ఆంధ్రావాలా డిజాస్టర్ అప్పటికే వరుసగా పూరి నాలుగు హిట్స్ ఇచ్చాడు ఇండస్ట్రీకి పూరి తన కెరీర్లో ఎప్పుడూ చూడలేని డిజాస్టర్ చూశాడు అదే ఆంధ్రావాలా
శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అనే పేరుతో చిరంజీవి గారి కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట పూరి చిరు కి కథ చెబుదాం అనుకునేలోపే ఆంధ్రావాలా విడుదలై డిజాస్టర్ కొట్టింది పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారు మారిపోయాయి
పూరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను వెళ్తే చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో డౌట్ అందుకే ఇది కరెక్ట్ టైం కాదు అనుకున్నాడు పూరి, అయితే బద్రి సినిమా టైంలో చేసుకున్నా స్క్రిప్ట్ బయటికి తీసాడు పూరి అదే ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ ఈ స్క్రిప్ట్ ఎవరికీ చెప్పాలని ఆలోచిస్తుంటే అదే టైం కి రవితేజ కనిపించాడు రవితేజ కి ఉత్తమ్ సింగ్ స్క్రిప్ట్ ని నరెట్ చేశాడు పూరి స్క్రిప్ట్ వినగానే రవితేజ ఆనందంతో పొంగిపోయాడు మనం చేసేద్దాం పూరి అన్నాడు.


అయితే ప్రొడ్యూసర్ గా ఎవరు చేస్తారు అనుకుంటే అప్పుడు దొరికారు నాగబాబుగారు నాగబాబు గారికి స్క్రిప్ట్ నేరెట్ చేశారు ఆయనకు బాగా నచ్చేసింది అంతా సెట్ అనుకున్న టైంకి కరెక్ట్ గా రవి అన్నకి బంగారం లాంటి ఆఫర్ వచ్చింది అదే తమిళంలో సూపర్ డూపర్ హిట్ సినిమా ఆటోగ్రాఫ్ చేసే ఛాన్స్ రవి అన్న కి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే తనకి ఆటోగ్రాఫ్ సినిమా తమిళ్లో చాలా చాలా నచ్చేసింది ఒకవేళ తను వదిలేసుకుంటే ఆటోగ్రాఫ్ సినిమాని మరొకరు చేస్తారు అందుకే రవి అన్న ఛాన్స్ తీసుకోలేదు ఆటోగ్రాఫ్ సినిమాకి సైన్ చేసాడు అయితే పూరి తో ఈ గ్యాప్ లో ఒక సినిమా చెయ్ నేను ఈ సినిమా అయిపోయిన తర్వాత నీకు డేట్స్ చేస్తాను అన్నడు రవితేజ అయితే పూరి ఈ లోపు ఏం చేద్దాం అని ఆలోచించాడు ఈ లోపు తమ్ముడు సాయి రాజేష్ తో 143 మూవీ చేసేసాడు రవి అన్న సినిమా ఆటోగ్రాఫ్ ఇంకా సగం పూర్తవకుండానే పూరి మాత్రం ఆ సినిమా తీశాడు అంత వేగంగా ఉంటాడు పూరి వన్ ఫోర్ త్రీ హిట్టయింది అయితే రవి అన్న సినిమా మాత్రం ఇంకా కొలిక్కి రావట్లేదు సరే అని కథకి ఇంకెవరు సూట్ అవుతారని ఆలోచించాడు పూరి అప్పుడు సోనూసూద్ ఐడియా లోకి వచ్చాడు సోనూసూద్ కి కథ చెప్పాడు కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఓకే అవలేదు అయితేనే అప్పుడు మొదలైంది పూరికి ఎలాగైనా ఈ కథని తీయాలన్న కసి 2004 నవంబర్ 3 హైదరాబాద్ తాజ్ హోటల్ లో మహేష్ బాబుతో సిట్టింగ్ వేశారు పూరి పూరి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఎలాగైనా మహేష్ బాబు ఈ కథ ఒప్పుకుంటాడు అని కాన్ఫిడెన్స్ తోటి కథ చెప్పేసాడు.


కధ ఏంటంటే హీరో పేరు ఉత్తమ్ సింగ్ ఒక సిక్కుల అబ్బాయి మాఫియా వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళందర్నీ చంపేస్తాడు అయితే లాస్ట్ కి ట్విస్ట్ ఏంటంటే హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అన్నడు ఈ లైన్ విని మహేష్ బాబు చాలా ఎగ్జైట్ అయ్యాడు డెఫినెట్గా చేద్దాం పూరి అన్నాడు కానీ నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని అడిగాడు పూరి ఓకే అన్నాడు అయితే ఈ లోపు నేను నాగార్జున గారితో సూపర్ మూవీస్ చేస్తాను అన్నాడు సరే అనుకున్నారు ఇద్దరు.

Source: iDream


మహేష్ బాబుకు సినిమా పేరు నచ్చలేదు ఇంకొక పేరు చెప్పు అన్నాడు అప్పుడు చెప్పాడు పూరి జగన్నాథ్ పోకిరి అని మహేష్ బాబు కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది నెక్స్ట్ ఇయర్ ఇద్దరు కలిపి సినిమా తీసేసారు 2006 ఏప్రిల్ 28 న సినిమా విడుదలై ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు ఇండస్ట్రీ ఎప్పుడు చూడని హిట్.
మహేష్ బాబు కెరీర్లో ఇలాంటి హిట్ ఎప్పుడైనా పడుతుందా అన్న ఒక ఆశ్చర్యం ఫ్యాన్స్ లో ఒక పూనకం మహేష్ బాబు ఫాన్స్ కాలర్ ఎగరేసే తిరుగుతాం అనేలా తీశారు ఈ సినిమాని 63 సెంటర్లో 175 రోజులు ఆడింది 200 సెంటర్లో 100 రోజుల ఫంక్షన్ చేసుకుంది ఆల్ టైం నేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది కలెక్షన్ చూస్తే 66.5 కోట్ల గ్రాస్ 48.5 కోట్ల షేర్ వసూలు చేసింది తిరుపతిలో జయశ్యామ్ థియేటర్లో ప్రేక్షకుల రద్దీ తట్టుకోలేక రోజుకి 5 సార్లు చొప్పున 200 రోజులు నడిచి ఒక వెయ్యి ఐదు షోలు ప్రదర్శించిన ఏకైక చిత్రంగా అప్పటికి నేషనల్ వాడ్ని దక్కించుకుంది పోకిరి.