ప్రభాస్ రామునిగా నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో ఒక్కొక్కరుగా కాస్ట్ సెట్ అవుతున్నారు. ముందుగానే రావణుడిగా సైఫ్ అలీఖాన్ ను ప్రకటించిన డైరెక్టర్ ఓం రౌత్…ఈమధ్యే సీతగా కృతిసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారని చెప్పారు. అంతేకాదు రాముని తల్లిగా కౌసల్య పాత్రలో హేమామాలిని కనిపిస్తారనే ప్రచారమూ జరుగుతుంది. ఇదిలాఉంటే ఇదే సినిమాలో బీటౌన్ సీనియర్ కాజోల్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారట. రావణుడి భార్య మండోదరిగా ఆమె కనిపించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ పక్కన ఓ స్టార్ డం ఉన్న నటి మాత్రమే కావాలని సెర్చ్ చేసిన మేకర్స్..కాజోల్ అయితేనే వర్క్ అవుట్ అవుతుందని భావించారని టాక్. అందులో కాజోల్ తో తానాజీ సినిమా చేసిన అనుభవముంది డైరెక్టర్ ఓంరౌత్ కి. సో కాజోల్ మండోదరిగా కనిపించడం దాదాపు ఫిక్సయినట్టేనని తెలుస్తోంది.

ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న ఆదిపురుష్ కి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మొదటినుంచీ అనుకుంటున్న కృతి సనన్…సీతగా ఫిక్స్ అయింది. దాదాపు డైరెక్టర్ ఓం రౌత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కృతి పేరే ప్రథమంగా వినిపించినా…మధ్యలో అనుష్క నుంచి కీర్తి సురేష్ వరకు సీతగా నటిస్తారని ప్రచారం జరిగింది. చివరికి కృతి నే..సీతగా చూపించబోతున్నాడు.

ఇక లక్షణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. సోను టిట్టు కె స్వీటీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సన్నీ…ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడుగా కనిపించబోతున్నాడు.

ప్రభాస్ ఆదిపురుష్ గురించి వార్త రాని రోజంటూ లేకుండా పోయింది. రామునిగా ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాలో సీతగా కృతిసనన్ అనీ, కీర్తి సురేశ్ అని రోజుకో ప్రచారం జరుగుతుంది. తాజాగా లక్ష్మణుడి గురించి అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ ఫేం విక్కీ కౌశల్ ప్రభాస్ తమ్మునిగా కనిపిస్తాడని అంటున్నారు. ఉరి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్నాడు విక్కీ. ప్రస్తుతం అశ్వద్ధామ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా దాదాపు ఫిక్సయినట్టే అంటున్నారు. అంతకుముందు ఆదిపురుష్ కి సంబంధించి లక్ష్మణుడి పాత్రలో టైగర్ ష్రాఫ్ నటిస్తాడనే రూమర్ చక్కర్లు కొట్టింది.

బి టౌన్ స్టార్ హృతిక్ రోషన్, ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే వార్త జోరందుకుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాల దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ వీరిద్దరి కలయికలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వార్ తెరకెక్కించిన సిద్ధార్ధ్…ఇప్పుడు ప్రభాస్, హృతిక్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను యష్ రాజ్ సంస్థ నిర్మించనుంది.

ప్రభాస్ రామునిగా కనిపించనున్న ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభమైంది. టైటిల్ లోగోతో ఉన్న ఆదిపురుష్ ఆరంభ్ అనే సందేశాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ కి సంబంధించి రెండు వారాల క్రితమే మోషన్ కాప్చర్ షూట్ ను ప్రారంభించారు. ఇప్పుడిక నేరుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రభాస్. రావణుడిగా సైఫ్ అలీఖాన్, రాముని తల్లి కౌసల్యగా హేమామాలిని కూడా ఈ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సీతగా కృతీసనన్ అన్న పేరు వినిపిస్తుందే కానీ..ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ పక్కన సీతగా కనిపించే హీరోయిన్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక రాధేశ్యామ్ పూర్తి చేసుకొని రీసెంట్ గా సలార్ షూటింగ్ లో పాల్గొన్నారు ప్రభాస్. తెలంగాణ…గోదావరిఖని, రామగుండం బొగ్గుగనుల్లో షూటింగ్ వీడియోలు సైతం బాగా వైరలయ్యాయి. ప్రస్తుతం సలార్ నుంచి ఆదిపురుష్ లోకేషన్ కు జంప్ చేస్తున్నారు. చూస్తుంటే…ఏకబికిన అంగీకరించిన ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసేలా ఉన్నారు డార్లింగ్. ఇవి త్వరగా పూర్తయితేనే…నాగ్ అశ్విన్ కాంబో మూవీ కోసం కష్టపడాలి. అందుకోసమే తీరిక లేకుండా బిజీబిజీగా సినిమాలు చేసేస్తున్నారు.

‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను అంగీకరించారు. అన్నీ బడా సినిమాలే. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా…సలార్, ఆదిపురుష్ షూటింగ్ కూడా చేసుకుంటున్నాయి. నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ ఇంకా ప్రారంభంకావాల్సిఉంది. అయితే ఈ సినిమాల గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. తాజాగా ఆదిపురుష్ అమ్మ కనిపించేందు ప్రముఖ బాలీవుడ్ నటి ఓకే చెప్పారన్నవార్త ట్రెండింగ్ గా మారింది.
ఓం రౌత్ డైరెక్షన్లో రామునిగా ప్రభాస్ కనిపించనుండగా…ఆయనకు తల్లిగా కౌసల్య పాత్రలో హేమామాలిని నటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ ను చిత్రయూనిట్ సంప్రదించగా…ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. రామాయణ నేపథ్యంగా భారీ బడ్జెట్ ప్లస్ ప్యాన్ ఇండియన్ మూవీ కావడంతో హేమామాలిని వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. ఇదివరకు తెలుగు హీరో బాలకృష్ణకు తల్లిగా గౌతమీపుత్ర శాతకర్ణీలో నటించారామె. ఇప్పుడిలా ప్రభాస్ మాతృమూర్తిగా కనిపించబోతున్నారు. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తుండగా…సీతగా కృతీసనన్ పేరు వినిపిస్తోంది, అఫీషియల్ మాత్రం కాదు. ఏదేమైనా ఆదిపురుష్ ను మాత్రం 2022 ఆగస్ట్‌ 11న సినిమా హాళ్లకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

పాన్ ఇండియా 3డి మూవీగా ప్రభాస్ ఆదిపురుష్ ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసారు. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మోషన్ క్యాప్చర్ వర్క్ ప్రారంభించినట్టు డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించారు. మోషన్ క్యాప్చర్ షురూ అయింది. ఆదిపురుష్ లోకాన్ని సృష్టించబోతున్నాం అంటూ ఓ ఫోటోను షేర్ చేసారు. గ్రాఫిక్స్ టీంతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసారు. ఫిబ్రవరి 2న ఆదిపురుష్ సినిమా లాంచనంగా మొదలుకానుందని తెలియజేసారు.
తాజాగా సలార్ షూటింగ్ అఫీషియల్ గా ప్రారంభమైంది. రాధేశ్యామ్ క్లైమాక్స్ అయిపోగానే ప్రభాస్ సలార్ సెట్స్ లోకి జంప్ అవుతాడు. ఈలోపు గ్రాఫిక్స్ వర్క్ పూర్తిచేసుకుంటుంది ఆదిపురుష్ టీం. ఆపై దాదాపు ఒకే సెట్ లో షూటింగ్ జరిగే ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తాడు ప్రభాస్. అక తానాజీ తర్వాత రామాయణంతో అలరించేందుకు సిద్ధమైన డైరెక్టర్ ఓం రౌత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించే ఈ క్రేజీ సినిమా 2022 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆదిపురుష్‌’ ప్రాజెక్ట్ ముహూర్తం షాట్ కి ముస్తాబవుతోంది. అతి త్వరలో రాధే శ్యామ్ అవతారాన్ని చాలించి రాముని మేకప్ వేసుకోనున్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్‌… రావణుడిగా సైఫ్‌ అలీఖాన్… సీతగా కృతీ సనన్‌ కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఈ నెల 19 నుంచి నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలవుతుంది. సినిమా మొత్తాన్ని కూడా ఇదే స్టూడియోలో షూట్‌ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం నటిస్తోన్న లవ్ స్టొరీ ‘రాధే శ్యామ్‌’ను కంప్లీట్ చేసి, ‘ఆదిపురుష్‌’ సెట్లో అడుగుపెడతారట ప్రభాస్‌. ఈ మూవీ కోసం తన శరీరాకృతిని కూడా మార్చేశారు ప్రభాస్. 2022 ఆగస్ట్‌లో ‘ఆదిపురుష్‌’ని రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు