గతేడాది సినిమాలు, షూటింగ్స్ లేక వెలవెలబోయిన సినీరంగం ఇప్పుడు వెలిగిపోతుంది. జనవరి 1 వచ్చిందో…లేదో అపడేట్స్ వర్షం కురిపించింది. అర్థరాత్రి నుంచే మొదలైన హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. 

Video Copyright: Lahari music

జనవరి 14న రిలీజ్ కాబోతున్న క్రాక్ మూవీ ట్రైలర్ రిలీజైంది. వెంకటేశ్ వాయిస్ ఓవర్ తో ఫన్నీగా స్టార్ట్ అయిన ట్రైలర్ రవితేజ మాస్ డైలాగులతో బాగానే వేడెక్కించింది. దీంతో పాటూ క్రాక్ తర్వాత రవితేజ నటిస్తోన్న ఖిలాడి కి సంబంధించి న్యూ అప్ డేట్ అనౌన్స్ చేసారు. మాస్ రాజా డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు చెబుతూ ఖిలాడి పోస్టర్ ను రిలీజ్ చేసారు.

న్యూ ఇయర్ సందర్భంగా రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ‘యానిమల్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో పరిణితీ చోప్రా, అనిల్ కపూర్, బాబీడియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ రిలీజైంది. కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ కూల్ లుక్ లో దర్శనమిస్తుండగా మొత్తం 6 భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

నూతన ఏడాదిలో లవర్ బాయ్ గా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం శృతీహాసన్ తో మెరిపించిన వకీల్ సాబ్…సంక్రాంతికి టీజర్ తో రానున్నాడు.

ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎఫ్ 3 కి సంబంధించి మరో పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో వరుణ్, వెంకీ డబ్బును చూసి మైమరిచిపోతున్నట్టు కనిపిస్తున్నారు. తరుణ్ భాస్కర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసాడు. వెంకటేశ్ హీరోగా ఓ క్రీడా నేపథ్య సినిమాని తీసే పనిలో ఉన్నాడట తరుణ్ భాస్కర్. శర్వానంద్ హీరోగా ముస్తాబవుతున్న శ్రీకారం మూవీ కొత్త లుక్ రిలీజైంది. టోటల్ పల్లెటూరి నేపథ్యంగా ఈ ప్రాజెక్ట్ ను కిషోర్ రెడ్డి డైరెక్ట్ చేసారు. నాగచైతన్య, సాయి పల్లవి..ప్రేమజంటగా కనిపిస్తోన్న లుక్ నొకటి రిలీజ్ చేసింది లవ్ స్టోరి యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్ హిట్ దృశ్యం సీక్వెన్స్ దృశ్యం 2 మూవీ టీజర్ రిలీజైంది. మాక్సిమమ్ సేమ్ కాస్ట్ తో సేమ్ డైరెక్టర్ తెరెకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ త్వరలోనే ఓటీటీ వేదికగా రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ ధృవ సర్జా, రష్మికా నటించిన పొగరు తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజైంది.  పవర్ఫుల్ డైలాగ్స్ ప్యాక్డ్ గా దీన్ని మలిచిన చిత్రయూనిట్ త్వరలోనే మరో ట్రైలర్ ను విడుదల చేస్తారట.