సౌత్ స్టార్ హీరో సూర్య బ్లాక్ బస్టర్ తమిళ్ ‘సూరరై పోట్రు’, తెలుగు ఆకాశం నీ హద్దురా చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో నిలిచింది. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపినాథ్ బయోగ్రఫీని డైరెక్టర్ సుధ కొంగర సినిమాగా మలిచారు. గతేడాది నవంబర్ 12న అమెజాన ప్రైమ్ లో రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అన్ని రకాల ప్రజలు ఈ సినిమాను ఆదరించారు. కరోనా టైంలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతిపెద్ద తమిళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది సూరారై పోట్రు. నటనతో కట్టిపడేసే సూర్యతో పాటూ హీరోయిన్ గా అపర్ణ బాల మురళీకి ఈ మూవీ మంచిపేరుతెచ్చింది.
దేశమంతా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది సూర్య సినిమా. 2020 బెస్ట్ యాక్టర్, యాక్ట్రైస్, డైరెక్టర్, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో ఆస్కార్‌ రేసులో నిలిచి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రీసెంట్ గా ఆస్కార్ అకాడమీ స్క్రీనింగ్‌ రూంలో కూడా సూరారైపొట్రుని ప్రదర్శించారు.
అపర్ణా బాలమురళీ, మోహన్‌ బాబు, పరేశ్‌ రావల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత నవంబర్‌ 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 670 పేజీలుండే ‘సింప్లీ ఫ్లై’ బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి సక్సెస్‌ అయ్యారు