ఆరోజు వాహినీ స్టూడియోలోని ప్రధాన కార్యాలయంలో నాగిరెడ్డి , చక్రపాణి, ఇద్దరు కూర్చుని వున్నారు. చాలాసేపు వారి మధ్య మౌనం రాజ్యమేలింది. ఏదో ఆలోచిస్తున్నారు దానికి కొద్ది రోజుల క్రితమే వాళ్లు తొలిసారిగా నిర్మించిన షావుకారు విడుదలైంది. ఎన్నో ఆశలతో ఆశయాలతో సినిమా తీశారు. క్లాసిక్ అనే పేరు తప్ప కాసులు రాల్చలేదు షావుకారు, దాంతో నాగిరెడ్డి-చక్రపాణి చాలాకాలం మదన పడ్డారు చివరకు సామాన్య జనం మెచ్చే సినిమా ని తీయాలని నిశ్చయించుకున్నారు. వెంటనే కె.వి.రెడ్డి ని పిలిచి విజయా సంస్థలో రెండో సినిమా చేసే బాధ్యత కూడా అప్పగించారు. కేవీ రెడ్డికి బాగా ఇష్టమైన పింగళి అరేబియన్ నైట్స్ కథల్లో ని అల్లావుద్దీన్ అండ్ వండర్ఫుల్ ల్యాంప్ ప్రేరణతో కాశీ మజిలీ కథల ధోరణిలో “పాతాళ భైరవి” కథ తయారు చేశారు.
ఓ సామాన్యుడు రాజు గారి కూతురుని పెళ్లి చేసుకోవడం అనె పాయింట్ అందరికీ బాగా నచ్చింది. కథ మీద నాలుగు నెలలు బాగా చర్చలు జరిపి పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ తయారు చేశారు కేవీరెడ్డి కమలాకర కామేశ్వరరావు కలిసి స్క్రీన్ప్లే తయారు చేశారు. పింగళి మాటలు రాశారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో తీయాలని నిశ్చయించారు. విజయ సినిమా సంస్థ ఘంటసాల తో ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం ఘంటసాల విజయ వారికి 5 సినిమాలకు సంగీతం చేసి పెట్టాలి, ఈ ఒప్పందం ప్రకారం బయట సినిమాలు దేనికి ఆయన పని చేయకూడదు…. ఘంటసాల ఆధ్వర్యంలో సంగీత చర్చలు మొదలయ్యాయి, పింగళి నాగేంద్రరావు పాటలు రాశారు, బిట్ సాంగ్స్ తో కలిపి 12 పాటలు సిద్ధం చేశారు. పీజీ కమలాదేవి రేలంగి తమపై చిత్రీకరించి పోయె పాటలను పాడారు. షావుకారు కు పనిచేసిన మార్కస్ బార్ట్లే పాతాళ భైరవి కి కూడా కెమెరామెన్ గా తీసుకున్నారు. ఇక తారాగణం ఎంపిక మొదలైంది అప్పటికే ఫేం లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావును హీరో గాను ముక్కామల ను విలన్ గానూ తీసుకోవాలనుకున్నారు కేవీ రెడ్డి అప్పట్లో మాంత్రికుని పాత్రలకు ముక్కామల పాపులర్. అప్పటికే అక్కినేని కీలుగుఱ్ఱం వంటి జానపద చిత్రాలలో నటించి మంచి జోరు మీద వున్నారు. తెరపై అందాల రాముడు గా పేరున్న అలాంటి జానపద కథానాయకుడిని తోటరాముడు పాత్రకు తీసుకోవాలనేది కె.వి.రెడ్డి అభిప్రాయం నాగిరెడ్డి-చక్రపాణి మాత్రం షావుకారు లో చేసిన ఎన్టీరామారావును తీసుకుందామని సూచించారు …..

Pathala Bhairavi (1951), NT Rama Rao, SV Ranga Rao, K. V. Reddy, Chakrapani, nagi reddy, Vijaya Vauhini Studios


ఓ రోజు సాయంత్రం వాహినీ స్టూడియోలో నాగేశ్వర రావు గారు ఎన్టీ రామారావు గారు టెన్నిస్ ఆడుతున్నారు ఎన్టీ రామారావు కి ఒక బంతి మిస్ అయితే తర్వాత బంతిని చాలా కోపంగా బలంగా కొడుతున్నారు మొఖంలో కవళికలు మారిపోతున్నాయి ఈ ప్రక్రియ అంతా దూరం నుంచే కేవీ రెడ్డి గారు చూస్తున్నారు ఎన్టీ రామారావు గారి బాడీ లాంగ్వేజ్ అభినయం అన్ని కె.వి.రెడ్డి గారికి బాగా నచ్చాయి వెంటనే రామారావు గారిని తీసుకుందామని నిశ్చయించుకున్నారు.

Pathala Bhairavi (1951), NT Rama Rao, SV Ranga Rao, K. V. Reddy, Chakrapani, nagi reddy, Vijaya Vauhini Studios

ఎన్టీఆర్ ను తోటరాముడు గా తీసుకున్నారు కె.వి.రెడ్డి. విలన్ పాత్ర కి కూడా కొత్త నటుడి తీసుకుందామని భావించి ముందుగా అనుకున్న ముక్కామల ని కాదని ఎస్వీ రంగారావుకు అవకాశమిచ్చారు భక్త పోతన లో రంగనాథుని కుమార్తెగా నటించిన మాలతిని ఇందులో నాయికగా తీసుకున్నారు తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద లో కథానాయికగా చేసిన సురభి కమలాబాయి నీ తోటరాముడు తల్లి పాత్రకు ఎంపిక చేశారు అంజి గాడిగా బాలకృష్ణ ని తీసుకున్నారు.

Source: ETV Cinemas

విజయా సంస్థలో అందరికీ నెల జీతాలే…… 1950 ఫిబ్రవరి 5న పాతాళభైరవి షూటింగ్ మొదలైంది వాహిని స్టూడియోస్ లో భారీ సెట్ వేశారు….. విజయ వారు అమెరికా నుండి హేమ అండ్ ఆర్గన్ అనే వైద్యాన్ని 16 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు ఒక టీచర్ ని పెట్టి మాస్టర్ వేణు కి ఆ వాయిద్యాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. మాంత్రికుని గుహకు సంబంధించిన సన్నివేశాల నేపథ్యంలో ఈ వాయిద్యాన్ని ను ఉపయోగించారు. 1951 ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తయింది….. సినిమా విడుదలైన తర్వాత పెద్దగా ఈ చిత్రానికి టాక్ లేదు మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి, మూడు వారాలు యావరేజ్ కలెక్షన్ తో నడిచింది. ఆ తర్వాత కలెక్షన్లు పెరిగి ఎక్కడ చూసినా విజయ విహారమే ఈ సినిమా అద్భుత విజయం సాధించింది తెలుగు సినిమా వసూళ్ల సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచింది. విజయవాడ, బెంగుళూరు, గుడివాడ, నెల్లూరు లలో 25 వారాలు ప్రదర్శితమైన తొలి చిత్రంగా ఘన విజయాన్ని అందుకుంది.

Pathala Bhairavi (1951) NT Rama Rao SV Ranga Rao K. V. Reddy Chakrapani nagi reddy Vijaya Vauhini Studios