‘పేట్ట’ తర్వాత మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందనే టాక్ కోలీవుడ్‌ పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్లో రజనీకాంత్‌ నటించిన సినిమా ‘పేట్ట’… సూపర్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే మాస్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు రజనీకాంత్‌. నయనతార, కీర్తి సురేశ్, కుష్బూ, మీనా వంటివారు నటిస్తున్నారిందులో. ఇక ఈ సినిమా తర్వాతే కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్‌ విక్రమ్‌…ఇద్దరితో ఓ మల్టీస్టారర్‌ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజ్‌. ఈ సినిమా పూర్తయ్యాకే రజనీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట.