ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీకి చౌడప్ప నాయుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మొదట అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ అనుకున్నా…చౌడప్ప నాయుడుకే ఫిక్స్ అయ్యారని టాక్. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనే నటించబోతున్నారు. అటు త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. హీరోయిన్ ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. రష్మిక నటిస్తోందా…పూజా హెగ్దే కనిపిస్తోందా…తెలియాలి. అలాగే ఉప్పెన కృతిశెట్టి మరో హీరోయిన్ గా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించబోయే సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నారని టాక్. అందుకే విలన్ గా సైఫ్‌అలీఖాన్‌ ను తీసుకోవాలనే ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు. దేశమంతా గుర్తింపుతో పాటూ కమర్షియల్ గానూ పాన్ ఇండియా అన్నది సక్సెస్ మంత్ర. అందులో త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చే సినిమా కావడంతో దానిని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తీయాలన్నది తారక్ ప్లాన్.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో మూవీలో హీరోయిన్ రష్మికా ఫిక్సయిందని సమాచారం. పూజాహెగ్దే, కియారా, జాన్వీ కపూర్ వంటి పేర్లు వినిపించినా…చివరికి రష్మిక దగ్గర సెర్చ్ ఆగిందంటున్నారు. ఉగాది శుభ ముహూర్తాన ఏప్రిల్ 13న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కనుందని సమాచారం. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ ప్రాజెక్ట్…వచ్చే సంవత్సరం ఏప్రిల్ 19న థియేటర్స్ కి రానున్నట్టు తెలుస్తోంది. అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతిశెట్టి కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ సినిమా సంగతలా ఉంటే…ఇటు మార్చి 18న తన వైఫ్ లక్ష్మి ప్రణతి బర్త్ డే సందర్భంగా విలువైన కానుకను సమర్పించారట ఎన్టీఆర్. సిటీలో ఓ పెద్ద ఫామ్‌ హౌస్‌ను భార్య పేరిట రాయించి…అక్కడే సెలెబ్రేషన్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

యంగ్‌ టైగర్‌, మాటల మాంత్రికుడి సినిమాకు ముహూర్తం కుదిరింది. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 13న ఉగాదికి అధికారికంగా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రిస్టీజియస్‌ పాన్‌ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే.. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కలిసి చేయబోతున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఏప్రిల్‌ లో వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న అనంతరం మళ్లీ మే, జూన్‌ నెలల్లో ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తారట తారక్. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై ఎస్‌.రాధాకృష్ణ, కళ్యాణ్‌రామ్‌ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

‘క్రాక్‌’, ‘నాంది’ సినిమాల్లో వరలక్ష్మి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రమ్‌ NTR30లో ఓ రోల్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకురాలిగా వరలక్ష్మీ కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. అటు బన్నీ, కొరటాల శివ ప్రాజెక్ట్ లోనూ వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ పొలిటిషియన్ గా నటించబోతుందంటూ వార్తలొస్తున్నాయి.
సెప్టెంబర్లో సెట్స్ మీదికెళ్తున్న ఈ మూవీ కోసం ఆల్రెడీ వరలక్ష్మీతో చర్చలు జరిగాయట. జలకాలుష్యం నేపథ్యంగా కమర్షియల్ యాంగిల్ స్క్రిప్ట్ రెడీ చేసిన కొరటాల శివ ఈ సినిమాలో బన్నీని స్టూడెంట్ గా, రాజకీయ నాయకుడిగా చూపించబోతున్నాడు. బన్నీని ఢీకొట్టే రాజకీయనాయకురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో కూడా ఆమె రాజకీయ నాయకురాలి పాత్రే చేస్తుంది అంటున్నారు. ఏది నిజం…లేదా రెండు సినిమాల్లో లేడీ పొలిటిషియన్ లాగానే వరలక్ష్మీ కనిపిస్తోందా అన్న చర్చ జోరందుకుంది. చూస్తుంటే వరలక్ష్మీ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా మాత్రం కనిపించడం లేదు.