1999 లో నరసింహ సినిమా ఓ సంచలనం, రజినీ, రమ్యకృష్ణ పోటాపోటీ అభినయానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం తోడై దుమ్ము లేపుతోంది అదే అంచనాలతో బాబా సినిమా విడుదలైంది …..పెద్ద డిజాస్టర్…. రెండేళ్లపాటు రజిని సినిమా కి దూరం… 2004 అక్టోబర్ 1న చెన్నై టీ నగర్ లో శివాజీ గణేషన్ ఇల్లు. ఆరోజు పెద్దాయన జయంతి. శివాజీ గణేషన్ కొడుకులు ప్రభు రామ్ కుమార్ లు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు .అనుకోని అతిధిలా రజినీకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్లంతా కంగారు పడిపోయారు. ఈ లోపు హాల్లో ఉన్న శివాజీ గణేషన్ ఫోటోకి అంజలి ఘటిస్తునారు రజనీకాంత్. మనసు నిండా తెలియని ఏదో ఆవేదన. తన ఇంటికి భోజనానికి రమ్మని శివాజీ గణేషన్ ఎన్నిసార్లు అడిగినా రజినికి కుదరలేదు… ఇప్పుడు ఇలా ఆయన లేనప్పుడు వచ్చాడు, రజనీ లో అదే చింత.. దానికి తోడు బయటకు రాగానే మీడియా వాళ్ళు రజిని చుట్టుముట్టారు. మామూలుగా అయితే మాట్లాడకుండా దండం పెట్టి వెళ్ళిపోతాడు కానీ ఆరోజు మాట్లాడాడు. పెద్దాయన స్థాపించిన శివాజీ ప్రొడక్షన్స్ లో సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేశాడు. అందరూ షాక్, రెండేళ్ల నుంచి సినిమా చేయడం లేదు. 2002లో వచ్చిన బాబా పెద్ద డిజాస్టర్, అందుకే ఈసారి పెద్ద హిట్ సాధించాలని తపనతో ఉన్నాడు రజిని.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో జగ్గు భాయ్ సినిమా అనౌన్స్ చేశాడు రజిని…. ఈ రెండిట్లో ఏది ఉంటుంది?.. బెంగళూరు వెళ్ళాడు. రజిని ముసలోడి గెటప్లో ఆప్త మిత్రుడు సినిమా కి వెళ్లాడు. రజిని సినిమా చూస్తూ జనాలు చప్పట్లు వింటూ ఏదో ఆలోచిస్తున్నాడు రజిని……తనకి రైట్ టైం లో రైట్ సినిమా, సింహం ఆకలి తీర్చే సినిమా, పి.వాసు కి కాల్ చేసాడు, ప్రభు కి కూడా కాల్ చేశాడు. ఆప్త మిత్రును మనం రీమిక్స్ చేస్తున్నామని చెప్పాడు రజిని .పి.వాసు కంగారు పడ్డాడు ఇదే సినిమాను తమిళంలో ప్రభు తో రీమేక్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రజనీని చేస్తానంటున్నాడు. అర్థం కావట్లేదు మరి జగ్గు భాయ్ అన్నాడు పి వాసు… అది కాన్సిల్ మనం ఆప్తమిత్ర చేస్తున్నాం. మణిచిత్రాథాజు , ఆప్తమిత్ర, ఈ రెండిటినీ మించేలా ఉండాలని రజిని చెప్పాడు కథను మార్చకూడదు కానీ రజిని ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులు చేయాలి. పి వాసు అదే చేస్తున్నాడు రజిని కూడా ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడు.


దెయ్యం పేరు నాగవల్లి… ఆ పేరు నచ్చలేదు రాజుల కాలం నాటి నర్తకి కాబట్టి ఇంకా హెవీ గా ఉండాలి .. అప్పుడు చంద్రముఖి అనే పేరు వచ్చింది ఫిక్స్ చేశారు. ఆప్తమిత్రులో విష్ణువర్ధన్ హౌలా హౌలా అంటాడు, రజినీకాంత్ కి అది నచ్చలేదు. అప్పుడు చిన్నప్పుడు రజిని ఒక మరాఠీ నాటకంలో విన్న విలన్ మేనరిజం గుర్తొచ్చింది, అదే “లక లక లక లక లక”… దుర్గ పాత్రకు నయనతార…. జ్యోతిక కు గంగ పాత్ర అంతా ఫిక్స్ హైదరాబాద్ లో షూటింగ్ దాదాపుగా అంతా ఇక్కడే కొంతవరకు మాత్రం చెన్నైలో కొన్ని పాటలకు టర్కీ వెళ్లారు ఎంత స్పీడ్ గా అంటే అంత స్పీడ్ గా ఫినిష్ ఐపోయింది సినిమా.

Source: Sri Balaji videos

19 కోట్ల బడ్జెట్ తేలింది 2005 ఏప్రిల్ 14 తెలుగు తమిళ భాషల్లో చంద్రముఖి సినిమా చూసి ప్రేక్షకులకు దిమ్మతిరిగిపోయింది.
10, 20, 30, 40, 50, 60, 70 ఇలా కోట్లు కోట్లు వస్తూనే ఉన్నాయి.
50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఇలా గడుస్తూనే ఉంది, సినిమా అస్సలు ప్రభావం తగ్గట్లేదు.
ఇండియాలో 45 కోట్లు వసూలు చేయడమే కాక ప్రపంచ స్థాయిలో 75 కోట్లు పైనే వసూలు చేసి ఎన్నో రికార్డులు సృష్టించింది.
చెన్నైలోని శాంతి థియేటర్ లో 890 రోజులు పాటు నిరంతరాయంగా ఆడి అందరి చేత ఔరా అనిపించుకుంది.

బాబా పరాజయం తర్వాత రజిని తనని తాను సూపర్ స్టార్ అని నిరూపించుకుంటూ తన పవర్ ఏంటో ఇండస్ట్రీకు పరిచయం చేశాడు ద గ్రేట్ “చంద్రముఖి” సినిమా తో……….

రజనీకాంత్ .. నడిచొచ్చే ఎనర్జీ. 70 కి దగ్గరవుతున్నా..ఇంకా అదే ఎనర్జీ తో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ ఈ మధ్య కాస్త డల్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో రజనీకాంత్ కి హెల్త్ బాలేకపోవడంతో అటు పొలిటికల్ స్పీడ్ కి , ఇటు సినిమాల స్పీడ్ కి బ్రేక్ పడింది. దాంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు .

దాదాపు రెండు నెలలనుంచి ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వని రజనీకాంత్ .. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. అంతకుముందు అన్నాత్తే మూవీ కోసం రోజుకి 14 గంటలు కష్టపడిన రజనీకాంత్.. హెల్త్ బాలేకపోవడంతో షూటింగ్ ని కూడా పక్కన పెట్టేశారు. ఇక ఈ సినిమా ఇప్పట్లో ఉండదనుకున్నారు అంతా. అయితే రజనీ ఈ మన్త్ ఎండ్ కి గానీ , నెక్ట్స్ మన్త్ ఫస్ట్ వీక్ లో గానీ షూటింగ్ కి అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.

శివ డైరెక్షన్లో బారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీ ని దీపావళి కానుకగా నవంబర్ 4 న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా 40 పర్సెంట్ షూటింగ్ మాత్రమే మిగిలున్న ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చెయ్యడానికి మళ్లీ రెడీ అవుతున్నారు రజనీ. అంతేకాదు .. ఈ సినిమా కంప్లీషన్ తర్వాత యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో మరో సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నారు తలైవా. ఇలా లేట్ వయసులో కూడా యంగ్ జనరేషన్ తో పోటీ పడుతూ మళ్లీ కమ్ బ్యాక్ అవుతున్నారు రజనీకాంత్.