చిత్ర పరిశ్రమ చూపు గోదావరి తీరంపై పడింది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలను షూటింగ్ స్పాట్స్ గా మారుస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ ముగిసిందో లేదో…మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడక్కడ వాలిపోయారు. ‘ఆచార్య’కు అవసరమైన కరెక్ట్ లోకేషన్స్ అవే అంటూ డైరెక్టర్ కొరటాల శివ అక్కడ స్కెచ్ వేసారు. దాదాపు పుష్ప షూటింగ్ జరిగిన ప్రాంతాల్లోనే ఆచార్య కూడా తిరగనున్నాడు.

నాగచైతన్య నటిస్తోన్న ‘థాంక్యూ’ టీమ్ రాజమండ్రి బాటపట్టింది. ఈ నెలాఖరు నుంచి తూర్పు గోదావరి జిల్లాలో 15రోజుల పాటూ చిత్రీకరణ జరుపునున్నారు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. చైతూ, మాళవిక నాయర్లపై సీన్స్ షూట్ చేయనున్నారు. అంతేకాదు మిగిలిన నటీనటులతో కూడా థాంక్యూ మూవీ కీలక సన్నివేశాలను గోదావరి తీరంలోనే ప్లాన్ చేసారు దర్శకనిర్మాతలు.

రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రాజమండ్రి బయల్దేరింది ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను మణిరత్నం గోదావరి నదిపై ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సింగంపల్లి నుంచి పాపికొండలు వెళ్లే మార్గంలో చిత్రీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షూటింగ్ లో ఏ నటీనటులు పాల్గొంటారనే విషయాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

బాలనటిగా పేరుతెచ్చుకొని హీరోయిన్ గా ఫాంలోకి వస్తోన్న టైంలో స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ట్రాక్ తీసుకున్నారు శాలిని. హీరో ప్రశాంత్ జోడీగా 2001లో ఈమె చేసిన చిత్రమే చివరిది. అజిత్ వ్యవహారాలను, ఫ్యామిలీని చూసుకునే భార్యగా…ఇద్దరు పిల్లల తల్లిగా ప్రస్తుతం బాధ్యతను నిర్వర్తిస్తున్నారు షాలిని. అయితే గత కొన్ని రోజులుగా షాలిని మళ్లీ వెండితెరపై కనిపించే అవకాశం ఉందన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం అది నిజమేనని తెలుస్తోంది.
మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలోనే షాలిని కూడా నటించబోతున్నారని టాక్. అది కూడా ఓ హాస్య పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి షాలిని త్వరలోనే విచ్చేసి…చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. అయితే తన జీవితంలో గుర్తుండిపోయే ‘సఖి’ సినిమానిచ్చిన మణిరత్నం అడగ్గానే…కాదనకుండా ఒప్పుకున్నారట షాలినీ.