తాజాగా వకీల్ సాబ్ డబ్బింగ్ పనులను ముగించుకున్న పవన్ కళ్యాణ్…పాట పాడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడే కాదు. కొంత టైం తీసుకొని పాట పాడుతానని మాత్రం క్లారిటీ ఇచ్చారు. అది కూడా థమన్ సంగీత దర్శకత్వంలో. పవన్ కళ్యాణ్, రానా కాంబోలో మలయాళీ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇందులోనే పవర్ స్టార్ గొంతు సవరించేందుకు రెడీఅవుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్… స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా థమన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. వకీల్ సాబ్ కి కేవలం మ్యూజిక్ మాత్రమే అందించానని..త్వరలోనే తన సంగీతానికి పవర్ స్టార్ పాడనున్నారని చెప్పుకొచ్చాడు థమన్.