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ మూవీతో తీరుతుందని అంటున్నారు.

చిరూ లూసిఫర్ రీమేక్ ఆఫర్ ని రిజెక్ట్ చేసారట నయనతార. మొన్నటివరకు లూసిఫర్ రీమేక్ లో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటిస్తారనే వార్తలు చక్కర్లుకొట్టాయి. అయితే లూసిఫర్ ఒరిజనల్ మూవీలా కాకుండా ఇందులో చిరూ సరసన హీరోయిన్ ట్రాక్ యాడ్ చేసారట. ఆ హీరోయిన్ పాత్రలోనే నయన్ నటించాల్సిందిగా చిత్రయూనిట్ సంప్రదించారని టాక్. అయితే ఆ పాత్రకి ఇంప్రెస్ కాని నయనతార ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఇక ఇలా నయన్ నో చెప్పడంతో ఇప్పుడు చిరూ సరసన నటించే మరో తార కోసం సెర్చ్ చేస్తున్నారట డైరెక్టర్ మోహన్ రాజా.

సైరా నరసింహారెడ్డిలో చిరూ సరసన నటించిన నయనతార సంగతలా ఉంటే…అదే సినిమాలో ప్రత్యేకపాత్ర పోషించిన కిచ్చా సుదీప్ కథ వేరేలా ఉంది. ఆచార్య కోసం ఈగ విలన్ వస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ఆచార్య సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. చిన్న పాత్రైన చాలా ప్రాధాన్యత ఉండటంతో మేకర్స్ అడగ్గానే సుదీప్ ఓకే చెప్పారని టాక్. కన్నడ పరిశ్రమలో ఇటీవలే 25 వసంతాలు పూర్తిచేసుకున్న సుదీప్… ఇప్పుడిలా ఆచార్య కోసం అడగ్గానే కాదనకుండా ఓకే చెప్పారట.

మెగాస్టార్ లూసీఫర్ రీమేక్ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. నయనతార చిరూ చెల్లెలిగా, సత్యదేవ్ మరో పాత్రలో కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే వీటి గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని తెలిసింది. స్వయంగా లూసీఫర్ రీమేక్ కు సంగీతం సమకూర్చబోయేది నేనే అని ప్రకటించాడు తమన్. ‘ప్రతి సంగీత దర్శకుడికి ఇది ఓ పెద్ద కల…ఇప్పుడు నా వంతు రానేవచ్చింది…మెగాస్టార్ పై నాకున్న అభిమానాన్ని నా మ్యూజిక్ తో తెలియజేస్తాను’ అని మురిసిపోయాడు తమన్.
అయితే ఈ మూవీకి సంబంధించి చాలామంది డైరెక్టర్ల పేర్లు తెరపైకొచ్చినా చివరికి… ఆ ఛాన్స్ ‘తనిఒరువన్‌’ మేకర్ మోహన్‌రాజాకు దక్కింది. మోహన్‌రాజా తీర్చిదిద్దిన రీమేక్‌ వెర్షన్‌ బాగా నచ్చడంతో.. వెంటనే చిరు డైరెక్టర్‌ను ప్రకటించారు. జనవరి చివరివారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకెళ్లనుందని.., ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిగ్ షెడ్యూల్ ప్లాన్‌ చేస్తున్నట్టు అధికారికంగా తెలియజేసారు. ఇక ఇప్పుడు తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ కూడా సిద్ధమయ్యాడు.

ఓ వైపు 40 మిలియన్ ప్లస్ వ్యూస్ తో రాఖీ భాయ్ కేజీఎఫ్ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంటే..మరోవైపు నయన తార ‘రాకీ’ అంటూ ఓ టీజర్ ను రిలీజ్ చేసారు. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలతో ఆకట్టుకున్న ఈ జంట.. తాజాగా ”రాకీ” అనే తమిల్ మూవీతో త్వరలోనే రానున్నారు. ‘తారామణి’ మూవీతో పేరు తెచ్చుకున్న వసంత్ రవి ‘రాకీ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించాడు. వెటరన్ డైరెక్టర్ భారతీరాజా, రోహిణి, రవీనా రవి ప్రధాన తారగణంగా కనిపించనున్నారు. అరుణ్ మధేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదో రివేంజ్ యాక్షన్ డ్రామా అని విషయం ఈ టీజర్ తో తెలుస్తుంది. ‘మనిషి ఓ అత్యంత క్రూరమైన జంతువు’ అని ప్రారంభమైన ఈ టీజర్ చాలా వైలెంట్ గా ఉంది. భారతీరాజా చూస్తుండగా.. వసంత్ రవి ఒక వ్యక్తి పీకని అతి కిరాతకంగా కోయడం జుగుప్సాకరంగా ఉంది. ఆపై చనిపోయిన వ్యక్తి పేగులని తీసి అతని మెడలోనే వేయడం ద్వారా ఈ సినిమా ఎంత భయంకరంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. ‘తూటా’ ఫేమ్ దర్బుక శివ దీనికి మ్యూజిక్ అందించాడు. నయన తార – విఘ్నేష్ శివన్ కాంబో నిర్మాణం నుంచి ‘రాకీ’ చిత్రం త్వరలోనే థియేటర్స్ కి రానుంది.

Source: Lahai Music

ఫిబ్రవరిలోనే పెళ్లిపీటలెక్కబోతుంది నయనతార. తమ 5ఏళ్ల సహజీవనానికి పెళ్లి కార్డుతో శుభం పలుకనున్నారు నయన్ – విఘ్నేశ్ జంట. 2015లో ‘నానుమ్ రౌడీ దాన్’ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు వీళ్లు. అయితే విఘ్నేశ్ గురించి సర్వం తెలుసుకోడానికి నయన్ కి ఐదేళ్లు పట్టింది. అందుకే ఇప్పుడు ఉత్సాహంగా నేను పెళ్లికి రెడీ అంటోంది.
శింభుతో ముద్దాయణం…ప్రభుదేవాతో ప్రేమాయణం బెడిసికొట్టిన తర్వాత ఆచి తూచి అడుగేసిందీ స్టార్ హీరోయిన్. తన మనసుకు నచ్చిన విఘ్నేశ్ తో అయితే బాగానే తిరిగింది. ఫోటోలకు ఫోజుచ్చింది. కానీ సంవత్సరాలు గడుస్తున్నా…పెళ్లి ఊసెత్తలేదు. చివరికి ఒకరికి ఒకరు అని నిర్ధారించుకున్నాకే…36ఏళ్ల నయనతార, 35ఏళ్ల విఘ్నేశ్ శివన్ ను భర్తగా అంగీకరించింది.
హిందూ – క్రైస్తవ…రెండు సంప్రదాయాల ప్రకారం నయన్ – విఘ్నేశ్ ల వివాహం జరగనుంది. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వేడుక చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ‘కథవాకుల రెండు కాదల్’ చిత్రం కోసం విఘ్నేశ్ శివన్, నయన్ కలిసి వర్క్ చేస్తున్నారు. నయనతారతో పాటూ ఈ ప్రాజెక్ట్ లో విజయ్ సేతుపతి, సమంతా కూడా నటిస్తున్నారు.

ఇంతకుముందు వేరు…ఇప్పుడు వేరు…మన సినిమా మారుతుంది అనడానికి ఇప్పుడు చాలా ఉదాహరణలు దొరుకుతున్నాయి. హీరోయిన్ గానే చెయ్యాలనే మడి కట్టుకుని కూర్చోకుండా…క్యారెక్టర్ లో దమ్ముంటే చెల్లెలి పాత్రకైనా సై అంటున్నారు నేటితరం స్టార్ హీరోయిన్స్. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో వారి సిస్టర్స్ గానే.
చిరంజీవి – నయనతార, అల్లు అర్జున్ – సాయి పల్లవి…ఈ జంటల పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కారణం వీళ్లు అన్నాచెల్లెళ్లుగా కలిసి నటిస్తుండటమే. లూసిఫర్ రీమేక్ లో చిరూ సిస్టర్ గా కనిపించేందుకు నయన్ అంగీకరించిందట. అలాగే పుష్ప చిత్రంలో బన్నీ చెల్లెలి పాత్రలో సాయి పల్లవి కనిపించనుందట.
నయన్ అయినా సాయి పల్లవి అయినా ఊరికనే సినిమాలను ఒప్పుకోరు. వాళ్ల క్యారెక్టర్ ఏంటి…సినిమాలో ప్రాముఖ్యత ఉంటుందా అన్న బేరీజులు వేసుకుంటారు. ఓ క్లియర్ క్లారిటీ వచ్చాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలాంటి హీరోయిన్స్ ఇప్పుడు స్టార్ హీరోలకు చెల్లెళ్లుగా నటిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఆ రోల్స్ ఎంత డిమాండ్ చేసాయో…సో ఆల్ ది బెస్ట్ టు బెస్ట్ ఈ ఇద్దరికీ.

దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార మహారాణిగా మారనున్నారని వార్తలొచ్చాయి. నయన్ ను రాణిగా చూడటం కొత్తేమీ కాదు. శ్రీరామరాజ్యంలో రాముని పట్టమహీషి సీతమ్మగా… కార్తి కాష్మోరాలో కాసేపు యువరాణిగా…చిరూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మగా కనిపించి మెప్పించారు నయనతార. అయితే ఈసారి బ్రిటిష్వారిపై పోరాడిన మొట్టమొదటి క్వీన్ గా కనిపించేందుకు రెడీఅవుతున్నారని ప్రచారం జరిగింది. ఆ రాణి పేరు వేలు నాచ్చియార్. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురానికి చెందిన రాణి వేలు నాచ్చియార్. 1780 నుంచి 1790 వరకూ శివగంగై సంస్థానానికి అన్ని తానై పాలించారు వేలు నాచ్చియార్. ఆమె జీవితం ఆధారంగా డైరెక్టర్ సుశీ గణేశన్ఓ మూవీనీ తెరకెక్కించనున్నాడు. ఇందులోనే రాణి పాత్రకు నయనతారను సంప్రదించారనీ… ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు నయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తమిళ్ మీడియా కోడై కూసింది.
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ నయన్ గ్లామర్ మాత్రం పెరుగుతూనేఉంది. ఓ వైపు రెగ్యులర్కమర్షియల్సినిమాల్లో హీరోల సరసన నటిస్తూ, మరోవైపు హీరోయిన్ఓరియంటెడ్సినిమాలతో దూసుకెళుతున్నారు నయనతార. అందుకే వేలు నాచ్చియార్కి నయనతార అయితేనే కరెక్ట్ అని సుశీ గణేశన్అనుకున్నారని టాక్ వినిపించింది.. వేలు నాచ్చియార్కి యుద్ధ విద్యల్లోని నైపుణ్యంతో పాటూ గుర్రపు స్వారీ, విలు విద్య, కర్ర సాము వంటివన్నీ తెలుసు. మరి ఆమెలా కనబడాలంటే వీటన్నింటిని ప్రదర్శించాలని తెలుసుకున్న నయన్…ప్రాక్టీస్ ఎప్పటినుంచి ప్రారంభిస్తుందో అని కూడా లెక్కలేసారు.
కానీ ఈ వార్తల్ని ఖండించింది నయనతార. అఫీషియల్ గా తన టీం నుంచి నోటీస్ రిలీజ్ చేసింది. తాను రాణిగా నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వెల్లడించింది. ఇలాంటి వార్తల్ని ప్రచారం చేసేముందు కాస్త ఆలోచించి…నా టీంను తెలుసుకుని పభ్లిష్ చేయాలని తెలిపింది. సో మహారాణిగా…నయన్ అన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నమాట.