ఇద్దరూ చిన్న సినిమాలతో క్రేజీ స్టార్స్ గా ఎదిగారు. ఇద్దరూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బీజీగా మారారు. అయితే ఈ ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ట్లీట్స్ తో షూట్ చేసుకుంటారు. మాటల బాంబులు పేల్చుకుంటారు. అయితే వీళ్లిద్దరికీ తగ్గట్టే..నేషనల్ అవార్డ్ ఒకరివైపు…ఫిలింఫేర్ అవార్డ్స్ మరొకరి వైపు ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఈ హైడ్రామా ఏంటి….

కంగనా, తాప్సీ…వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుంది. ఇద్దరూ నేషనల్ స్టార్స్. యాక్టింగ్ తో అదరగొడతారు. అయితే ఒకరంటే ఒకరికి పడదు. ప్రభుత్వానికి పూర్తి సపోర్ట్ గా కంగనా ప్రవర్తిస్తే…జరిగేది తప్పు అనిపిస్తే చెప్పడం తాప్సీకి అలవాటు. ఇక్కడే చెడింది ఇద్దరికీ. ట్విట్టర్ వేదికగా యుద్ధం చేసుకున్నారు. సూటిగా ట్వీట్స్ సంధించుకున్నారు. కంగనా ఒకడుగు ముందుకు వేసి బి గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తాప్సీని గట్టిగానే ఢీకొట్టింది.

తాజాగా ముంబైలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. 2020లో విడుదలైన బాలీవుడ్ సినిమాలకిగానూ ఈ అవార్డ్స్ అందించారు. తాప్సీ నటించిన తప్పడ్ సినిమా అనేక విభాగాల్లో అవార్డులు అందుకుంది. బెస్ట్ యాక్ట్రెస్ గా తాప్సీని అవార్డ్ వరించింది. బెస్ట్ ఫిల్మ్ తో పాటూ బెస్ట్ స్టోరీ, బెస్ట్ సింగర్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ఇలా పలు విభాగాల్లో థప్పడ్ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను దక్కించుకుంది. అయితే 2020లోనే రిలీజైన కంగనా పంగా సినిమాకి ఎటువంటి అవార్డ్ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఈమధ్యే ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో బెస్ట్ యాక్ట్రెస్ గా మణికర్ణిక, పంగా సినిమాలకు గానూ కంగనా అవార్డ్ సొంతం చేసుకుంది. ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా నామినేషన్స్ లో కంగనా నటించిన పంగా మూవీ కూడా ఉంది. ఉత్తమనటి విభాగంలో తాప్సీతో పోటీపడింది కంగనా. కానీ థప్పడ్ సినిమా నుంచి తాప్సీనే ఉత్తమనటిగా ఎంపికచేసింది ఫిల్మ్ ఫేర్ టీం. ఇలా ఫిల్మ్ ఫేర్ టీం తాప్సీ థప్పడ్ సినిమాకి పట్టంగడితే…నేషనల్ అవార్డ్స్ జ్యూరీ తాప్సీ థప్పడ్ చిత్రాన్ని అసలు పట్టించుకోలేదంటున్నారు బాలీవుడ్ జనాలు.