సూర్య సూరారై పొట్రు ఆస్కార్ బరిలోకి దిగింది. ఈమధ్యే ఆస్కార్ పోటీకి వెళ్లేందుకు స్క్రీనింగ్ సెలెక్షన్ కు వెళ్లిన ఈ మూవీ… రేసులో గెలిచి…బరిలో నిలిచింది. మన దేశం నుంచి ఆస్కార్ పోటీలోకి వెళ్తున్న ఈ సంవత్సరం ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా సూరారై పొట్రు పేరుతెచ్చుకుంది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో ఓటీటీలో దిగి ఇక్కడా మంచి పేరు సంపాదించింది. హీరో సూర్యకు, డైరెక్టర్ సుధా కొంగరకు దేశవ్యాప్త గుర్తింపునిచ్చింది. ఇప్పుడిలా ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి కోసం ఆస్కార్ పోటీలో వేటాడేందుకు సిద్ధమైంది.