గీతా ఆర్ట్స్…ట్రెండ్ కి తగ్గట్టు సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు విజయాలను అందుకుంటుంది. ఎందరో కొత్తవారిని సైతం ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన చావు కబురు చల్లగా చిత్రాన్ని సైతం కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించాడు. ఇదిలాఉంటే చి.ల.సౌ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని…మన్మథుడు-2తో ఫ్లాప్ ముద్ర వేసుకున్న డైరెకటర్ రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ అయిన..గీఏ2 బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్ సినిమా ఉంటుందని నిర్మాత బన్నీ వాసునే ప్రకటించారు.

ఓ లేడి ఓరియెంటెండ్ కథతో ఈసారి సినిమా రూపొందించనున్నాడు రాహుల్ రవీంద్రన్. త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సిఉంది. మన్మథుడు -2 సినిమాలా స్క్రిప్ట్ లోపాలు లేకుండా…మొదటి మూవీలా సింపుల్ కథను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాడని టాక్. గతంలో కూడా పరశురామ్, మారుతి, బోయపాటి శ్రీను వంటి డైరెక్టర్లు ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు…వారికి అవకాశం ఇచ్చి హిట్ కొట్టించిన సంస్థ గీతా ఆర్ట్స్. ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో…

ఆహా చిత్రం తాజాగా చెప్పినట్టు పవర్ స్టార్, సూపర్ స్టార్ నడుమ పోటీ అనివార్యమైంది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబో మూవీ 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా విడుదల గురించి ప్రకటించారు మేకర్స్. ఏ ఏం రత్నం నిర్మాణంలో ఎం ఎం కీరవాణి సంగీత అందిస్తున్న ఈ సినిమాకి హరిహర వీరమల్లు అనే టైటిల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే తొలి షెడ్యుల్ పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్ట్… హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన తాజ్ మహల్ సెట్లో రెండవ షెడ్యుల్ త్వరలో ప్రారంభంకానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథాంశంలో పవన్ కళ్యాణ్ ను వజ్రాల దొంగగా చూపిస్తున్నారు క్రిష్.

ఇక వచ్చే సంక్రాంతికే రిలీజ్ డేట్ బుక్ చేసుకుంది సర్కారు వారి పాట. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ వడ్డీ వ్యాపారి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అయితే ముందుగానే సంక్రాంతి సీజన్ లో కర్చీఫ్ వేసిన మహేష్ తో…తాజాగా పందెంలో దిగాడు పవన్. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు నువ్వా నేనా అనుకోనున్నారు. కత్తిపట్టిన పందెంకోళ్లలా బరిలోకి దిగనున్నారు. అవును వచ్చే సంక్రాంతికి సర్కారు వారి పాట రిలీజ్ అంటూ ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న ఈ మూవీని 2022 సంక్రాంతి బరిలో నిలిపారు. ఈమధ్యే దుబాయ్ లో రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుని గోవాకి పయనమైంది మూవీ యూనిట్. అయితే తాజాగా తెలిసిన విషయం ప్రకారం మహేశ్ కి పోటీగా రంగంలోకి దిగబోతున్నారట పవన్ కళ్యాణ్.

హరిహర వీరమల్లు అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న క్రిష్, పవర్ స్టార్ కాంబోమూవీ సైతం సంక్రాంతి పండుగకే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుందని టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు క్రిష్. పవన్ కళ్యాణ్ సన్నివేశాలతో పాటూ…మిగిలిన సీన్స్ అన్నింటిని ఏకబికిన లాగించేస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన చార్మినార్, గండికోట సెట్స్ లో ఈ పీరియాడికల్ డ్రామాను అనుకున్నట్టు చిత్రీకరిస్తున్నారు. మార్చి 11న మహాశివరాత్రికి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న క్రిష్…పూర్తి సినిమాతో వజ్రాల దొంగగా పవన్ కళ్యాణ్ ను సంక్రాంతి బరిలో దింపుతున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే…వచ్చే సంక్రాంతికి పవన్, మహేశ్ ల మధ్య ఆట మామూలుగా ఉండదని…పోటీ తప్పేలా లేదని అంటున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురామ్ కాంబో మూవీ సర్కారు వారి పాట శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిన్న బ్రేక్ తీసుకొని చిటికెలో వచ్చేస్తా అన్నట్టు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా దుబాయ్ లోనే మొదలుపెట్టారు. మూవీ చిత్రీకరణ కోసం తాను దుబాయ్ వెళుతున్నట్టు హీరోయిన్ కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేశారు. అయితే ఈసారి మహేశ్ బాబు, కీర్తి సురేశ్ లపై సాంగ్ షూట్ కూడా జరగబోతోంది.

సర్కారు వారి పాట సినిమా సెకండ్ ఫెడ్యూల్ కంప్లీట్ కాగానే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు మూవీ టీమ్. అక్కడి షూటింగ్ లోకేషన్స్ తో చిన్న ప్రోమో వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, కీర్తి సురేశ్, తమన్ వంటివారు సినిమా లోకేషన్స్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా ఇప్పుడిక చిన్న ప్రోమోతో అతితొందరలో కనిపించనున్నారు.