పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబో మూవీకి హరిహర వీరమల్లు పేరునే టైటిల్ గా ఫిక్స్ చేశారు మేకర్స్.
మహా శివరాత్రి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఏ ఎమ్ రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ 2022 సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Source: Mega Surya Production

భారీ బడ్జెట్ తో పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్యాన్ ఇండియా రేంజ్ లో పవర్ స్టార్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా దీనిని నిర్మిస్తున్నారు ఏ.ఎం.రత్నం. మొఘల్ కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గజదొంగగా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలో చార్మినార్ సెట్ రూపొందిస్తున్నారు. కాగా మరో అద్భుతానికి కూడా మూవీ యూనిట్ తెరదీయనున్నారని సమాచారం.

గండి కోట సంస్థానాన్ని సైతం ఈ మూవీ కోసం పునఃసృష్టిస్తున్నారట. 17వ శతాబ్దపు పరిస్థితులు ప్రతిబింబించేలా ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ సారథ్యంలో గండికోట సంస్థానం సెట్ కూడా నిర్మించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లీడ్ హీరోయిన్ గా నటిస్తుండగా…బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇక క్రిష్ – పవన్ కాంబో చిత్రానికి హరిహర వీరమల్లు అనే టైటిల్ దాదాపు ఫిక్సయినట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పుష్ప చెల్లెలిగా…
పుష్ప మూవీలో బన్నీ చెల్లెలిగా సాయి పల్లవి కన్ఫర్మయిందనే ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం మేఘా ఆకాశ్ ఆ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సూర్య 40 షురూ
సూర్య 40 పేరుతో కొత్త సినిమా ప్రారంభమైంది. సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని డైరెక్టర్ పాండిరాజ్ తెరకెక్కించనున్నారు.

మోస్ట్ ట్రెండింగ్ బ్యాచిలర్…
రీసెంట్ గా రిలీజ్ చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీలోని గుచ్చే గులాబీ సాంగ్ 2మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ కార్యాలయంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది మూవీ యూనిట్.

అందాల ‘నిధి’కి గుడి
తమ ఫేవరేట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి తెలుగు తమిళ ఫ్యాన్స్… చెన్నైలో గుడి కట్టారు. వాలెంటైన్స్ డే రోజున నిధి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గుండెల్ని పిండేస్తోంది
ఫిబ్రవరి 14న రిలీజైన ‘నీ చిత్రంచూసి’ లిరికల్సాంగ్తో మళ్లీ ట్రెండింగ్ లోకొచ్చింది శేఖర్ కమ్ముల లవ్ స్టోరి. గుండెల్ని పిండేస్తోందంటూ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఈ పాటకి.

వకీల్ సాబ్ షూటింగ్ పూర్తైన తర్వాత రానాతో కలిసి అటు అయ్యప్పనుమ్..కోషియుమ్ రీమేక్…ఇటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే బందిపోటు, వీరమల్లు, విరూపాక్ష వంటి టైటిల్స్ క్రిష్ కాంబో మూవీ కోసం సెట్ చేసారనే ప్రచారం జరిగింది. అయితే చివరికి ‘హరహర మహాదేవ్’ అన్న పేరును ఫిక్స్ చేసారట. దీనికోసం ఇప్పటికే ఫిల్మ్ నగర్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించినట్టు వార్తలొస్తున్నాయి.

పవర్ స్టార్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్ గా ఎంపికవగా…మరో హీరోయిన్ గా బాలీవుడ్ సోయగం జాక్వలిన్ ఫెర్నాడెజ్ ను కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే మరో స్పెషల్ సాంగ్ కోసం హాట్ యాంకర్ అనసూయను కూడా సంప్రదించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయ్యప్పనుమ్..కోషియుమ్ రీమేక్ కోసం కేవలం నెలన్నర డేట్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్…క్రిష్ కోసం మార్చి లేదా ఏప్రిల్ నుంచి నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటారట. ఏకబికిన షూటింగ్ పూర్తి చేసి ఏడాది చివరికల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేస్తారట క్రిష్. అంతా అనుకన్నట్టు జరిగితే 2022 సంక్రాంతి బరిలో ఈ మూవీ కూడా దిగుతుందని అంటున్నారు.

ఇస్మార్ట్‌ శంకర్‌ ఫేం నిధి అగర్వాల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. హీరో శింబుకి జంటగా నిధి అగర్వాల్‌ ‘ఈశ్వరన్‌’ అనే తమిళ్ మూవీలో నటించింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి బాగానే పేరొచ్చింది. సంక్రాంతి కానుకగా విజయ్ మాస్టర్ చిత్రానికి పోటీగా జనవరి 13న ఈశ్వరన్ రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత బాలాజీ కబా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్… సుశీంద్రన్‌. నందితా శ్వేతా మరో హీరోయిన్ గా నటించంగా కె.భారతీరాజా వంటి సీనియర్‌ స్టార్‌ డైరెక్టరు కీలకమైన పాత్రతో నటించారు. అయితే రీసెంట్ గా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో డైరెక్టర్ సుశీంద్రన్..నిధి అగర్వాల్ ను కాస్త ఇబ్బంది పెట్టాడు. ప్రెజంట్ ఈ ఇష్యూ కోలివుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈశ్వరన్‌ ఆడియో ఫంక్షన్ తాజాగా జరిగింది. హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడే సమయంలో.. డైరెక్టర్ సుశీంద్రన్ పదే పదే మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ‘శింబు మామా ఐ ల‌వ్యు’ అని చెప్పు అంటూ నిధిని బలవంత పెట్టారు. దీంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్టు కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరలయింది. వీడియో చూసిన ప్రేక్షకులు దర్శకుడి ప్రవర్తనపై కామెంట్లు విసురుతున్నారు. ఆడవాళ్లకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ చివాట్లు పెడుతున్నారు. ఇక ఈ ఇష్యూపై సుశీంద్రన్ స్పందించారు. సినిమాలో శింబుతో నిధి ‘మామా ఐ ల‌వ్యూ’ అని చెప్పే డైలాగ్ ఉంటుంద‌ని, దాన్ని హైలైట్ చేద్దామనే అక్కడ అలా చేసానని చెప్పుకొచ్చాడు.