బాహుబలి, బాహుబలి 2 సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న బాహుబలి…ఇప్పుడు చెత్త అనిపించుకుంది. అయితే రాజమౌళి తెరకెక్కించిన అసలు సినిమాలు కాదు…నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బాహుబలి ప్రీక్వెల్. అవును 100కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాహుబలికి ముందు మహిష్మాతి రాజ్యం ఎలా ఉండేది? శివగామి పాత్ర ప్రత్యేకతలేమిటి? అంటూ కొన్ని ఆసక్తికర అంశాలతో ‘బాహుబలి – బిఫోర్ ది బిగినింగ్’ అన్న టైటిల్ తో భారీస్థాయిలో చిత్రీకరించారు.

నెట్ ఫ్లిక్స్ కోసం దీనిని మొత్తం 9భాగాలుగా మలిచారు. 100కోట్లు ఖర్చు పెట్టారు. రాజమౌళి కూడా దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కానీ క్వాలిటీ విషయంలో మైనస్ మార్కులు సంపాదించింది ఈ సిరీస్. దీంతో ఎపిసోడ్లలన్నింటీని క్యాన్సిల్ చేసిపారేసింది. చాలా చీఫ్ గా తెరకెకించడమే భారీ ఫ్లాప్ కి కారణమని గుర్తించిన నెట్ ఫ్లిక్స్ మళ్లీ రీషూట్ చేసేందుకు 200కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిందట. దీంతో ఇప్పటికీ ఈ బాహుబలి సిరీస్ కోసం బడ్జెట్ 300కోట్ల రూపాయలకు చేరుకుంది. చూద్దాం మరి కొత్త సిరీస్ అయిన మహిష్మాతి రాజ్యాన్ని ఎలా ఆవిష్కరిస్తుందో…

నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి….ఈ నలుగురు దర్శకులు కలిసి నాలుగు పిట్ట కథల్ని తెరకెక్కించారు. అదీ వెబ్ సిరీస్ కోసం. అవును ‘పిట్టకథలు’ పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం హిందీ సూపర్ హిట్ లస్ట్ స్టోరీస్ ను రీమేక్ చేసారు వీళ్లు. తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ హాట్ టాపిక గా మారింది.
తరుణ్ భాస్కర్ కథలో మంచు లక్ష్మి… నందినిరెడ్డి కథలో అమలాపాల్, జగపతిబాబు…నాగ్ అశ్విన్ కథలో శృతీహాసన్…సంకల్ప్ రెడ్డి కథలో సత్యదేవ్, ఈశారెబ్బా వంటివారు కీ రోల్స్ ప్లే చేసారు. టీజర్ చూస్తుంటేనే ఎంత బోల్డ్ గా ఈ సిరీస్ ఉండబోతుందో అర్ధమవుతుంది. ఒక్క మంచులక్ష్మి స్టోరీలో తప్ప మిగిలిన మూడింట్లో హాట్ సన్నివేషాలు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

Source: Netflix


నలుగురు మహిళలు, నాలుగు విభిన్న కథలు… వారి జీవితాల్లోని ప్రేమ, రకరకాల ఎమోషన్స్ వంటి వాటికి …ఈ నలుగురికి మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటన్నదే పిట్టకథల కథాంశం. ఈ మూవీ ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్ కానుంది. మరి డైరెక్ట్ తెలుగు సిరీస్ అంటూ హడావుడి చేస్తున్న నెట్ ఫ్లిక్స్ కి ఈ పిట్ట కథలు ఎంతలా హెల్ప్ అవుతాయో చూడాలి.