మనం తాజాగా చెప్పుకున్నట్టు బాలీవుడ్ బ్రహ్మాస్త్ర షూటింగ్ కి బైబై చెప్పి…సరికొత్త చిత్రానికి వెల్కమ్ చెప్పారు నాగార్జున. అవును నాగ్ నయా మూవీ ప్రారంభమైంది. అయితే అంతా అనుకున్నట్టు బంగార్రాజుతో బిజీ కావట్లేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ను పట్టాలెక్కించారు నాగార్జున. తెలంగాణ కేబినేట్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ కొట్టగా…ఈరోజే ముహూర్తపు షాట్ జరుపుకొంది నాగ్ – ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ హౌజెస్ కలిసి నిర్మిస్తున్నాయి ఈ చిత్రాన్ని. నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మారర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించి రెగ్యులర్ షూటింగ్ కూడా వెళ్లిపోనుంది మూవీ యూనిట్.