మారుతున్న ట్రెండ్‌ ని ఫాలో అవుతూ.. డిఫరెంట్ సినిమాలను నిర్మించాలనే తపనతో ఉన్న వారికి… స‌హకరించి నిర్మాణంలో భాగ‌స్వామి కావడానికి తాను ఎల్లప్పుడూ రెడీ అని దిల్‌రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ అగ్ర నిర్మాత… డైరెక్టర్ క్రిష్‌తో చేతులు క‌లిపారు. వీరిద్దరూ కలిసి 101 జిల్లాల‌ అంద‌గాడు సినిమాను తెరకెక్కిస్తున్నారు.

దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, క్రిష్ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మాతలు శిరీష్, రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో రాచ‌కొండ విద్యాసాగ‌ర్ డైరెక్టర్‌గా ప‌రిచ‌యమవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ వైవిధ్య న‌టుడిగా, మంచి డైరెక్ట‌ర్‌గా, కథా రచయితగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ 101 జిల్లాల‌ అంద‌గాడు లో హీరోగా న‌టించాడు. ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయ్యేలా సినిమాకు హ్యూమరస్ టచ్ ఇచ్చాడు.

రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుగుతున్నాయి. మే 7న రిలీజ్ చేసెందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అవ‌స‌రాల శ్రీనివాస్ సరసన చి.ల‌.సౌ ఫేమ్‌ రుహాని. శర్మ న‌టిస్తుంది. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ మూవీకి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని సమకూర్చారు.