చెర్రీ – ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సంబంధించి మరో స్వీట్ సర్పైజ్ చేసారు రాజమౌళి. పాన్ వరల్డ్ వైడ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె భీమ్ ప్రేయసి జెన్నీఫర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆమె జన్మదినం సందర్భంగా ఒలీవియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీయూనిట్. ఆ తర్వాత ఆమెకు విషెస్ తెలియజేస్తూ “హ్యాపీ బర్త్ డే… డియర్ జెన్నీఫర్…” అని ట్వీట్ చేసారు ఎన్టీఆర్.

దాదాపు 400కోట్ల రూపాయల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. కొమురం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. తారక్ జోడిగా ఒలీవియా సందడి చేస్తుండగా, చరణ్ సరసన బాలీవుడ్ సోయగం అలియా భట్ కనిపించనున్నారు. శ్రీయ, అజయ్ దేవగణ్, ఐశ్వర్య రాజేష్, సముద్రఖని మిగిలిన ప్రధానపాత్రలు చేస్తునారు. కాగా డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీఅవుతోంది.